జంబూద్వీపము
బ్రహ్మాండపురాణంలో సూతుడు ప్రపంచములోని భూభాగములు, జలభాగముల గురించి ఇలా చెప్పాడు - స్వాయంభువమనువు కొడుకు ప్రియవ్రతుడు. ప్రియవ్రతునికి 10 మంది కుమారులు, ఇద్దరు కుమార్తెలు. స్వాయంభువ మనువు తన మనుమలలో ఏడుగురిని ఏడు ద్వీపములకు చక్రవర్తులను చేసెను. వారు తమ తమ సంతానానికి ఆయా ద్వీపాలను పంపకం చేయడం వలన అనేక రాజ్యాలు ఏర్పడినాయి. అలా ముందుగా వివిధ ద్వీపాలకు చక్రవర్తులైన మనువు మనుమలు
జంబూద్వీపం - అగ్నీంద్రుడు ప్లక్షద్వీపం - మేధాతిథి శాల్మలీద్వీపం - వపుష్మంతుడు కుశద్వీపం - జ్యోతిష్మంతుడు క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు శాకద్వీపం - హవ్యుడు పుష్కరద్వీపం - సేవనుడు.
జంబూ అనగా నేరేడు పండ్లు, లేదా గిన్నెకాయలు. ఇవి ఎక్కువగా ఉంటాయి కనుక ప్రస్తుతము మనము ఉంటున్న ద్వీపాన్ని జంబూద్వీపము అంటారు. జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడినది.
అవి
ఇలావృత (హిమాలయాలు మరియు టిబెట్ ప్రాంతము)
భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు
హరి (అరేబియా) - దక్షిణము
కేతుమాలం (ఇరాన్, టర్కీ ) పశ్చిమం
రమ్యక (రష్యా, సైబీరియా) ఉత్తరము
హిరణ్మయ (మంచూరియా) ఉత్తరము
కురు (మంగోలియా) ఉత్తరము
కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము
భరత (భారత ఉపఖండము)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి