13, మార్చి 2022, ఆదివారం

మనసు మాట వినదు

 మనసు మాట వినదు 

దాదాపు అందరు సాధకులు చెప్పేది ఒక్కటే అదేమిటంటే నేను సాధన చేస్తున్నపుడు నా మనసు నా మాట వినటంలేదు మనసుని నియంత్రించుకోవడం ఎలా ఈ ప్రశ్న ఈ రోజుదికాదు  యుగయుగాలనుండి ముముక్షువులను వేధిస్తున్నది. సాధకునికి మనస్సు వశం కాకపొతే ధ్యానం  నిలవదు. ఎంతసేపు ధ్యానం చేసిన కూడా ఫలితం ఉండదు.  మరి ఈ మనస్సుని ఎలా నియంత్రించాలి. ఈ విషయంలో మనకు అనేక మంది మహర్షులు అనేక విధాలుగా తెలిపారు.  శ్రీ  భగవానులవారు కూడా భగవత్గీతలో చాలా స్పష్టంగా తెలిపారు. 

మనస్సు  చేష్టలు:

మన పంచేంద్రియాలు వాటి వాటి అవధులలోనే ప్రవర్తిస్తాయి. కన్నులు నీ ముందు ఉన్నవాటిని మాత్రమే చూడగలవు.  నీకు దూరంగా ఉన్నవాటిని లేక వాటిమధ్య ఏవైనా ఇతరవస్తువులు వున్నా వాటినిదాటి నీ దృష్టి పోదు. అంటే కండ్లకు వున్న శక్తికి ఒక అవధి (limitation ) వున్నది.  అదేవిధంగా చెవులు, ముక్కు,ఇతర ఇంద్రియాలు.  కానీ ఏ ఇంద్రియానికి లేనివిధంగా అవధులు లేని అనంతమైన విస్తృత శక్తి కేవలం మనస్సుకి మాత్రమే ఉంది.  నీవు నీ ఇంట్లో కుర్చోనికూడా నిన్న నీ ఆఫీసులో జరిగిన విషయాన్నీ గూర్చి ఆలోచించటమే కాకుండా అప్పుడు నీవు పొందిన భావాన్ని ఇప్పుడు పొందగల్గుతున్నావు. ఉదాహరణకు నిన్న నీవు ఏదో ఒకవిషయంలో నీ ఆఫీసరు నిన్ను దూషించెదనుకోండి. నీకన్నా పెద్ద అధికారి కాబట్టి నీవు అతనిని ఎదిరించలేవు దానిపర్యవసానమే నీవు బాధపడటం. నిజానికి ఆ బాధ నిన్ననే నీవు  అనుభవించావు. కానీ నీ మనస్సు నీవు ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని తలపిస్తూ మళ్ళీ మాళ్ళీ నీకు ఆ బాధనే కలుగచేస్తుంది. దాని పర్యవసానమే నీవు ఇతరవిషయాలమీద నీ మనస్సుని నిలపలేకపోవటం. భౌతిక విషయాలమీదనే మనస్సు నిలపలేని నీవు ఇక భగవంతునిమీద ఎలా నిలుపగలవు అది పూర్తిగా అసాధ్యం. 

మనస్సుని ఎలా స్వాధీన పరచుకోవాలి: 

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ మనస్సుని ఎలా స్వాధీనపరచుకోవాలి. 

 

ఇంకా వుంది

 


కామెంట్‌లు లేవు: