5, నవంబర్ 2022, శనివారం

క్షీరాబ్ది ద్వాదశి

 *ॐ        క్షీరాబ్ది ద్వాదశి* 

          *(చిలుకు ద్వాదశి)*


*1. ఇళ్ళల్లో తులసీ*  *బృందావనంలో తులసి మొక్కవద్ద ఉసిరి కొమ్మ గ్రుచ్చి, సాయంకాలవేళ "తులసీ ధాత్రీ సహిత లక్ష్మీనారాయణ" పూజ - " క్షీరాబ్ది ద్వాదశీ" వ్రతంగా ఆచరించడం.* 

*2. ఆనాటి సాయంత్రమే విష్ణ్వాలయాలలో విష్ణుమూర్తి దర్శనం చేసికొని, మోహినీ రూపంలో స్వామి పంచియిచ్చే "అమృతం" పొందడం.* 

    *మనకి ఒక సందేహం కలుగుతుంది. "ఆ అమృతం స్వీకరిస్తే, మనకి అమరత్వం సిద్ధిస్తుందా?" అని.* 

    *కానీ మనకి శాశ్వతమైనదేదో తెలిపే జ్ఞానాన్ని అందించి, తద్వారా శాశ్వతత్వాన్ని అనుగ్రహిస్తాడు స్వామి.* 

    *మెదడనే మంధర పర్వతాన్ని కవ్వంగా చేసికొని, నరాలనే వాసుకితో క్రియగా చిలకాలి.*

    *కామక్రోధాది విషం వస్తుంది. దాన్ని మనలోని చిదానందరూపుడైన శివునకర్పించాలి.* 

    *తదుపరి వచ్చేవన్నీ మన సాధనలో ఉత్పన్నమయ్యేవిగా అన్వయించుకుంటూ ముందుకు సాగాలి.* 

    *చివరకి మనలో శాశ్వతమైన  "ఆత్మ" అమృతంగా వస్తుంది. అది తెలుసుకుని మనం  చిరంజీవులమవుతాం.* 


                    *=x=x=x=* 


  *— రామాయణంశర్మ* 

            *భద్రాచలం*

కామెంట్‌లు లేవు: