సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు.ఆరోగ్య ప్రదాత..మహా శక్తి మంతుడు..సకల శాస్త్రపారంగతుడు..కశ్యపునికి,అదితి కి విష్ణువు అనుగ్రహముతో జన్మించాడు.. ఈ "సూర్యునికి" 7 గుర్రాల రథం ఉందని అందరూ అనుకుంటారు..కానీ వారి రథానికి వుండే అశ్వము ఒక్కటే..సూర్యునికి "సప్తమి" అను పేరు కూడా ఉంది.."ఏకో అశ్వ సప్తమాన"...అదే "సప్త" అని పేరు పొందినది..ఆ ఏక కాంతిని సప్త వర్ణాలుగా విశ్లేషించి సప్తాశ్వాలుగా ఋషులు దర్శించారు."అరుణ కేతుకం" ప్రకారం సూర్యునికి "సప్త" (వేగవంతమైన) అనే అశ్వం ఉంది.ఇది సూర్యుని రథము యొక్క పేరు.. అదే అశ్వము కూడా..అంతే గానీ ఆయన రథానికి 7 అశ్వాలు లేవు...ఆ "సప్త" కు ఒకే చక్రం..అది సంవత్సరానికి సంకేతం..ఆ చక్రానికి ఉన్న 6 ఆకులు 6 ఋతువులకు చిహ్నాలు.. సూర్యుని కిరణాలలో నుండి ప్రధానంగా 7 కిరణాలు వెలువడుతాయి.. అవి 1. సుషుమ్నము.2.హరి కేశము.3. విశ్వవ్యచ 4.సంపద్వసు.5.అర్యాస్వం 6.సర్వాద్వసు 7. విశ్వ స్రవ... ఇవే సప్త చందస్సులు..సప్త వర్ణాలు.సప్త లోకాలు...ఇలా అనేకం..ఇవి అన్నీ కూడా "సప్త" అనే రథం వల్ల లేదా అశ్వం వల్ల ప్రభావితం అవుతున్నాయని వేదమంత్రం చెబుతోంది.." సప్తయుంజంతి రథ మేక చక్రం ఏకో అశ్వోవహతి సప్తనామా" అంటూ ఉంది ఋగ్వేదం... ఆదిత్యుడు,కాశ్యపేయుడు అని కూడా సూర్యునికి పేర్లు..ఆదిత్యునికి నమస్కరిస్తే జన్మ జన్మ పాపాలు పటాపంచలు అవుతాయి.." "చక్షో సూర్యో అజాయతే" అని మరో వాక్యం కూడా ఉంది...అంటే సాధారణ చక్షువులతో (కన్నులు)ఇతరులు చూడటానికి వీలు కానివాడు అని అర్థం.. అలాగే "భగవద్గీత" లోని "విభూతి యోగం" లో "ఆదిత్యానాం మహా విష్ణుః" అనీ, " జ్యోతిషామ్ రవి రంశుమాన్" అని శ్రీకృష్ణుడు చెప్పాడు.."పంచాయతనం" అనే అర్చనా విధానాన్ని ( ఆదిత్య,అంబిక,విష్ణు,గణనాథ,ఈశ్వర) శంకర భగవత్పాదుల వారు ఏర్పరచారు..అందుకే మనం ప్రభాకరుణ్ణి ప్రధాన దైవం గా, ప్రత్యక్ష దైవం గా ఆరాధిస్తూ ఉన్నాము...."మాఘ శుద్ధ సప్తమి " వీరి జన్మ తిధి...దీనినే "రథ సప్తమి" గా విశిష్టమైన పర్వదినంలా చేసుకుంటాము... ఓం సూర్య దేవాయ నమః.....ఆ సూర్య భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, సదా ఆరోగ్యవంతులుగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను....... శుభంభూయాత్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి