5, డిసెంబర్ 2023, మంగళవారం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



వ్యాసమహర్షీ! హరిశ్చంద్రుడి కథ బాగానే ఉంది. ఇంతకీ త్రిశంకుడి తరవాత కథ ఏమిటి ?

శాపం నుంచి విముక్తి పొందాడా ? లేకపోతే ఆ గంగాతీరంలో అలాగే కృశించి అసువులు బాశాడా ?

వదిష్ఠులవారేమైనా కరుణించి శాపం ఉపసంహరించారా ? వినాలని చాలా కుతూహలంగా ఉంది.

దయచేసి శేషవృత్తాంతాన్ని తెలియజెప్పమంటూ జనమేజయుడు కోరాడు. యథాప్రకారం జనమేజయా!

అంటూ వ్యాసుడు మళ్ళీ ఉపక్రమించాడు.

హరిశ్చంద్రుడు పట్టాభిషిక్తుడయ్యాడనే వార్త తెలిసి వసిష్ఠుడు సంతోషించాడు. దేవీధ్యానతత్పరుడై

గంగాతీరంలోనే కాలం గడుపుతున్నాడు.

* విశ్వామిత్ర శ్వపచుల కథ

కౌశికినదీతీరంలో దీర్ఘ తపస్సును ముగించుకున్న విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి తిరిగి

వచ్చాడు. భార్యాపుత్రులు క్షేమంగా ఉన్నందుకు సంతోషించాడు. పన్నెండేళ్ళ దుర్భిక్షం వచ్చిందని

విన్నాను. తిండి దొరకక ఎందరెందరో మరణించారట. ఆ కరువు కాలాన్ని నువ్వెలా గడిపావు? ని

పిల్లల్ని అన్నం పెట్టి ఎవరు పోషించారు ? తపస్సులో మునిగిపోయి నేను రాలేకపోయాను. వచ్చిమాత్రం

నిర్ధనుణ్ణి ఏమి చెయ్యగలనులే అని ఆగిపోయాను. చేతిలో చిల్లిగవ్వలేదుగదా ఎలా ఇల్లు గడిపావో చాలా

ఆశ్చర్యంగా ఉంది. దుర్భిక్షం గురించి విని మిమ్మల్ని తలుచుకుని బాధపడ్డానేతప్ప ఏ సహాయము

అందించలేకపోయాను. యజమానుడుగా నా కర్తవ్యం నిర్వహించలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను.

ఇలాంటివి తట్టుకుంటేనే తప్ప తపస్సు సాధ్యంకాదాయె

కామెంట్‌లు లేవు: