👆నిజంగా ఈ ఆర్టిస్ట్ ఎవరో కానీ శివమహాపురాణంలోని త్రిపురాసుర సంహారాన్ని మనకు కళ్ళకు కట్టేలా చూపించారు
త్రిపురాసురులు చతుర్ముఖ బ్రహ్మ గారిని కోరుకున్న కోరిక ఏంటంటే
బంగారం, వెండి, ఇనుము అని మూడు పురాలను సృష్టించండి, మేము ఒక్కోక్కరం ఒక్కోదాంట్లో ఉంటాము. ఆకాశంలో వివిధ సరళరేఖల్లో తిరుగుతూ ఉంటాము. వెయ్యి దివ్య సంవత్సరాలకు ఒకసారి క్షణకాలం మాత్రమే ఒకే సరళరేఖలోకి వచ్చినపుడు ఇంతకు మునుపు ఎవరూ వాడని రథం, గుర్రాలు, కట్టే తాళ్ళు, వాటి చక్రాలు, రధసారథి, ధనస్సు, దాని వింటినారి(బాణాన్ని కట్టేది). ఇంతవరకూ వాడని బాణం ,ఇంతవరకూ ధనస్సు ఎక్కుపెట్టని వాడు బాణాన్ని విడిచి పెడితే అదీ మేము క్షణకాలం పాటు ఒకే సరళరేఖ మీదకు వచ్చినప్పుడు విడిచి పెడితే మేం చనిపోతాం అని వరం కోరారు
ఇప్పుడు రథాన్ని జూమ్ చేసి జాగ్రత్తగా పరిశీలన చేయండి.
1బ్రహ్మాండాన్ని రథంగా చేశారు (చిన్న గ్లోబ్ లా వేశారు చూడండి)
2. సూర్యచంద్రులు రథచక్రాలు
3. ఉత్తరాయణం, దక్షిణాయన కాలాలను రథాలను, గుర్రాలను కలిపి ఉంచే అటూ ,ఇటూ హద్దు కర్రలుగా
4.నాలుగు వేదాలు గుర్రాలుగా
5. పంచభూతాలను రథసారథి పట్టుకున్న గుర్రాలను కట్టే తాళ్ళుగా
6.ఇంతవరకూ రధసారథ్యం చేయని సారధిగా చతుర్ముఖ బ్రహ్మగారిని సారధిగా
7. మేరు పర్వతాన్ని ధనస్సుగా
8. వింటినారి(బాణాన్ని కట్టే తాడుగా ) శివుని మెడలో ఉండే వాసుకి(పామును) తాడుగా
9. ఇంతవరకూ బాణంగా వాడని శ్రీమహావిష్ణువును బాణంగా చేసి
10. ఇంతవరకూ బాణం విడిచి పెట్టని పరమేశ్వరుడు విడిచి పెడితే వారు చనిపోయిన దాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
ఆ ఆర్టిస్ట్ కి
💐💐💐🙏🙏🙏💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి