🪷 *శయన నియమాలు (నిద్రించే సమయంలో పాటించవలసిన సూత్రాలు)* 🪷
1. *నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో* ఒంటరిగా పడుకోవద్దు. *స్మశానవాటికలో* కూడా పడుకోకూడదు.( *మనుస్మృతి*)
2. పడుకోని ఉన్న వారిని *అకస్మాత్తుగా* నిద్ర లేపకూడదు. *(విష్ణుస్మృతి)*
3. *విద్యార్థి, నౌకరు, మరియు ద్వారపాలకుడు* వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలప వచ్చును. *(చాణక్య నీతి)*
4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం *బ్రహ్మా ముహూర్తం* లో నిద్ర లేవాలి. *(దేవీ భాగవతము)* పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు. *(పద్మ పురాణము)*
5. *తడి పాదము* లతో నిద్రించవద్దు. పొడి పాదాలతో నిద్రించడం వలన లక్ష్మీ (ధనం) ప్రాప్తిస్తుంది. *(అత్రి స్మృతి)* విరిగిన పడకపై, ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం. *(మహాభారతం)*
6. *వివస్త్రలులై (నగ్నంగా)* పడుకోకూడదు. *(గౌతమ ధర్మ సూత్రం)*
7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన *విద్య*, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన *ప్రబల చింత,* ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన *హాని, మృత్యువు,* ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో *ధనము, ఆయువు* ప్రాప్తిస్తుంది. *(ఆచార మయూఖ్)*
8. *పగటిపూట* ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ *జ్యేష్ఠ మాసం* లో 1 ముహూర్తం (48నిమిషాలు) నిద్రిస్తారు. (పగటిపూట నిద్ర రోగహేతువు, మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది)
9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు. *(బ్రహ్మా వైవర్తపురాణం)*
10. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు 3 గంటల) తరువాతనే *పడుకోవాలి*
11. ఎడమవైపు పడుకోవడం వలన *స్వస్థత* లభిస్తుంది.
12. దక్షిణ దిశలో *పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు. యముడు మరియు దుష్ట గ్రహము* ల నివాసము వుంటారు. దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. *మెదడుకు రక్త సరఫరా* మందగిస్తుంది. *మతిమరుపు* *మృత్యువు* లేదా *అసంఖ్యాకమైన రోగాలు* చుట్టుముడుతాయి.
13. గుండెపై చేయి వేసుకుని, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.
14. పడక మీద *త్రాగడం- తినడం* చేయకూడదు.
15. పడుకొని *పుస్తక పఠనం* చేయడానికి వీల్లేదు. (పడుకొని చదవడం వలన *నేత్ర జ్యోతి* మసకబారుతుంది)
*ఈ పదిహేను అనుసరించేవారు యశస్వి, నిరోగి, మరియు దీర్ఘాయుష్మంతులు అవుతారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి