20, జులై 2024, శనివారం

సత్కర్మలే

 _*💫 సత్కర్మలే (మంచి పనులే)..*_ 

       _*ఎందుకు చేయాలి..!?  🫵*_

*꧁♪•••┉┅━❀❀━┅•••♪꧂*

*_కర్మ అంటే ఏమిటి ❓_* 

*_సత్కర్మ అంటే ఏమిటి ❓♪._* 


*_🪷 మొదట వీటి గురించి తెలియాలి♪. కర్మ అంటే మనం చేసే అన్ని పనులను కర్మలు అంటారు♪. అవి ఏవైనా కావచ్చు. కాని, చేసే పనులలో ప్రావీణ్యత వుండాలి. అప్పుడు అవి నీకు సత్ఫలితాన్ని ఇస్తాయి♪._* 


*_కర్మలలో ప్రావీణ్యత అంటే..❓_*  

*_🪷 మనం జ్ఞానాన్ని కలిగి వుండి కర్మలను ఆచరించడాన్ని కర్మలలో ప్రావీణ్యత అంటారు♪. జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. నేను ఎవరు? దేవుడు ఎవరు? ఈ ప్రకృతి ఏంటి? దీని కర్త ఎవరు? ఇలా విచక్షణ జ్ఞానాన్ని కలిగి వుండడమే జ్ఞానం•._* 


*_🪷 ఇక్కడ మనకు కావలసింది - సత్కర్మలే (మంచి పనులే) ఎందుకు చేయాలి♪?_* 


*_🪷 అవును, మంచి పనులే చేయాలి, ఎందుకంటే, ఇక్కడ ప్రకృతికి కొన్ని సహజ గుణాలు వున్నాయి♪. అవి భగవంతుడు సృష్టితో పాటు ఇచ్చాడు♪._* 


*_🪷 నువ్వు మంచి పని చేస్తే, నీకు మంచి ఫలితాన్ని, అదేవిధంగా చెడు చేస్తే ఫలితం కూడ అదేలా వుంటుంది. ఇక్కడ కర్మ ఫలితాలను అనుభవించడమే కాకుండా నీవు ఈ శరీరాన్ని వదిలిన తరువాత కూడ వాటిని అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే,  'నేను' అనే భావంతో.. అజ్ఞానంతో.. అహంకారంతో అన్ని పనులు చేస్తూ వుంటావు కావున._*  


*_🪷 అయితే, మంచి పనులు చేసి మంచి చేస్తున్నాను అని అనుకొని ఉంటే స్వర్గానికి వెళ్లి ఆ కర్మ ఫలితాలను దేవతలతో సమానంగా అనుభవిస్తావు♪. అవే చెడు అయితే నరకానికి వెళ్లి అనుభవిస్తావు♪. ఇక్కడ కర్మ భూమిలో అయితే స్థూల శరీరం వుంటుంది. అదే అక్కడ అయితే నీవు అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలే ఒక సూక్ష్మ శరీరంగా ఏర్పడి ఆ సూక్ష్మ శరీరం వాటిని అనుభవిస్తుంది♪. అంతే తప్ప వీటి అన్నిటితో ఆత్మకు ఎటువంటి సంబంధం ఉండదు♪. అంటే నువ్వు చేసే రెండు కూడా నీకు (అంటే ఆత్మకు) బంధనాలే అవి మంచి అయితే బంగారు జైలు అదే చెడు అయితే ఇనుప జైలు అన్నమాట♪. రెండును నిన్ను (అంటే ఆత్మను) బందీ చేసేవే♪._* 


*_🪷 మరి ఈ రెండింటి నుండి తప్పించుకోవడం ఎలా? ఎలా అంటే ఇక్కడ యోగాన్ని అవలంబించాలి, అప్పుడు మనం చేసే కర్మలను యోగం ద్వారా చేయాలి దానినే కర్మయోగం అంటారు. మనకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కర్మయోగం గురించి చాల విపులంగా తెలియజేసాడు♪. మనం చేసే ప్రతి పనిని భగవదర్పణ బుద్దితో, ఫలాపేక్షరహితంగా, కర్మలను ఆచరిస్తూ వుంటే నిదానంగా నీ మనస్సు అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఇలా శుద్ధి అయిన అంతఃకరణ భగవంతుని అన్వేషిస్తుంది♪. అప్పుడు నీలో సత్వ గుణం అధికమవుతుంది♪. అంతే కాకుండా చేసే కర్మలు నిష్కల్మషంగా కూడ వుండాలి అంటే చేసే పనులలో ఏ కల్మషం లేకుండా చేస్తే నువ్వు అప్పుడు కర్మలలో ప్రావీణ్యత సాధించినట్లు♪._* 


*_🪷 మరి మంచి పనులే ఎందుకు చేయాలి ?_* 

*_అంటే మంచి పనులు చేస్తూ వుంటే నీకు తెలియకుండానే నీ అంతఃకరణ (నీ మనస్సు) పరిశుద్దమవుతుంది. అప్పడు నీకు భగవంతుని తత్వం బోధపడుతుంది. (అర్థం అవుతుంది) లేకపోతే నీకు భగవంతుని తత్వం తెలియదు అప్పుడు నువ్వు ఇట్లే ఈ జనన మరణ చట్రంలో తిరుగుతూనే వుంటావు. ఒకవేళ దుష్కర్మలు ఆచరిస్తే నీకు పతనం తప్పదు. అది ప్రకృతి సహజ గుణం._* 


🙏✅👉 *_అందువలన ఈ రోజు నుండే నీవు మంచి పనులు మాత్రమే చేయాలి అని భీష్మించుకొని నీ మనస్సును స్థిరపరచు. అయితే, నువ్వు చేసే పని ఎలా వుండాలి అంటే,  కుడి చేత్తో చేసే పని నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనే విధంగా వుండాలి. అప్పుడు మానవుడు మాధవుడు అవుతాడు♪._*


*_🙏 ఇలా అందరూ మంచి పనులు చేసి, వారి అంతఃకరణను శుద్ధి పరచుకొని, భగవంతుని తత్వాన్ని తెలుసుకొని, గ్రహించి ఆ దేవదేవుని గురించి తెలిసికొని జ్ఞానాన్ని సంపూర్ణంగా సముపార్జించి అందరూ మీమీ  స్వస్వరూపాలను తెలుసుకోవాలని నా మనవి అదే విధంగా సాధన (ధ్యానం) చేసి మహాత్ములుగా మారాలని ఆ విధంగా మీ మనస్సులను ఆ భగవంతుని మీదకు మరల్చాలని నేను ఆ దేవదేవుడైన పరమాత్ముని ప్రార్ధిస్తున్నాను._* 🙏

               *_-(సూరి నాగమ్మ)._*

      ❀┉┅━❀ 🕉️ 

🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️

కామెంట్‌లు లేవు: