17, ఏప్రిల్ 2021, శనివారం

సైంటిఫిక్ లిటరసీ

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

    *విరించి విరివింటి గారి* విశ్లేషణ ను మార్చి వాట్సాప్ లో పంపగా నాకు చేరినది.

               🌷🌷🌷

మనదేశంలో 1% మాత్రమే సైంటిఫిక్ లిటరసీ ఉంది.  (scientific illiteracy) సైంటిఫిక్ లిటరసీ త్వరితగతిన మరింతగా పెరగవలసిన అవసరం అత్యవసరంగా ఉంది. దానికోసమై సైన్స్ చదివిన వారు కాస్తో కూస్తో తమవంతుగా ఇతరులతో నిరంతరం సైన్సును సైంటిఫిక్ కోణంలో నుంచి మాటలాడటం అవసరం. వివరించడం అవసరం. రిచర్డ్ డాకిన్స్ ఒక ఇంటర్వ్యూలో ఏమంటారంటే.."సైంటిస్టులు సైతం మత సంబంధ మూఢనమ్మకాలలో కూరుకుపోవడానికి కారణం మతం కాదు.  సైన్సు చెప్పేవారు దానిని సరిగ్గా సైంటిఫిక్ గా చెప్పకపోవడం" అని. 


కొంత సైన్సు తెలిసిన వారికీ(డాక్టర్లే కావొచ్చు లేదా సైంటిస్టులు కావచ్చు), సామాన్య ప్రజలకూ మధ్యన అగాధం ఎప్పటికీ ఉంది. గత శతాబ్దాలకంటే ఈ శతాబ్దంలో ఈ అగాధం మరింత పెరిగిందంటారు గడియారం భార్గవగారు. నిజమే కదా. "Amusing ourselves to Death" అనే పుస్తకంలో Neil postman మనుషులకు మారుతున్న జ్ఞాన మార్గాల గురించి చక్కగా వివరిస్తారు. ఒకప్పుడు మనుషులకు జ్ఞానం అందాలంటే కేవలం చదువుకుని నిష్ణాతులైన వారు ఉపన్యాసాలు ఇస్తేనే సాధ్యమయ్యేది.  వారి జ్ఞానం ప్రచారం ద్వారా పదిమందికీ ఉపయోగపడేది.

ఆ తర్వాత కాగితం వచ్చాక ఏదైనా చెప్పాలనుకున్నది రాయడం వలన చెప్పేవారు. నిష్ణాతులైన వారు తమ జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో చెప్పేవారు.


ఇక్కడ ఒకసారి ఆలోచించండి.  చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలి అనుకునేవారికి పుస్తకాల రూపంలో మాత్రమే జ్ఞానం అందుబాటులో ఉండేది.  ఆ జ్ఞానం కూడా డైరెక్టుగా ఆ జ్ఞానం కలిగివున్న నిష్ణాతుడు రాసినదే ఐవుండేది.  అంటే ప్రజలకు అందే జ్ఞానం first hand జ్ఞానం. Directly from the source. 


తరువాత జరిగిన మార్పు. రేడియో..టీవీ. ఇవి వచ్చే సరికి నిష్ణాతులైన వారి పుస్తకాల గురించి ఇతరులు మాట్లాడటం మొదలైంది. అంటే first hand నుంచి second hand కి జ్ఞానం బదలాయించడం అయింది. అలా మాట్లాడే వారు కూడా ఆ రంగంలో నిష్ణాతులు ఐవుండేవారు.   డైరెక్ట్ సోర్స్ కాకున్నా Secondary sources of knowledge లు పెరిగాయి.   కొంతకాలం తరువాత ఎవరైనా టీవీలో మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా ఏదైనా మాట్లాడే పరిస్థితి ఏర్పడేసరికి జ్ఞానతృష్ణ గల ప్రజలకు second hand knowledge పెరిగిందే తప్ప అంతకుమించి పెరగలేదు.


దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణను నీల్ పోస్ట్మన్ ఇస్తారు.  అబ్రహం లింకన్ స్పీచ్ సమయానికీ, అప్పటి ప్రజలకూ - ఇప్పటి అమెరికన్ అధ్యక్షుల స్పీచ్ కీ ఇప్పటి ప్రజలకూ.


అబ్రహం లింకన్ తన opponent డగ్లస్ కి మధ్య జరిగిన చర్చ దాదాపు వేయి మంది ప్రేక్షకుల మధ్యన ఏడెనిమిది గంటలు సాగుతుంది. ఇందులో లింకన్ కానీ డగ్లస్ కానీ వాడిన భాష, ఆ పదాలు గ్రాంథిక భాషలో సాగాయిట.  వాళ్ళు మామూలుగా మాట్లాడినా ఆ పదాలు ఏదో గ్రంథంలోంచి చూసి చదువుతున్నట్టుగా ఉండేవంట.  ఒకరకంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారికి గానీ ఆ స్పీచ్ ల క్లిష్టత అర్థమయేది కాదంట.  చాలా సీరియస్ గా వ్యక్తిగత దూషణలకు దూరంగా అమెరికా అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడారట.  ఇక్కడ వాళ్ళు అలా ఎందుకు మాట్లాడారు అంటే వాళ్ళ జ్ఞాన మార్గాలు కేవలం పుస్తకాలు మాత్రమే.  ఎన్నో పుస్తకాలు చదివి ఉండటం వలన వారి భాషకూడా అలాగే పుస్తకాల్లో ఉన్నట్టే ఉండేది. వారికి opponent ని కించపరుస్తూ మాట్లాడవలసిన అవసరంకూడా ఏమీలేదు.  తరువాత తరువాత వచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్ల భాష రాను రానూ భ్రష్టు పట్టడం మొదలైంది.  మరీ స్కూలు పిల్లల స్థాయికి వారి భాష పడిపోయి  సమస్యల కంటే- రేసిజం మీద, మతాలమీద గిల్లికజ్జాలు పెట్టుకునే స్థాయికి అధ్యక్ష కాండిడేట్ల డిబేట్ లు దిగజారాయి.  ట్రంపు మాట్లాడే భాష ఒక ఐదవ తరగతి పిల్లవాడు కూడా అర్థం చేసుకునేంతగా ఉంటుందంట. ఇది అచీవ్మెంట్ కాదు.  పతనం.  కారణం ఏమంటే ఇప్పటి అధ్యక్షుల knowledge sources డైరెక్టుగా పుస్తకాలు కాదు. First hand sources of knowledge కాదు. పుస్తకాలకంటే టీవీ ఛానళ్ళిచ్చే secondary or  tertiary superficial second hand third hand fourth hand...జ్ఞానమేఆధారం. 


ఇక అప్పటి ప్రజలు కూడా. ఏడెనిమిది గంటలు చర్చాగోష్టి జరిగినా కట్టు కదలకుండా కూర్చునేవారంట.  ఓపికగా శ్రద్ధగా వినేవారంట. ఎందుకంటే ఆ ప్రజల జ్ఞానమార్గాలు కూడా కేవలం పుస్తకాలు మాత్రమే.  కాబట్టి వారికి స్పీచ్ జరిగేకంటే ముందే pre conceived notions లేవు.  వారికి వాటిని అందించడానికి టీవీ యాంకర్లు లేరు.  మీడియా పేరుతో నోటికొచ్చిందంతా చెప్పేవారు లేరు.  కాబట్టి లింకన్ ఏం చెబుతాడో...డగ్లస్ ఏం చెబుతాడో అనే ఉత్సుకత.   ఎవరు తమను బాగు చేయగలరో అనే నిజమైన నిబద్ధత.  వారి స్పీచ్ ఆధారంగా వాళ్ళను అంచనా వేయాలి వాళ్ళకు ఓటు వేయాలి కాబట్టి ఆ శ్రద్ధ కూడా. ఇన్ని లక్షణాలు ఆ ప్రజలకు ఉండటానికి కారణం వాళ్ళ జ్ఞానమార్గాలు first hand sources నుండి ఉండటమే. ఇపుడు మనకంత ఓపికలున్నాయా.  అలా నాయకులు మాట్లాడితే వినగలిగే శక్తి ఉందా.  ఇతర నాయకులను కులాల పేరుతో మతాల పేరుతో అమ్మనాబూతులు తిడుతుంటే మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ లో వింటూ ఆనంద పడిపోయే స్థాయికి దిగజారాం కదూ.


ఇపుడు మీడియా వార్తా వ్యాపారం కాలంలో, యూట్యూబ్ కాలంలో మన జ్ఞాన మార్గాలు first hand second hand కూడా కాదు ఏ లక్షవో కోట్లవో ఎక్కడిదో ఐవుంటుంది.  అభిప్రాయాలే జ్ఞానమై కూర్చున్నాయి. వచ్చిన సమాచారమే తిరుగులేనిది ఐపోయింది. ఎవడో ఒకడు ప్రపంచంలో ఏ మూలలోనో కూర్చుని  తన అభిప్రాయాన్ని తన నోటికొచ్చినట్లు అదే జీవన సత్యమన్నట్టు వాట్సప్ లో ఏదో రాస్తాడు.  లేదా యూట్యూబ్ లో ఏదో వాగుతాడు.  రాసినవాడెవడో కూడా ఇదమిత్తంగా తెలియదు.  వాగేవాడేం చేస్తాడో కూడా ఎవరికీ తెలియదు.  దానికి గల ఆథెంటిసిటీ కూడా ఎవరికీ తెలియదు.  కానీ అదే నిజమని బాగా చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా నమ్ముతాడు.


ఇలా ఎందుకు జరుగుతుంది?  మనిషికి జ్ఞానాన్ని First hand knowledge ని అందించే జ్ఞాన మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. రూపు మార్చుకుని అభిప్రాయాలు, ఊహత్మక వర్ణనలే నిజాలైపోయాయి. పైగా ఇదే ultimate knowledge అని బొంకుతున్నాయి.  విచిత్రంగా చదువుకున్నవాడూ వాటిని నమ్ముతున్నాడు. మనమేమైనా ఆలోచించగలమా? ఈ బొంకుతున్న వారిని వదిలేసి ఆథెంటిక్ జ్ఞానం కోసం కొంతైనా ప్రయత్నం చేయగలమా?  అన్నది ప్రధాన సమస్యలా కనబడుతోంది.  Neil postman అన్నట్టు ఎంటర్టైన్మెంట్ పేరుతో we are amusing ourselves to death. No seriousness even at the edge of pandemic. ఈ రోజుకీ మనం సైంటిస్టులు చెప్పేదంతా అబద్ధమని ఏ వాట్సాప్ ప్రబుద్ధుడు రాసినా నమ్మేస్తున్నాం అంటే మన education స్థాయికీ literacy స్థాయికీ ఎంత అగాధం సృష్టించుకున్నామో కదా!


ఒకసారైనా తీవ్రంగా ఆలోచించవలసిన అంశాలివి.

కనీసం కరోనా కాలంలోనైనా మన జ్ఞాన మార్గాలు నిజంగా జ్ఞానమార్గాలేనా వొట్టి కాన్స్పైరింగ్ పుకార్లా అని తరచి చూసుకోవలసిన తరుణం వచ్చింది !


-విరించి విరివింటి


విరించి విరివింటి  గారి ఆర్టికల్ ని ఎక్కువమందికి చేరవేయాలనే ఉద్దేశ్యంతో కొంత ఎడిట్ చేసి (అనుమతి లేకుండానే) పోస్ట్ చేసి పంపినది.

కామెంట్‌లు లేవు: