5, నవంబర్ 2023, ఆదివారం

ప్రోత్సాహకాలు

 👆

🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

మొన్న ఓరోజు మా మేనల్లుడు మా ఇంటికి వచ్చాడు , అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా ఉన్నతస్థిలో వున్నాడు. ఎదో మాటల సందర్భంగా ఇప్పటికి మనదేశం చాలా వెనుకబడి ఉంది , నెహ్రు 1956 లో  ఐఐటీ లు ప్రారంభించినా మనవాళ్ళు ప్రపంచస్థాయి కంప్యూటర్లు కాదుకాని నాణ్యత గల సూదులు కూడా కనుక్కోలేకపోయారు అంటే మా ఇద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది.


నేనన్నాను " నువ్వు కంప్యూటర్ రంగంలో పనిచేస్తున్నావు కదా, నువ్వేపుడైనా సమరేంద్ర కుమార్ మిత్ర పేరు విన్నవా అని అడిగాను". లేదు ఎప్పుడు వినలేదు ఎవరాయన అని అడిగాడు.


 మావాడు చాలా దేశాలు తిరిగాడు, నా రెండో ప్రశ్న :


నీకు చేతి గడియారాల గురించి బాగా తెలుసు కదా , ప్రపంచంలో అతి పల్చటి చేతి గడియారం ఏ దేశం తయారు చేసిందో తెలుసా ? అని అడిగితే నేననుకున్న సమాధానమే చెప్పాడు మావాడు స్విట్జర్లాండ్ దేశమే అయ్యుంటుంది , చేతి గడియారాలకి వాళ్లే కదా ప్రసిద్ధి అన్నాడు. 


ఎవరీ సమరేంద్ర కుమార్ మిత్ర? కంప్యూటర్ రంగంలో ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ఏమిటి? ఎక్కడో అమెరికా దేశంలో కాలిఫోర్నియాలో ఉన్న కంప్యూటర్ చరిత్రకు సంబంధించిన మ్యూజియంలో ఆయన ఫోటో , ఆయన తయారు చేసిన కంప్యూటర్ ఎందుకున్నాయి? 


సమరేంద్ర కుమార్ మిత్ర గారు 1916 మార్చ్14న బెంగాల్ రాష్ట్రంలో పుట్టారు. 1998 , సెప్టెంబర్ 26న స్వర్గస్తులైనారు. వీరు గణితశాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్త.


ఇంకా దేశంలో ఐఐటీలు ప్రారంభం కాక మూడేళ్లముందు ఈయన నేతృత్వంలో మొట్టమొదటి కంప్యూటర్ తయారైంది. ఈయన కలకత్తాలోని భారతీయ గణాంక సంస్థలో రూపకల్పన, (ISI) అభివృద్ధి , తయారుచేసిన ఎలెక్ట్రానిక్ అనలాగ్ కంప్యూటర్ దేశం మొత్తాన్ని నివ్వెరపరిచింది. నాటి దేశ ప్రధాని స్వయంగా చూసి మెచ్చుకున్న ఫోటో చూడండి. (అప్పటి నాయకులెవ్వరికి కంప్యూటర్ అంటే అర్థం అయ్యుండదు)

ఈ సంఘటన దేశంలో ఇంకా ఐఐటీలు ప్రారంభం కాక ముందు జరిగింది అంటే మనల్ని విస్మయానికి గురి చేస్తుంది. 


అప్పటికింకా అమెరికా శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కంప్యూటర్లు పెద్ద సంస్థలకు, ప్రభుత్వలకు మాత్రమే ఉపయోగపడతాయి అన్న నిశ్చితాభిప్రాయంతో ఉన్న రోజులవి. వాళ్ళు తయారు చేసిన కంప్యూటర్లు పెద్దపెద్ద హాలంత ఉండేవి . అలాంటి తరుణంలో మన శాస్త్రజ్ఞులు అతిచిన్న కంప్యూటర్ను తయారుచేయడమే కాకుండా , చిన్న సంస్థలు, పాఠశాలలు, కాలేజీలు, కొనే ధరలో తయారు చేశారు. ఈ ఆవిష్కరణ ప్రపంచ కంప్యూటర్ శాస్త్రవేత్తలను ఆలోచింపచేసింది. 


సమరేంద్ర కుమార్ మిత్రా గారు వారితో కలిసి పనిచేసినవారు ప్రాచుర్యంలోకి ఎందుకు రాలేదు అన్నదానికి సమాధానం మన వ్యవస్థ అన్నది చరిత్రలో నిలిచిపోయిన సాక్ష్యం. నేటి తరం కంప్యూటర్ రంగంలో పనిచేసే వారికి ఆయన పేరు తెలియకుండా చేసిన మన పాలకులు ఎంత చిన్నచూపు చుసారో అర్ధమౌతుంది. 


సమరేంద్ర కుమార్ మిత్రా గారు దేశ కంప్యూటర్ రంగానికి జాతిపిత. అందుకే వారి సాధించిన విజయానికి ప్రతీకగా వారిగురించి ప్రపంచ కంప్యూటర్ మ్యూజియంలో ఒక ప్రత్యేక స్టాల్ ఏర్పరిచారు

అమెరికాలో. 


నేటి యువతరం ఆరాధించి , వారిని స్ఫూర్తిగా తీసుకునే అవకాశాలు మన ప్రభుత్వాలు కల్పించలేదు. ఇలాంటి అవిష్కర్తలు ఎందరో దేశంలో . వారిగురించి ఒక్క పాఠ్య పుస్తకంలో లేదు అంటే ఎంత శోచనీయం, ఆలోచించండి.

మనకు తరతరాలుగా అమెరికా, రష్యా ,యూకే , జపాన్ దేశ శాస్త్రజ్ఞుల గురించి బోధించారు.  ఒకటో తరగతి కూడా చదవని వారు దేశ ప్రధానులయ్యే అవకాశం ఉంది, అత్తెసరు మార్కులు వచ్చిన వారికి మెడిసిన్, ఇంజనీరింగ్, పీజీ కళాశాలలో సులువుగా దొరికే అవకాశాలు వున్నప్పుడు, వారికి ఉద్యోగాలు దొరికే పరిస్థితి వున్నప్పుడు , శోధించి, ఆవిష్కరించే శాస్త్రవేత్తలు ఎలా , ఎక్కడినుంచి పుట్టుకువస్తారు? ఈనాటి, ఇలాంటి విద్యార్థులవల్ల కొత్త ఆవిష్కరణలు ఆశించడం అత్యాశే. వారు చదువుకున్న విద్యకు సార్ధకత చేకూరిస్తే చాలు. సరైన వైద్యం, పదికలాలపాటు ఉండే కట్టడాలు కట్టగలిగితే చాలు అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది.(అనుమానమే) ఇది మన వ్యవస్థలో ఉన్న లోపం. ఎవరిని కించపరచడం నా అభిమతం కాదు. పిజిలు , ఏళ్ళ తరబడి పిహెచ్డిలు ప్రభుత్వం ఆయాచితంగా అన్ని , అంటే వసతి, భోజనం నలబై ఏభై వేల స్టీఫెన్డ్ లు ఇస్తే వారిలో జీవితంలో ఎదగాలి అన్న తపన ఎక్కడినుంచి వస్తుంది. పిల్లల తప్పుకాదు ,పాలకుల తప్పు.


 సమరేంద్ర మిత్ర లాంటి వారు ఎలా అత్యున్నత స్థాయికి ఎదిగారు? వారున్న కాలంలో ఏ వసతులు లేవు. రవాణా, అందుబాటులో సమాచారం , ఆధునిక పరికరాలు ఏవి లేవు. ఇప్పుడవన్ని ఉన్నా ఆ దిశలో ప్రోత్సాహకాలు కరువయ్యాయి. 


సశేషం. (రేపు స్విస్ కంపెనీలు చేయలేము అని తెగేసి చెప్పిన ప్రపంచలో అత్యంత పల్చటి వాచి గురించి)


By Subramanyam Valluri

*సేకరణ:- వాట్సాప్ పోస్ట్.*

కామెంట్‌లు లేవు: