5, నవంబర్ 2023, ఆదివారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 63*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 63*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం*

*చకోరాణామాసీద్ అతిరసతయా చంచుజడిమా |*

*అత స్తే శీతాంశో రమృతలహరీ మామ్లరుచయః*

*పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంజి కధియా ‖*


ఈ శ్లోకంలో అమ్మవారి  చిరునవ్వును వర్ణిస్తున్నారు. 


స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య = అమ్మా, చందమామ వంటి నీ ముఖము నుండి వెలువడే చిరునవ్వు అనే వెన్నెల కాంతులను,


పిబతాం చకోరాణాం = తాగిన చకోరములు (చకోర పక్షులు వెన్నెలను తాగి జీవిస్తాయట) 


అతిరసతయా చంచుజడిమా అతస్తే శీతాంశోరమృతలహరీ = అతి మధురమైన ఆ శీతాంశువుల అమృతమును సేవించిన చకోరముల ముక్కు మొద్దుబారిపోయాయట.


అమ్మవారు కురిపించేది చైతన్యామృత మందస్మితం. అది జ్ఞానానందామృతం కూడా. క్షీరసాగర మధనంలో వెలువడ్డ అమృతం కాదు. ఆ అమృతాన్ని త్రాగే దేవతలు కూడా మహాప్రళయంలో నశించవలసిందే. అయితే, అమ్మవారి చిరునవ్వు యొక్క మాధుర్యామృతము వినాశము లేనిది. మహాప్రళయములో కూడా అంబ, సదాశివుడు ప్రళయ నృత్యం చేస్తుంటే చిరునవ్వుతో చూస్తూ ఉంటుందని ఇంతకు ముందు చెప్పుకున్నాము. 


ఆమ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంజి కధియా = ఇప్పుడు ఆ చకోరములు, ఆ జ్ఞానానందము వలన కలిగిన జ్ఞానముతో,తెలివితో కొద్దిగా పుల్లని పదార్ధం ఏదైనా సేవిస్తే బాగుంటుందని, మళ్ళీ భూమిపై దొరికే మామూలు వెన్నెల కాంతులను త్రాగాయట, అన్నపు గంజి వలె.


లలితా సహస్రనామాల్లో పదకొండవ శ్లోకం *నిజసల్లాప మాధుర్య వినిభర్త్సిత కచ్ఛపీ*  *మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా* తో అన్వయం చేసుకోవచ్చు. ఈ శ్లోకార్ధం కచ్ఛపి అనగా సరస్వతీ దేవి వీణ. ఈ కచ్ఛపీ నాదాన్ని మించిన మాధుర్యం అమ్మవారి పలుకుల్లో ఉందట. కామేశ్వరుడు ఆ పలుకులు వింటూ, అమ్మవారి చిరునవ్వు ప్రవాహంలో మునిగిపోయాడట. అమ్మ చిరునవ్వు జ్ఞానానందమయము.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: