విశేష వ్యాఖ్య:
అంతకు ముందు శ్లోకాలలో ఏంచెప్పారు ?...
కర్మచేతగాని, జన్మచేతగాని, జనబాహుళ్యప్రచారంచేత గాని మనకు అమృతత్త్నం రాదు అని. కేవలం త్యాగభావన
చేతమాత్రమే అమృతత్త్వం సాధ్యము. అని ముందు శ్లోకాలలో చెప్పినది ఎలాగ నిరూపిస్తున్నారు...
అందుకని ఎత్తుకోడం ఎలా ఎత్తుకున్నారు? ... కర్మ వలన చిత్తశుద్ది సాధ్యం...!
అంటే కర్మచేయకుండా చిత్తశుద్ది రాదు ఎప్పటికీ !
కాబట్టి ప్రతిఒక్కరూ మొదట ఏంమార్గంలో ప్రవేశించాలిట? ..... కర్మ మార్గములో.
కర్మ మార్గం అంటే ఏమిటి ? .....
అన్నీ కర్మే. ... కనురెప్పలు తీసి వేయడం కూడా కర్మయే! గాలి పీల్చి వదిలిపెట్టడం కూడా కర్మయే!!
రోజువారీ మనం మన దైనందిక కార్యక్రమాలలో చేసే సమస్తమూ కర్మలే. .. మేలుకోవడం కర్మ, కలగనడం కర్మ,
నిద్రపోవడం కర్మ, జననమరణాలు, వాటిమధ్యలో జరిగే వన్నీ కూడా కర్మలే. ఇవన్నీ ఒక కారణంనుండే
ఉదృవిస్తున్నాయి.
మనం ప్రతీ సంఘటనకు కారణం వేరువేరుగా ఉందని అనుకుంటున్నాం. రోజువారీ జీవితంలో 'దీనికి కారణం వేరే
ఉందిలెండి' అనుకుంటూ ఉంటాం.. ప్రతీదానికి కారణం వేరే ఉందని మన అభిప్రాయం. ...
కానీ వారేంచెపుతున్నారు? నాయనా ప్రతీ దానికి కారణములు వేరువేరు లేవు. ... జననం నుండి మరణం వరకు ఇది
అంతా ఒకటే ఘటన...
జీవితమనే ఘటన! ...... ఒక సంఘటనే ఇది.
కానీ మనం ఎలా అనుకొంటున్నాం? ప్రతీ సంఘటననూ వేరువేరుగా చూస్తున్నాం.
కాబట్టి జీవభావము అంటే ఏమిటంటే ఈ భేద బుద్దియే జీవభావము.
ఏకత్వభావనే ఆత్మభావము.
కాబట్టి మనం కర్మ చేసేటప్పుడు ఎలా చేయాలి? ఆ కర్మని చిత్తశుద్ది సాధించడంకోసం ఎలా చేశాం?
కర్మ ద్వారా ఆత్మోపలబ్ది జరుగుతుందా? ... అన్న విషయాన్ని ఈ శ్లోకంలో చర్చిస్తున్నాం.
ఈ జన్మలో నువ్వు ఆత్మ స్వరూపాన్ని, బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలని గానీ , ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందాలనే
జిజ్ఞాస గాని - ఇవి ఏమైనా కలిగినయ్ అంటే కారణం ఏమిటి అని ప్రశ్న వేశారు?
అందరికి కలగడం లేదుగా.... భూమండలం మీద 750 కోట్లమంది మానవులుంటే ఈ ఆసక్తి అందరికి కలగడంలేదు.
ఎందువలన అంటే గత జన్మనుండి నువ్వు తెచ్చుకున్న జ్ఞానవాసన అంటూ ఏదుందో, సాధనా పరమైన వాసన అంటూ
ఏదుందో, ఆ పుణ్య వాసనా బలం చేత నీకు ఈ జన్మలో ఒక ఆసక్తి, ఒక జిజ్ఞాస కలిగింది.
అంటే దైవసాక్షాత్కారం, ఆత్మసాక్షాత్కారం, ఈశ్వరసాక్షాత్కారం - ఇవన్నీ సాక్షాత్కారాలే... వీటియందు ఆసక్తి, జిజ్ఞాస
కలిగాయి.
మిగిలిన వారందరూ ఏం ఆసక్తి కలిగియున్నారటా - ప్రపంచభావన కలిగి ఉన్నారట.!
అంటే ధనధాన్యవస్తు సమృద్ది కలిగియుంటే చాలు అనే లక్షణం కలిగివున్నారు. అంచేత రోజూ ఉదయం లేచినప్పటినుంచి
రాత్రి నిద్రపోయేవరకు, రాత్రి నిద్రలో కూడా ఏం కలుగుతున్నాయ్?
-... ఆ ప్రపంచ భావనలే కలుగుతున్నాయి. ... ప్రపంచానికి భిన్నమైన భావనలు కలగడంలేదు.
ఎందుకనిట ? --- సదా ఆ ప్రపంచంతో కలిసి రమిస్తున్నాం కనుక. .. విడిగా లేవు. ఆ ప్రపంచంలో ఉన్న వస్తువులు,
ధనధాన్యాలు, .. ఏ సమృద్ది కలిగితే సుఖసంతోషాలు నీకు కలుగుతాయనే ఆసక్తి బలంగా ఉందో అదే ఆసక్తి నీ
కలలోకూడా పనిచేసి నీ మానసిక ప్రపంచాన్ని తయారుచేస్తుంది.!
ఇంకేం చేస్తోంది? ...
ఆ వస్తుఉపలబ్ది నీకు స్వయంగా కలగకుండానే నువ్వు అనుభవించినట్టు నీకు సుఖప్రాప్తిని కలుగచేస్తోంది!
తద్వారా నువ్వు మేలుకోగానే రోజూ ఏం చేస్తున్నావట ?! ....
ఆ కలలో అనుభవించిన వస్తువును ఇలలో అనుభవించాలని చూస్తున్నా వట.
జననం నుండి మరణం దాక మనం చేస్తున్నది ఒకటే పనిట ? ... ఏమిటది? ...
కలలో కలగనడం,... ఆ కలగన్న వాటిని అక్కడే యధాతధంగా అనుభవించడం, ...
కలలో ఆకలేసిందండీ... , అప్పుడు లడ్డూ తింటే బాగుండు అనిపించిందట. !...
ఆకలి వేయడానికి, లడ్డూ తినడానికి సంబంధం ఏమిటి?
లడ్డూ తింటే ఆకలి తీరుతుందన్న ఒక నిర్ణయం ఉందా పోనీ? .. కానీ నీకనిపించింది అంతే !
కలలో ఆకలి వెయ్యడం ఎంత వాస్తవమో, లడ్డూ తింటే ఆకలి తీరుతుందన్నది కూడా అంతే వాస్తవం! ...
ఆ ఆసక్తి ఇప్పుడు కలలో లడ్డూని సృజించింది. లడ్డూ తింటే ఆకలి తీరుతుందని స్పురించింది.. తినేశావ్ ! .....
లడ్డూ తిన్న సుఖం కూడా వచ్చేసింది! తృప్తి కూడా కలిగింది. ఆకలి తీరింది !
మేలుకుని చూస్తే ..... లడ్డూ లేదు.
కానీ నీ స్పురణ ఎక్కడ ఉండిపోయింది? లడ్డూ మీద ! ... ఇలలో లడ్డూ తిన్న అనుభవం పూర్తికాలేదు కాబట్టి. ... ఆ
అనుభూతి సంతృప్తికరంగా లేదు. ...
పూర్ణమైనట్టి ఆసక్తి సంతృప్తి చెందలేదు. .. అప్పుడేం చేశాడట? .... ఇలలో లడ్డూ కోసం ప్రయత్నం చేశాడు.
కలలో లడ్డూ ఎవరు ?-... నువ్వే.
తిన్నదెవరూ ?.... నువ్వే.
ఆకలి ఎవరూ ?... నువ్వే .
సంతృప్తి పొందినదెవరూ ? ... - అదికూడా నువ్వే.
కానీ ఇలలో అలా ఉండదే!
నేనూ, లడ్డూ ఒకటే ... అని లడ్డూ షాపు వాడిదగ్గరకెళ్ళి అన్నావనుకో ,
ఏం అంటాడు వాడు? ... నువ్వు, లడ్డూ ఒకటే అయితే ఇక్కడిదాకా రావడం ఎందుకూ, అంటాడా లేదా ? ....
ఇంకేవంటాడు ?... - ఆ! వెర్రోచ్చింది అంటాడు!
అంచేత ఇలలో ఎలావున్నాం ? ... అన్నీ భిన్నంగా, వేరువేరుగా ఉన్నాం. ... కానీ కలలో ప్రపంచాన్ని ఎవరు
సృష్టించారు? - నువ్వే! .. కాబట్టి ఆ ప్రపంచంలో వస్తువులు కూడా నువ్వే!!
ఇలలో సూది బెజ్జం లోంచి ఏనుగును పంపించాలి.. వెడుతుందా ? ... వెళ్ళదు...
కానీ కలలో.... ?
మనకి ఎలా కావాలంటే ఆలా !!
అంటే ఇలలో సాధ్యంకాని వన్నీ కలలో సాధ్యమౌతాయి... ఎందుకంటే ఆది సూక్ష్మం! .. స్టూలం కాదుగా.
నువ్వేమనుకుంటున్నా వ్ ? సూక్ష్మంలో జరిగినవన్నీ స్టూలం లో జరగాలంటున్నావ్...
అదెప్పటికీ సాధ్యం కాదుగా ... !
ఏనుగుపట్టేటంత బెజ్జం స్టూలంలో ఉండదు... కానీ సూక్ష్మంలో సాధ్యమే.
ఈరకంగా ఇలలో సాధ్యం కానివన్నీ కలలో సాధ్యమే.
ఈవాళ రాత్రి కలలో భాగ్యలక్ష్మి లాటరిలో 100కోట్ల రూపాయలు తగిలినట్టు ఆసక్తికలిగి ఆమేరకు కల వచ్చింది.
సాధ్యమేగా కలలో...
కలలో లాటరీ వచ్చిందని ఇలలో ఏమి చేసాడు? ... జీవితమంతా లాటరీ టిక్కెట్లు కొంటూనే ఉన్నాడు. ఎప్పుడుచూసినా
1....
మరి ఏదిబలంగా పనిచేసినట్టు? ... ఆ ఆసక్తియే కలయ్యింది.
ఆసక్తి అంటే ? .... రాగద్వేషాలు రెండూ బలంగా ఉన్నాయి.
ఎవరితోనయినా శతృత్వభావన బలంగా ఉందనుకో అప్పుడు వాళ్ళుకూడా కలలోకి వస్తారు.
వచ్చి ఏంచేస్తారు ? .... ఇలలో చాలలేదు పోట్లాట. కలలోకూడా ఫైటింగే !!
పోనీ కలలోనైనా వాడితో సఖ్యంగా ఉండొచ్చుగా ?!... అబ్బే. ... ఆ భావనలో స్మృతిజ్ఞానం స్థిరపడిపోయిందిగా, ఇంకా
దాంట్లోనే తిరుగుతూ ఉంటుంది. దాంట్లోంచి బయటకు రాదన్నమాట.
రావాలంటే ఇలలో ప్రయత్నించాలే కానీ కలలో ప్రయత్నిస్తాననడం వట్టిదే...
అట్లాగే కర్మవలన వచ్చేటటువంటి సుఖదుఃఖాలనే ఫలితాలవంటి చట్రం ఏదైతే ఉన్నదో ఆ కర్మ చట్రంలో నీ
జననమరణాలు వస్తూ, పోతూ ఉంటాయి.
ఒకవేళ ఇదే కర్మ దైవం కోసం చేయబడింది, ఫలాసక్తిలేకుండా చేయబడింది. ...
అప్పుడేమయింది? ... నిష్కామకర్మ అయ్యింది.
మన జీవితంలో నిష్కామకర్మ అంటూ ఏదైనా ఒకటుందా ? ...
ఏమీ ఆశించకుండా చేయడమే నిష్కామకర్మ అయినట్లయితే, అక్కడేం చేయమన్నాడు”...
ఈశ్వరార్పణ బుద్దితో చేసినప్పుడు మాత్రమే అది నిష్కామకర్మ అయ్యింది.
అంటే?...
భార్యకి చెయ్యలా ... ఈశ్వరుడికి చేశావ్!
భర్తకి చెయ్యలా ... ఈశ్వరుడికి చేశావ్!
పిల్లలకి చెయ్యలా ... ఈశ్వరుడికి చేశావ్!
తల్లితండ్రులకు చెయ్యలా ... ఈశ్వరుడికి చేశావ్!
అంటే వాళ్ళ స్టానంలో ఎవరిని పెట్టాలట ? ... ఈశ్వరుడిని.
అప్పుడది నిష్కామ కర్మ అయ్యింది.
కానీ నాకు ఈశ్వరుడు అదిస్తాడు, ఇదిస్తాడు ... అంటే, మళ్లీ కదా మామూలే.
నేను ఈశ్వరుడిని ఏమీ కోరను అంటేనే నిష్కామకర్మ.
కానీ ఈశ్వరుడిని దల్లగా దూడమని కోరవచ్చా? ... (ఆడియన్స్ ప్రశ్న).
ఏమండీ ... ఈశ్వరుడిని చల్లగా చూడు, వేడిగాచూడు ... ఆయనకి వేరే పనేమీ లేదా ?
మనం ఆలోచించాలి కదా...
ఇలా అయితే మన కో రికలన్నీ నేను వేరే, ఈశ్వరుడు వేరే అనే భావాన్ని బలపరిచే విధంగానే ఉన్నాయి.
'ఈశ్వరుడిచ్చేవాడు, నేను పుచ్చుకునేవాడిని' అన్నట్టుగా.
అసలు ఈశ్వరుడు ఏమిస్తాడు?.....
జ్ఞానం తప్ప ఇంక ఏమీ ఇవ్వడు!
గ్రా
నిరూపణ ఎలా ? ... అదేమిటండీ .. ఇన్నాళ్లు మేము ఆయన్ని ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ గుర్తాలు, ఏనుగులు,
చీమలు, ఆ10 అడుగుతూనే ఉన్నాంకదా. చ అడిగినివన్నీ ఇస్తున్నాడు కదా, అడగనిఎి కూడా ఇస్తున్నాడు.
మనం ఏమనుకుంటున్నాం? ... ఈశ్వరుడే ఇస్తున్నాడని అనుకుంటున్నాం...
నిన్ను ఈశ్వరుడికి అనుకూలంగా ఉండవయ్యా అంటే, నీ మనసుకి అనుకూలంగా ఈశ్వరుడిని ఉంచుకోవడానికి
ప్రయత్నిస్తున్నాం...
ఈశ్వరానుగ్రహం ఏది లభిస్తే అది స్వీకరిస్తా అనడం లేదు, ఏమంటున్నాం? నాకు కావలసినది ఈశ్వరుడివ్వాలని
అంటున్నాం. చ
ఇప్పుడు నీ చెయ్యి పైచేయి అయినట్టా లేక ఈశ్వరుడి చేయి పైన అయినట్టా?
ఇది ఎప్పడికైనా సాధ్యమా ఫం...
ఈశ్వరుడు జగన్నియామకుడు, సృష్టి కర్త అని ఒప్పుకొంటున్నావా ? ... మరి ఆయనను నీవు ఎలా డిమాండ్
చేయగలుగుతావ్? ....
అయన అధిపత్యానికి లొంగి ఉన్నవాళ్ళమే కానీ ఆయనను ఒత్తిడి చేయగల సమర్ధత మానవులకు లేదు.
కానీ భ్రాంతి చేత, ... ఏంభ్రాంతి చేత ? ,.... కర్మభ్రాంతి చేత - నేను అడగందే ఈశ్వరుడెలా పెడతాడు? ... అడగందే
అమ్మ యినా పెళ్టదుకదా - అనే లౌకికమైన స్టాయికి ఈశ్వరుడిని తగ్గించాం...!
కానీ నువ్వు తగ్గించినంత మాత్రాన ఈశ్వరుడి స్టాయి తగ్గిపోదుకదా... !
అయన వరదానం ఏమిటి? ..... జ్ఞానం ఇవ్వడం మాత్రమే!
ఆ ఒక్క జ్ఞానం ఇస్తే నువ్వే అన్నీ సమర్టించుకో గలుగుతావ్. ... ఆ ఒక్క జ్ఞానం తీసేస్తే ఏమవుతుంది?... మిగిలిన
84లక్షల జీవరాశులలో సమానం అయిపోయారగా !
పోల్చిచూసుకోండి? ఒక చీమ, ఒక దోమ,సూక్ష్మ జీవులు .... వీటితో పోలిస్తే నీ జీవితం ఎంత ఉత్తమమైనది ? ఇన్ని
హీనా జంతువులతో పోలిస్తే ఏంటో ఉన్నతమైన జీవనం సాగిస్తున్నావ్. ... కానీ నీ పోలికంతా ఎవరితో ఉంది ?
ఒక టాటా అయితే చాలా ? లేకబిర్లా?.... ఇద్దరూ చాలరు! అంతూ , దరీ లేదు ఆశకు.... అనంతం అంటే అర్ధం తెలీదు
కానీ అనంతమైన డబ్బు కావాలి !
కాబట్టి పోలిక ద్వారా నియమించలేని నీ కర్మ సంజాతమేదైతే ఉన్నదో, అది ఈశ్వరుడిని ఎలా నియమిస్తుంది ? ....
ఈశ్వరుడు కర్మకు అధిస్టానం. ... అయన నీకు ఏమి సహాయం చేయగలుగుతాడంటే, ఆ కర్మని అధిగమించడానికి
కావాల్సిన జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వగలుగుతాడు...
ఒక జన్మనుండి మరొక జన్మకు నీవు మారినపుడల్లా నీలో జ్ఞాన వృద్ది జరుగుతోంది.. కాబట్టి అవసాన దశలో నీకు ఏది
ఉపయోగపడుతోంది ? ... - నీవు చివర శ్వాసలలో ఉన్నప్పుడు నువ్వు ఏవైతే కష్టపడి పోగుచేసుకున్నావో అవి నీకు
అక్కరకొస్తున్నాయా ... మీ ఇంట్లో ఉన్న కంచాలు, మంచాలు చాల ఉన్నాయిగా - ఇవి ఏమైనా పనికొ స్తున్నాయా
మరణకాలంలో ? ...
చనిపోయేకాలంలో నీలో ఉన్న జ్ఞానము, నీలో ఉన్న అజ్ఞానము - ఈ రెండే లెక్క కట్టబడతాయి. ... ఈ రెంటిని ఆధారం
చేసుకొని,... ఈ రెంటిని బేరీజు వేయబడి తద్వారా నువ్వు ఒక ఉపాధి నుండి వేరొక ఉపాధికి మారుతున్నావ్....
ఈ జన్మకి వస్తూనే ఒక మూట తెచ్చుకున్నాం... , తెచ్చినవాటిని అనుభవించేస్తే, ఒకపని అయిపోతుంది... కానీ మనం
ఏంచేస్తున్నాం ?...
ఎంత అనుభవించినా, ఇంకా కావాలి అనే కోరిక మిగిలిపోతోంది!
... మీ ఇంటికివెళ్ళి, ఒక డైరీ పెట్టుకొని “ఇంకా కావాలి' అని తోచే వాటి లిస్ట్ రాయండి. ... వాటన్నిటి ఎదురుగా ఒక
ప్రశ్న వేయండి... “ఇవన్నీ మరణకాలంలో ఏమైనా ఉపయోగపడతాయా ? ' అని.
ఈసారి వచ్చినప్పుడు చెప్పండి, ఎంత జాబితా వచ్చిందో! పం
మీకు స్పష్టత రావాలి.
ఎప్పటికైనా ఈ “ఇంకా కావాలి అని తోచే వాటి లిస్ట్ సున్నాకి రావాలి.... !
అప్పుడు మీరు ఆత్మనిష్టులయ్యే అవకాశం ఉంది.
ఈ “ఇంకా కావాలి” అని తోచే వాటి లిస్ట్ ఎప్పటికైనా మిమ్మల్ని మళ్ళీ కర్మచక్రంలోకి, మళ్ళీ జననమరణచక్రంలోకి
తీసుకువస్తాయే గానీ, మీకు ఎప్పటికి కూడా ఆత్మనిష్టులయ్యే అవకాశం అందించవు.
కాబట్టి మొదటి లిస్ట్ ఏంరాసుకోవాలి, ఎవరికి వాళ్ళు? ...... “ఇంకా కావాలి” అని తోచే వాటి లిస్ట్!
మా జీవితం మొదట్లో మాకు ఇలాగే చెప్పారు - 'నాయనా , నీకం కావాలి” అని...
మాకేం అక్కరలేదు అన్నదశకు వచ్చిన తరువాతే మాకు జ్ఞానం గూర్చి చెప్పడం ప్రారంభించారు... అప్పడివరకు జ్ఞానం
గురించి చెప్పలేదు. మం
“ఇంకా కావాలి' అని తోచే వాటి లిస్ట్ పెట్టుకొని ఈ వివేకచూడామణి పూర్తయ్యేలోపుగా పరిష్కారం అయిపోవాలి. ఆలా
అయితేనే నీవు ఆత్మనిష్టుడవు కాగలవు...
ప్రపంచం మీద నీకు ఏమాత్రం ఆసక్తి మిగిలిఉన్నప్పడికి నీకు మరల కర్మచక్రం లో పడకతప్పదు.
“ఇంకా కావాలి” అనే జాబితా పూర్తిగా పోవడం ద్వారా నీకు చిత్త శుద్ది లభిస్తుంది.
ఇంకొక లిస్ట్ రాసుకోవాలి - “ఇది లేకుండా నేను ఉండలేను' ... అనే లిస్టు. ...
ఎన్నున్నా ఫరవాలేదు... ఒక పుస్తకం రాయి అవసరమైతే... !
ఎందుకంటే నీకు ఒక స్పష్టత వస్తుంది.
ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా నీమీద నీకు ఒక అధ్యయనం చేసే అవకాశం ఇది... ఏంకావాలో తెలుసు, ...
ఏదీలేక ఉండలేవో కూడా తెలుసు...
ఈ రెండు జాబితాలలో ఈశ్వరుడు ఉండడు ! .... ఉండే అవకాశం ఉందా !?
ఇప్పుడు ఈశ్వరుడిని ఎక్కడ చూడాలి? ... మొదట నీలోనేగా! ముందు నీలోపల ఈశ్వరదర్శనం జరగాలి...
కాబట్టి ఈ రెండు జాబితాలను ప్రాధాన్యతాక్రమంలో నువ్వు స్కీనింగ్ చేయాలి... విచారణ చేయాలి.
అందులోఅన్నీ అవసరమా 1... గ
మా ఇంట్లో బెదలు పట్టకుండా ఉంటేబావుణ్ను ... బెదలు పడితే నేను ఉండలేను. ' - ఏంచేయాలో రాసుకో ...
నువ్వు గమనించేదేమిటంటే చాలావరకు ఈ ప్రపంచం, ప్రపంచంతోనే సమాధాన పడిపోతోంది ...
ఈశ్వరుడివరకు అవసరం లేదు.
కానీ ఈశ్వరుడు లభిస్తేనే మాత్రమే సమాధానపడే అంశాలు కొన్ని ఉంటాయి...
అలాంటి అంశాలు మిగిలినప్పుడు మాత్రమే నీకు ఈ తత్త్వజ్ఞానం అనేది ఉపయోగపడుతుంది.
కర్మాచరణ వల్ల చిత్తశుద్ది ఎవరికైతే కలిగిందో, ఆ చిత్తశుద్ది వలన ఈశ్వర సాక్షాత్కారాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని, బ్రహ్మ
సాక్షాత్కారాన్ని పొందాలనేటటువంటి జిజ్ఞాస తీవ్రంగా ఉన్నటువంటి వాడెవడైతే ఉన్నాడో , వాడికి మాత్రమే ఈ
వస్తూపలచ్చి - బ్రహ్మవస్తూపలబ్ది, అనేది సాధ్యమవుతుంది.
మిగిలినవన్ని ప్రపంచంతో సరిపెట్టేయవచ్చు... ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులద్వారా ఆ కోరికలు తీరిపోతాయి.
కానీ ఈ ముక్తి, మోక్షం అనేటటువంటివి మాత్రం ఆత్మ సాక్షాత్కారం తో మాత్రమే, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం తో మాత్రమే
సాధ్యమౌతాయి.
ఈ రెండూతో తప్ప మిగిలినవన్నీ కర్మ ఆసక్తి ద్వారా, కర్మ విచారణ ద్వారా, కర్మ ఆచరణ ద్వారా సాధించడం సాధ్యం
కాదు!
నిరంతర బ్రహ్మ విచారముబేతనే ఆత్మ సాక్షాత్కారం సిట్జించును - ఇప్పుడు నిరంతరాయంగా ప్రపంచాన్ని గురించి
విచారణ చేస్తున్నామా ౪ లేక నిరంతరాయంగా బ్రహ్మమును గురించి విచారణ చేస్తున్నామా? ...
మనం చేసే విచారం అంతా ప్రపంచాన్ని గురించే - కాబట్టి ప్రపంచాన్నే పొందుతున్నాం. -. అందువల్ల ఈ ప్రపంచం స్థానంలో
ముందు ఈశ్వరుణ్ణి పెట్టాలి.
“నీ” స్థానంలో ఈశ్వరుణ్ణి పెట్టాలి. ... పెట్టగా, పెట్టగా నీలో భక్తి బాగా బలపడి, బలమైనటువంటి భక్తిభావన స్థిరపడి, ఆ
భక్తిభావన నుంచి నువ్వు జ్ఞానభావనకు ఎదుగుతావ్. ...
ఆలా ఎదిగినప్పుడే నీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.
ప్రపంచ భావన నీకు తోచినంతవరకు నీకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలుగదు.
*ఓం శాంతిః శాంతిః శాంతిః*
*సేకరణ:* శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి