ఏదైనా నచ్చకపోతే చాలు వెంటనే మనం అధ్వాన్నంగా వుంది... ఇలా అయితే కష్టం... అంటూ వుంటాం. మనం వాడే బాషలో అధ్వాన్నంకి మీనింగ్ నెగిటివ్‌గా వుంటుంది... ఈ పదాన్ని నెగిటివ్‌గా వాడటమే అలవాటు. మరి నిజంగానే అధ్వాన్నం పదానికి నెగిటివ్ మీనింగే వుందా... అసలు అధ్వాన్నం మీనింగ్ ఏమిటో చూద్దాం.
అధ్వాన్నం......
అధ్వ అంటే దారి;
అన్నం- తిండి.
రెండు మాటలు సవర్ణదీర్ఘ సంధితో కలిస్తే “అధ్వాన్నం”. అవుతుంది... అంటే దారి మధ్యలో వండుకుని తిన్నది, వండినది అని. ఇంట్లోలా అన్నీ కుదిరినా, కుదరకపోయినా, రుచి-శుచి లేకపోయినా ఆకలితో అలమటించి స్పృహతప్పి పడిపోకుండా దారిలో ఏదో ఒకటి అనుకుని తినే అన్నమే “అధ్వాన్నం”.
భాషలో మాటలకు అర్థవ్యాప్తి, అర్థ సంకోచాలు వస్తుంటాయి. ఆ రుచి పచీ లేని ఆహారపరమైన అధ్వాన్నం కాస్త ఇప్పుడు బాగాలేని దేనికయినా “అధ్వాన్నం” అయ్యింది. మన పూర్వీకులు వాడిన ఏ పదానికి దాదాపు అన్ని పదాలకు మనిషి జీవన విధానానికి మార్గదర్శకాలుగా వుంటాయి అంతే ఎక్కడ నెగిటివ్ అర్ధాలు వుండవు... వున్నా కూడా అవి మనిషి నిజ జీవితంలో ఉపయోగపడేవే.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి