24, మే 2024, శుక్రవారం

బుద్ధితో విచారించడం

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *రత్నైఃకల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం*

*నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనమ్* |

*జాతీచంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా*

*దీపం దేవ దయానిధే పశుపతేహృత్కల్పితం గృహ్యతామ్* || ౧ ||


               [ *శివ మానస పూజ* ]


ఓ భగవాన్ పశుపతి, కరుణకు పభ్రువు. అమూల్యమైన రత్నాలతో తయారు చేయబడిన సింహాసనంపై, హిమాలయాల నుండిచల్లటి నీటితో స్నానం చేసి, దివ్య వస్త్రాలు ధరించి, వివిధ విలువైన రత్నాలు

మరియు ఆభరణాలతో అలంకరించబడి, మీ శరీరంపై చందనం

మరియు కస్తూరితో మీరు కూర్చున్నారు. నేను భక్తితో నీకు

సమర్పిస్తున్న మల్లెపూలు, చంపక పుష్పాలు, బిల్వ పత్రాలు, ధూపం, పక్రాశించేదీపం స్వీకరించండి.


   👇 //------ ( *మోహముద్గరం* )-----// 👇


శ్లో𝕝𝕝 

*ప్రాణాయామం ప్రత్యాహారం*

*నిత్యానిత్య వివేకవిచారం* ౹

*జాప్యసమేత సమాధివిధానం*

*కుర్వవధానం మహదవధానం* ॥30॥


భావం: క్రమపద్ధతిలో శ్వాసను నియమించడం, విషయాల నుండి మనసుని వెనక్కి మళ్లించడం, నిత్య వస్తువేదో, అనిత్య వస్తువేదో నిరంతరం బుద్ధితో విచారించడం, జపంతో కూడుకున్న ధ్యాననిష్ఠను సాగించి సర్వ సంకల్పాలను విడిచిపెట్టడం అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించుము.

కామెంట్‌లు లేవు: