🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 123*
🔴 *రాజనీతి సూత్రాణి - రెండవ అధ్యాయం* :
📕 *ఇష్టమైన ఆయా కార్యాలు సాధించే ఉపాయాలు* : 📕
1. అర్ధమూలం సర్వం కార్యమ్ యదల్ప ప్రయాత్నాత్ కార్యం భవతి
(అన్ని కార్యాలకూ మూలం ధనం. ఉన్నవాడు స్వల్పప్రయత్నంతోనే కార్యం సాధిస్తాడు.)
2. ఉపాయపూర్వం కార్యం న దుష్కరం స్యాత్ (ఉపాయంతో చేసే పనిలో శ్రమ ఉండదు.)
3. అనుపాపూర్వం కార్యం న దుష్కరం స్యాత్ (ఉపాయం లేకుండా చేసినా పని జరిగినా కూడా చెడిపోతుంది.)
4. కార్యార్థినాముపాయ ఏవ సహాయః
(పనులు తలపెట్టినవారికి నిజమైన సహాయం ఉపాయమే.)
5. కార్యం పురుషకారేణ లక్ష్యం సంపద్యతే (పురుషప్రయత్నం సరిగా చేస్తే కార్యస్వరూపం స్పష్టంగా కనబడుతుంది. అప్పుడు లక్ష్యాన్ని సాధించవచ్చు.)
6. పురుషకారమనువర్తతే దైవమ్
(దైవం పురుషప్రయత్నాన్ని అనుసరించి ఉంటుంది. పురుషప్రయత్నం చేస్తే దైవం దానంతట అదే తోడ్పడుతుంది.)
7. దైవం వినాతిప్రయత్నం కరోతి తద్విఫలమ్
(దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే అవుతుంది.)
8. అసమాహితస్యకార్యం న విద్యతే
(బుద్ధి నిలకడలేనివానికి పనులేమిటి ?)
9. పూర్వం నిశ్చిత్య పశ్చాత్కార్యమారభేత
(ఎలా చెయ్యాలో ముందు నిశ్చయించుకున్న తర్వాత ఆ పని ప్రారంభించాలి.)
10. కార్యాంతరే దీర్ఘసూత్రతా న కర్తవ్యా
(కార్యం ప్రారంభించిన తర్వాత మధ్యలో తెగతెంపులు లేని ఆలోచనలు చెయ్యకూడదు.)
11. న చలచిత్తస్య కార్యావ్యాప్తిః
(చపలచిత్తుడు ఏ పని చేయలేడు.)
12. హస్తగతావమానాత్ కార్యవ్యతిక్రమో భవతి (చేతిలో ఉన్నదాన్ని చిన్నచూపు చూస్తే కార్యం చెడుతుంది.)
13. దోషవర్జితాని కార్యాణి దుర్లభాని
(దోషాలు లేని కార్యాలు అంటూ ఉండవు.)
14. దురనుబస్థం కార్యం నారభేత
(చెడుగా పరిణమించే కార్యాన్ని ప్రారంభించకూడదు.)
15. కాలవిత్ కార్యం సాధయేత్ (సమయాసమయాలు తెలిసినవాడు కార్యం సాధించగలుగుతాడు.)
16. కాలవితిక్రమాత్ కాల ఏవ ఫలం పిబతి (సమయం దాటబెడితే కాలమే ఫలాన్ని మింగేస్తుంది.)
17. క్షణం ప్రతి కాలవిక్షేపం న కుర్యాత్ సర్వకార్యేషు (ఏ పని విషయంలోనూ ఒక్క క్షణమైనా ఆలస్యం చెయ్యకూడదు.)
18. దేశకాలవిభగౌ జ్ఞాత్వా కార్యమారభేత
(ఏ దేశంలో ఏ కాలంలో ఏమి చెయ్యాలో తెలుసుకుని పని ప్రారంభించాలి.)
19. దైవహీనం కార్యం సుసాధ్యమపి దుస్సాధ్యం భవతి
(సులభంగా జరగవలసిన పనికూడా దైవం ప్రతికూలంగా ఉంటే కష్టసాధ్యమవుతుంది.)
20. నీతిజ్ఞో దేశకాలౌ పరీక్షతే
(నీతి తెలిసినవాడు దేశాన్ని, కాలాన్ని జాగ్రత్తగా పరీక్షించుకోవాలి.)
21. పరీక్ష్యకారిణి శ్రీ శ్చీరం తిష్టతి
(ఏ పనైనా పరీక్షించి చేసేవాడి దగ్గర లక్ష్మి చాలా కాలం ఉంటుంది.)
22. సర్వాశ్చ సంపద సర్వోపాయేన పరిగృహ్నీయాత్ (అన్ని ఉపాయాలూ ప్రయోగించి అన్ని సంపదలూ సమకూర్చుకోవాలి.)
23. భాగ్యవంత మప్యపరీక్ష్యకారిణిం శ్రీపరిత్యజతి (విషయం బాగా తెలుసుకొని ఊహించుకొని పరీక్ష చెయ్యాలి.)
24. యో యస్మిన్ కర్మణి కుశలస్తం తస్మిన్నేవ యోజయేత్
(ఎవడికి ఏ పనిలో నేర్పు ఉందో వాడిని ఆ పనిలోనే నియమించాలి.)
25. దుఃసాధమపి సుసాధం కరోత్యుపాయజ్ఞః (ఉపాయం తెలిసినవాడు కష్టమైన కార్యాన్ని కూడా సులువుగా చేసేస్తాడు.)
26. అజ్ఞానినా కృతమపి వ బహుమనస్తవ్యమ్: యాదృచ్చికత్వాత్
(తెలివి తక్కువవాడు ఏదైనా సాధించినా వాడిని మెచ్చుకోకూడదు. ఎందుచేతనంటే అతడా పని యాదృచ్ఛికంగా చేయగలిగాడు.)
27. కృపయో పి హి కదాచిద్రూపాంతరాణి కుర్వంతి (పురుగులు కూడా కర్ర దొలచి కొన్ని ఆకారాలు తయారుచేస్తాయి. కదా.)
28. సిద్దస్థైవ కార్యస్య ప్రకాశనం కర్తవ్యమ్
(కార్యాన్ని పూర్తి చేశాకే పైకి ప్రకటించాలి.)
29. జ్ఞానవతామపి దైవమానుషదోషాత్ కార్యాణి దుష్యంతి
(ఎంత తెలివైనవాళ్ళయినా దైవదోషం చేత, మానవదోషం చేతా కార్యాలు చెడిపోతుంటాయి.)
30. దైవం దోషం శాంతికర్మణా వినివారయేత్ (దైవదోషాన్ని శాంతికర్మలు చేసి నివారించుకోవాలి.)
31. మానషీం కార్యవిపత్తం కౌశలేన వనివారయేత్ (మనుష్యుల వల్ల కలిగే కార్యవిఘాతాన్ని నేర్పుతో తప్పించుకోవాలి.)
32. కార్యవిత్తౌ దోషాన్ వర్ణయంతి బాలిఇశాః
(కార్యం చెడిపోతే మందబుద్ధులు తమ ప్రయత్నలోపం అని చెప్పకుండా ఏవేవో దోషాలు వర్ణించి చెబుతారు.)
33. కార్యార్థినా దాక్షిణ్యమ్ న కర్తవ్యమ్
(పని కావలసినవాడు అనవసరంగా మొహమాట పడకూడదు.)
34. క్షీరార్థీ వత్స మాతురూథః ప్రతిహంతి
(పాలుకోరే లేగదూడ తల్లి పొదుపు పొడుస్తుంది.)
35. అప్రయత్నాత్ కార్యవిపత్తి ర్భవేత్
(సరిగా ప్రయత్నం చేయకపోతే కార్యం చెడిపోతుంది.)
36. న దైవమాత్రప్రమాణానాం కార్యసిద్ధి
(అన్నిటికీ దైవమే ఉన్నదనుకొనేవాళ్ళకు పనులు జరగవు.)
37. కార్యబాహ్యోన పోషయత్యాశ్రితాన్
(ఏ పనులూ చేయలేనివాడు తన వాళ్ళని పోషించజాలడు.)
38. యః కార్యం న పశ్యతి సో స్థః
(కార్యాన్ని గుర్తించనివాడే గుడ్డివాడు.)
39. ప్రత్యక్షపరోనుమానైఃకార్యం పరీక్షేత
(ప్రత్యక్షంగా చూచి, పరోక్షంగా ఇతరులవల్ల విని తాను ఊహించుకొని కార్యాన్ని పరీక్షించాలి.)
40. అపరీక్ష్యకారిణం శ్రీ పరిత్యజతి
(పరీక్షించకుండా పనులు చేసేవారిని లక్ష్మీ త్యజిస్తుంది.)
41. పరీక్ష్య తార్యా విపత్తి
(ఆపద వచ్చినప్పుడు బాగా పరీక్షించి దాన్ని దాటాలి.)
42. స్వశక్తీం జ్ఞాత్వా కార్యమారభేత
(తనకి ఎంత శక్తి ఉందో తెలుసుకొని ప్రారంభించాలి.)
43. స్వజనం తర్పయిత్వా యః శేషభోజీ సో మృతభోజీ
(తనవాళ్ళ కందరికీ తృప్తి కలిగించి మిగిలినది భుజించేవాడు అమృతభోజి (అమృతం తినేవాడు).)
44. సమ్యగనుష్టానాదాయముఖాని వర్ధంతే (పనులు సక్రమంగా నిర్వహించడంవల్ల రాబడికి దారులు పెరుగుతాయి.)
45. నాస్తి భీరో కార్యచింతా
(పిరికివాడు ఏ కార్యాన్ని గుర్చీ ఆలోచించజాలడు.)
46. స్వామినః శీలం జ్ఞాత్వా కార్యార్థీ కార్యం సాధయేత్
(పని కావాల్సినవాడు ప్రభువు స్వభావం ఎలాంటిదో తెలుసుకొని తన పని సాధించుకోవాలి.)
47. ధేనో శీలం జ్ఞాత్వా కార్యార్థీ కార్యం సాధయేత్ (ఆవు స్వభావం తెలిసినవాడే దాని పాలు త్రాగగలుగుతాడు కదా.)
48. క్షుద్రే గుహ్యప్రకాశనమాత్మవాన్ న కుర్యాత్ (తెలివైనవాడు నీచబుద్ధికి రహస్యవిషయాలు చెప్పకూడదు.)
49. ఆశ్రితై రప్యపమన్యతే మృదుస్వభావః (మెత్తటివాడిని ఆశ్రితులు కూడా అవమానిస్తారు.)
50. తీక్ష్ణ దండ సర్వేషాముద్వేజనీయో భవతి (తీక్షణంగా శిక్షించేవాడ్ని అందరూ ఏవగించుకుంటారు.)
51. యథార్హదండకారీ స్యాత్
(తగు విధంగానే శిక్ష విధించాలి.)
52. అల్పసారం శ్రుతవంతమపి న బహుమన్యతే లోకః
(ఎంత చదువుకున్నవాడైనా శక్తి లేనివాడ్ని లోకం గౌరవించదు.)
53. అతిభారః పురుషమవసాదయతి
(ఎక్కువ కార్యభారం మనిషిని కృంగదీస్తుంది.)
54. యః సంసది పరదోషం శంసతి స స్వదోషబహుత్వమేవ వ్రఖ్యాపయతి
(పదిమందిలో ఇతరుల దోషాలను గూర్చి చెప్పేవాడు తనలో ఉన్న దోషాలను చాటి చెప్పుకున్న వాడవుతాడు.)
55. ఆత్మానమేవ నాశయత్యనాత్మవతాం కోపః (తనను తాను అదుపులో ఉంచుకొనలేనివాని కోపము తననే నశింపజేస్తుంది.)
56. నాస్త్యప్రాప్తం సత్యవతామ్
(సత్యమే పలికేవాళ్ళకి లభ్యం కానిదంటూ ఉండదు.)
57. న కేవలేన సాహసేన కార్యనసిద్దర్భవతి (సాహసం చేత మాత్రమే పనులు జరగవు.)
58. వ్యసనార్తో విస్మరత్యవశ్యకర్తవ్యాన్ (వ్యసనాలలో చిక్కుకొన్నవాడు తప్పనిసరిగా చేయవలసిన పనులు కూడా మరిచిపోతాడు.)
59. నా స్త్యనంతరాయః కాలవక్షేపే
(కాలవిలక్షేపం చేస్తూ పోతే పనికి విఘ్నాలు కలుగుట తథ్యం.)
60. ఆసంశయవినాశాత్ సంశయవినాశఃశ్రేయాన్ (నిస్సంశయమైన వినాశం కంటే సంశయవినాశం మేలు.)
(ఇంకా ఉంది)...🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి