🔴సెలవలు కి తాతయ్య గారి ఊరు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు....
🔵ఎవరికి తెలియకుండా అమ్మమ్మ మన చేతిలో కుక్కిన పది రూపాయల కాగితం విలువ ఏన్ని లక్షలు చేస్తుందో లెక్క కట్టగలరా...
🟢తాతయ్య ప్రేమ తో స్వయం గా పొలం వెళ్లి కోయించి తెచ్చిన తాటి ముంజలు,ఈత పళ్ళ రుచి అమృతం కన్న తియ్యనిది.
⚫మామయ్య సైకిల్ ఎక్కి ఊరంతా కలయ తిరుగుతుంటే పుష్పకవిమానం ఎక్కినట్లు వుండేది.
🟡అమ్మమ్మ ఎదురింటి వాళ్ళ బర్రె జున్ను పాలను అడిగి మరి తెచ్చి చేసి పెట్టిన జున్ను రుచి ఇప్పటికీ నోట్లో నానుతూ వుంటుంది.
🔵కొత్త మామిడి ఆవకాయ పచ్చడి వేస్తున్నప్పుడు,చివరిలో మిగిలిన కారం లో అన్నం వేసి కలిపి తలో ముద్ద తినిపించిన తీరు వర్ణనాతీతం.
🟠అత్త కుట్టిచ్చిన రంగు రంగుల పూల చొక్కా వేసుకుంటే,పట్టు పీతాంబరాలు ధరించిన అనుభూతి కల్గి,ఆ చొక్కా చిరిగిపోయినప్పుడు పడ్డ భాద ఆపడం ఎవరితరం కాదు.
✍✍ *మూర్తి's కలం గత స్మృతులు*...
కాలమిస్ట్,9985617100.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి