🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *శివానందలహరీ – శ్లోకం – 21*
. శ్రీ ఆదిశంకరాచార్య విరచితం
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*ధృతి స్తంభాధారాం దృఢ గుణ నిబద్ధాం సగమనాం*
*విచిత్రాం పద్మాఢ్యాం ప్రతి దివస సన్మార్గ ఘటితామ్,*
*స్మరారే మచ్చేత స్స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం*
*జయ స్వామిన్ శక్త్యా సహశవగణైస్సేవిత విభో ।।*
ఈ శ్లోకంలో మనస్సు పటకుటీరముతో (గుడ్డ డేరాతో) పోల్చబడింది. ఓ మదనాంతకా! శివా! ధైర్యము అనే స్తంభము ఆధారంగా గలదియూ, స్థిరములైన త్రాళ్ళచే కట్టబడినదియూ, ఎక్కడికైననూ పోవునదియూ, (ఎక్కడికైనా తీసికొని పోవడానికి వీలయినదియూ) ఆశ్చర్యకరమైనదియూ (చిత్ర వర్ణములతో కూడినట్టిదియూ, పద్మమువలె సుందరమైనదియూ, (పద్మాకార చిత్రములచే సుందరమైనదియూ,) ప్రతి దినమున ఉత్తమ మార్గమున ఉంౘబడునదియూ ( యోగ్యమైన విధమున ఏర్పరుపబడినదియూ) అయిన నా చిత్తము అనే స్ఫుటమైన డేరాలో ప్రవేశించి, ప్రమథగణ సేవితుడవైన ప్రభూ! దేవా! శక్తియైన పార్వతీదేవితో కలిసి నివసించి యుండుము. నా చిత్తము అనే డేరా, నీవు నివసింౘడానికి సుఖకరంగా ఉంటుంది. కాబట్టి గణసేవితుడవై, పార్వతితో కలసి, అందు నివసింపుము.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి