శివ రాత్రి
ఎస్.ఆర్.పృథ్వి
తే.గీ.
వచ్చినన్ జాలు శివరాత్రి పర్వదినము శివ శివ యనుచు భక్తులు చెలయు చుండు పుణ్య క్షేత్రము లందున పులకితులగు భక్తి, ఓంకారమందున పరవశించు
తే.గీ.
కాలిడినచో పులకితమౌ గాలి చేత దర్శనము గోరి మనసెల్ల తల్లడిల్లు నిక్కముక్కంటి ఆశీస్సు నేరి కోరి కలయ తిరుగు భక్తులు కనులు మూసి
తే.గీ.
నల్లమల గిరి శిఖరము యెల్లరకును ముక్తి ధామమై నోంకార ముట్టి పడును మల్లిఖార్జునుడున్నట్టి మలయ మందు భక్తి రసము పొంగి పారును శక్తి మీర
తే.గీ.
ఎట్టి తావున జూచిన ఎరుక యగును నదులు, గుడులెల్ల భక్తితో నాట్య మాడు దైవ దర్శనంబు కొరకు దార్లు కట్టు కంటితో శివ లింగము గనుటె ముక్తి ఓం నమశ్శివాయ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి