కొత్త కవులు

ఇక్కడ మీరు వ్రాసిన  కవితలను పోస్ట్ చేయవచ్చును. 
కవులకు విజ్ఞప్తి:
 మీరు వ్రాసే కవితలు స్వతంత్రయినవిగా ఉండాలి.  ఒకవేళ ఏదైనా ఇతర భాషా కవితకు అనువాదం ఐ ఉంటే దాని మూలం పేర్కొనాలి.  ఆ మూల కవినుండి వచ్చే సమస్యలకు మీరే బాధ్యత వహిస్తానని హామీ ఇవ్వాలి.

మీరు వ్రాసే కవితలు బ్లాగర్ పరిశీలన అనంతరం పబ్లిష్ చేయ బడును.  ఒక వేళ మీ కవిత పబ్లిష్ కాలేదంటే అది బ్లాగర్ నిరాకరించినట్లు తెలుసుకోండి.  మీ కవిత పబ్లిష్ చేసే లేక పబ్లిష్ నిరాకరించే హక్కుతో పాటు  పబ్లిష్ చేసిన కవితను ఎప్పుడైనా ఈ బ్లాగునుండి ఎలాంటి కారణం చూపకనే తొలగించే హక్కు బ్లాగరికి కలదు.  మీకు ఎలాంటి క్లెయిమ్ చేసే అధికారము లేదు. ఈ నిబంధలకి లోబడే మీరు కవితలను పంపుతున్నట్లు భావించాలి. మీ కవితలకు ఎలాంటి పారితోషకం ఇవ్వ బడదు కాబట్టి మీరు ఇక్కడ పబ్లిష్ ఐన కవితలను మరెక్కడైనా పబ్లిష్ చేసుకోవచ్చు. మీ కవితపై ఎవరికైనా ఏమైనా అభ్యన్తరాలువున్న అది మీకు ఆ వ్యక్తికీ మధ్య వివాదంగా  పరిగణించబడును. ఈ బ్లాగ్ ఎలాంటి సంబంధం కలిగి ఉండదు.  
కవిత ఎలా పంపాలి: 
మీరు తెలుగు, हिंदी, ಕನ್ನಡ, मराठी, English బాషలలో ఏదయినా భాషలో కవితను పంప వచ్చు, మీ కవిత చెందోబద్ధంగా ఉండొచ్చు, వచన కవిత కావచ్చు, గేయ కవిత కావచ్చు, ఏదయినా స్కెచ్, కధ కూడా కావచ్చు, అంతే కాక హిందూ ఆత్యాత్మిక, ధార్మిక పరమైన వ్యాసం కావచ్చు.  నాస్తిక వాద కవితలు, రాజకీయ పార్టీల సంబంధ కవితలు ఇక్కడ ప్రచురించబడవు, గమనించగలరు.  
మీ కవిత యెంత నిడివి వున్నా సందర్భానుసారంగా స్వీకరించబడును.  ఈ బ్లాగర్ మీ కవితను కుదించే, పెంపుచేసే, మార్పు చేసే హక్కు కలిగి వున్నారు.
ముందుగా మీరు మీ ఇమెయిల్ను Follow by Email Box లో పేర్కొని తరువాత Followers ని Click చేసి follower కండి  తరువాత

మీ కవితలను మీరు post a comment Box లో టైపు చేసి publish ను నొక్కండి. 

.
   *రెప్ప వాల్చని రేయి*
           --------
*ఎం* తసేపయిందో..
రాత్రినలా నిశ్శబ్దంగా చూస్తుండిపోయాను
కంటిరెప్పలపై సుతారంగా కదులుతున్న
నిన్నటి తాలూకు ఊసులు
నేల ఒడిలో ఒదుగుతున్న
నులివెచ్చని గాలులు

ఆకు చాటున ఒంటరి పిట్ట
గొంతు దాటని ఆర్తిరాగాన్ని
గుండె తీరా ఆలపిస్తోంది
మల్లె కొమ్మన విరిసిన లేతచివుళ్లు
వాడిపోతున్న దిగులు వాసన

నల్లదుప్పటి కప్పుకున్న నీలాకాశం
నీటి కళ్లతో నిరాశగా నవ్వుతుంది
మనసు పిడికిట్లోంచి
భారంగా ఒడుస్తున్న ఒక్కోక్షణం..
పెదవిచివర సన్నని జాలినవ్వు

మిత్రమా! కాసేపు దూరమవ్వు..
చెంప చెమరింతను
పైటకొంగుతో అద్దుకుంటాను
నీవు లేని శూన్యం లో
ఈ రాత్రిని కరగనివ్వు
మదిని వీడిన జ్ఞాపకాలను
తొలి పొద్దున వెతుక్కుంటాను
               ***
*సునీత గంగవరపు* -

                -------

*ఎండమావులు*
****************

చిన్నప్పుడు
ఏ పండక్కో..పబ్బానికో
కొత్త గౌను కుట్టిస్తే..
ఎంత ఆనందమో...
ఎప్పుడు పండగ
వస్తుందా, ఎప్పుడు
వేసేసుకుందామా
అన్న ఆతృతే...
ఇంటికి చుట్టాలొచ్చి
వెళ్తో వెళ్తూ.. చేతిలో
రూపాయో... అర్ధ
రూపాయో పెడితే
ఎంత వెర్రి ఆనందమో...
చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే
దుఃఖం తన్నుకు వచ్చేది...
ఇంకా ఉంటే బాగుండు
అన్న ఆశ...
ఎంత ఆప్యాయతలో...
సినిమా వచ్చిన ఏ
పదిహేను రోజులకో
ఎంతో ప్లాన్ చేసి
ఇంట్లో ఒప్పించి
అందరం కలిసి
నడిచి వెళ్లి..
బెంచీ టికెట్
కొనుక్కుని సినిమా
చూస్తే ఎంత ఆనందమో...
ఇంటికొచ్చాకా ఒక గంటవరకూ
ఆ సినిమా కబుర్లే...
మర్నాడు స్కూల్ లో
కూడా...
ఆ ఆనందం ఇంకో పది
రోజులుండేది...
అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు
వెళ్లి మాట్లాడతారా అన్న
ఆశ్చర్యం...అమాయకత్వం..
పక్కింట్లో వాళ్లకి రేడియో
ఉంటే..ఆదివారం
మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం
ముందు కూర్చుని 
రేడియో లో సంక్షిప్త
శబ్ద చిత్రం (ఒక గంట కి
కుదించిన) సినిమాని
వింటే ఎంత ఆనందం...
మనింట్లో కూడా రేడియో
ఉంటే...అన్న ఆశ...
కాలక్షేపానికి లోటే లేదు...
స్నేహితులు
కబుర్లు, కధలు
చందమామలు
బాలమిత్రలు...
సెలవుల్లో మైలు దూరం
నడిచి లైబ్రరీ కి వెళ్లి
గంటలు గంటలు
కథల పుస్తకాలు
చదివి ఎగురుకుంటూ
ఇంటికి రావడం....
సర్కస్ లు, 
తోలు బొమ్మలాటలు
లక్కపిడతలాటలు...
దాగుడు మూతలు...
చింత పిక్కలు
వైకుంఠ పాళీ
పచ్చీసు..
తొక్కుడు బిళ్ళలు..
ఎన్ని ఆటలో...
మూడు గదుల రైలుపెట్టి
లాంటి ఇంట్లో అంతమంది
ఎంత సంతోషంగా ఉన్నాం...
వరుసగా కింద చాపేసుకుని
పడుకున్నా ఎంత హాయిగా
సర్వం మరిచి నిద్రపోయాం...
అన్నంలో కందిపొడి..
ఉల్లిపాయ పులుసు
వేసుకుని తింటే
ఏమి రుచి...
కూర అవసరమే లేదు..
రెండు రూపాయలు తీసుకెళ్లి
నాలుగు కిలోల 
బియ్యం తెచ్చేది...
ఇంట్లో, చిన్నా చితకా
షాపింగ్ అంతా నేనే...
అన్నీ కొన్నాకా షాప్
అతను చేతిలో గుప్పెడు
పుట్నాల పప్పో, పటికబెల్లం
ముక్కో పెడితే ఎంత
సంతోషం...
ఎంత బరువైనా
మోసేసేవాని..
ఎగురుతున్న విమానం
కింద నుండి 
కళ్ళకు చెయ్యి అడ్డం
పెట్టి చూస్తే ఆనందం...
తీర్థం లో ముప్పావలా
పెట్టి కొన్న ముత్యాల దండ 
చూసుకుని మురిసి
ముక్కలైన రోజులు...
కొత్త పుస్తకం కొంటే
ఆనందం...వాసన
చూసి మురిపెం..
కొత్త పెన్సిల్ కొంటే
ఆనందం...
రిక్షా ఎక్కితే...
రెండు పైసల
ఇసుఫ్రూట్ తింటే
ఎంత ఆనందం..?
రిక్షా ఎక్కినంత తేలికగా... 
ఇప్పుడు విమానాల్లో 
తిరుగుతున్నాం...
మల్టీప్లెక్స్ లో ఐమాక్స్
లో సినిమా చూస్తున్నాం.
ఇంటర్వెల్ లో
ఐస్ క్రీం తింటున్నాం..
బీరువా తెరిస్తే మీద పడి
పోయేటన్ని బట్టలు...
చేతినిండా డబ్బు...
మెడలో ఆరు తులాల
నగ....
పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...
ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...
హోమ్ థియేటర్లు...
సౌండ్ సిస్టమ్స్, అరచేతిలో
ఫోన్లు...అరచేతిలో
స్వర్గాలు...
అనుకోవాలే గానీ క్షణంలో
మన ముందు ఉండే 
తిను బండారాలు.. 
సౌకర్యాలు...
అయినా చిన్నప్పుడు
పొందిన ఆ ఆనందం
పొందలేకపోతున్నాం
ఎందుకు నేస్తం...?
ఎందుకు...?ఎందుకు...?
చిన్నప్పుడు కోరుకున్నవి
అన్నీ ఇప్పుడు  
పొందాము కదా...
మరి ఆనందం లేదేం...
ఎందుకంత మృగ్యం
అయిపోయింది...
ఎండమావి 
అయిపోయింది..
మార్పు ఎందులో...?
మనలోనా...?
మనసుల్లోనా...?
కాలంలోనా...?
పరిసరాల్లోనా...?
ఎందులో... ఎందులో...?
ఎందులో నేస్తం...?
చెప్పవా తెలిస్తే....!!
-----_----------------------------

శీర్షిక: *బతికిద్దాంభద్ర0గా బతుకుకాలాల్ని.* డా.శిరీష.
*ఉత్తేజమేమో గానీ సరదా లకు,
ఉస్సూరు మన్పిస్తూ సంసారాల్ని ,
ఉప్ మని ఊదేస్తూరి0గులపొగ.
రి0గుల్లో ఆలోచనలేమోగానీ  బుగ్గిచేయుబుసలపాములౌతు,
నిగ్గుతేల్చేనిజ0-నిషాలేమోగాని,
ఆరోగ్యంకిముప్పు,ఆయువుకపాయమే.
ఊహాఉపాయ0 మేఘాలనిమురియకు,
ఊపిరితిత్తుల్ని ఉరేస్తూ మరణం ద్వారం తెరుస్తుంది.
పొగలూ పగబట్టకమానవు, 
పొగాకూ పామైకాటేయకమానదు.
వేలికొనల్లో ధూమపానం కొరివై,
కుటుంబం ఆన0దాల్నిదూర0చేసే,
చెడు చిచ్చు చాపకింద చేటుచిత్రమే.
శ్వాసకోశ ధ్యాసలమవుతూ గురైన గు0డెగాన0,
శాంతి మహాయజ్ఞం కా0తులకోరుతూ,
కాలాన్నిపోగాల0 కానీయక,
కర్తవ్యం గా పొగాకుదూరమై, జీవకాలాల్ని జీవి0పజేద్దా0.
*ధూమపాన వ్యతిరేక దినోత్సవం నేడు.*
*డా.వేదులశ్రీరామశర్మ'శిరీష'.

*స్నేహం అంటే..* శీర్షిక :
 *ఎదరూపు మనసు చూపు.* dr.Vedula'sirisha'.
*స్నేహం అంటే కానేకాదు కాలక్షేపం,
సవ్యగతుల నవ్య జీవన కాల నిక్షేపం.
అల్లాటప్ప ఆటవిడుపు పిచ్చాపాటూ కాదు.
కల్మషమెరుగని భరోసా బాసటశ్వాస స్నేహం.
*విశ్వమంత విశ్వాసం గాలిపటాలయి,
విశాలభావ అక్షర కాంతి పతా కాలుగా,
ఎల్లల్లేని నమ్మకాల ఉల్లాసపు నింగిలై,
కల్లల్లేని ఆకాంక్షల అంకురాల నేలనూ స్నేహమే.
*జీవితం గీటురాయి బతుక్కి కలికితురాయి,
హృదయాలఉదయ పరాగం- రేయి రాగం స్నేహం.
మనసు చూపుల ఎదకి ఆత్మీయం రూపై,
మనుగడ చెలిమి మనోబాట కలిమినే.
*నాకు నువ్వు నీకూ నేననే బాసటభావనై,
నిస్వార్థం త్యాగాల అనుబంధం స్నేహసుగంధం.
సుధాస్వర్గం సువర్గ అనర్గం, స్నేహదుర్గమై,
ఆత్మీయత వర్షమై, ఆత్మస్థైర్య అమృతమే.
*కష్టం-ఇష్టంలో సమిష్టి పాటవం పల్లవమై,
చేతల చేతుల చేదోడు చైత్ర చిత్రమై,
నేస్తం బలిమి సమస్తం నిబద్ధతా హస్తమయ్యేది,
ఆదర్శమార్గమధురిమల మనోఉత్తేజం స్నేహమే.
*dr. వేదుల శ్రీరామ శర్మ 'శిరీష ',66-5-20, అశోక్ నగర్, కాకినాడ-3.,9866050220

------+-----



232 కామెంట్‌లు:

«అన్నిటి కంటే పాతది   ‹పాతవి   232లో 201 – 232
cbs చెప్పారు...

*పాల పిట్టా ! పాలు పోవడంలే*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
అంతా నీరు నీరు
పండగ పట్టాలు ఎక్కి
ఎలా వస్తుంది -----
కట్టలు తెగిన చెరువులతో
ఇండ్లు కబ్జా --
ఎన్ని అగరొత్తులు పెట్టినా
వరద వాసన ముందు
ముక్కుకు పరదా వేసుకున్నట్లే
పాల పిట్టా ! పాలు పోవడంలే !
పాలవాడు తలుపు కొట్టడంలే
పట్నమైనా పిల్లలకు పాల కరువే
ఛాయ తాగాలంటే
పడవ పై చౌరస్తాకు
ప్రయాణం కావాల్సిందే !
ఉన్న బట్టలే నాని బురద బురద
కొత్త బట్టల కథ ఎక్కడిది
ఇంటి పైన
ఒక్క హెలికాప్టర్ ఎగరలే --
పాలపిట్ట ఎగిరి ఎలా వస్తుంది !
మొగులైదంటే భయం మబ్బులు!
చుట్టూ వరద నీరు ఇంకాలే
అప్పుడే మాకు ప్రపంచం ?
- కందాలై రాఘవాచార్య

cbs చెప్పారు...

దసరా దశనే మార్చాల
సిరులు దశమై రావాల
రోజూ మేలి పొద్దు కావాల
**********************
.......తేటగీతి...........
మక్కువలయమ్మ ముక్కంటి మానికమ్మ
పసిడి బొమ్మ సత్తువలకు పట్టు గొమ్మ
కుళ్ళు కపటములు యెదను కూల్చి వేసి
మంచి జేయు మనసు నేడు మాకు యి మ్ము

దుర్గ మాయమ్మ దండించు తులువులనిట
క టు కరోనా ను కాటేసి కావు మమ్ము
విజయ దశమి నుండందరు విరియు రీతి
అందరికి సుఖ శాంతులనందజేసి
కావరావమ్మ వలిమల కాన్పు గొమ్మ
....... రాఘవ మాస్టారు.....

cbs చెప్పారు...

అక్టోబరులో కురిసిన అధికవర్షాలపై నాస్పందన.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
శర దానంద విహారవాంఛిత మనోవ్యాపార ముప్పొంగుచున్
జరియింపంగను వర్ష మేఘములె ఆశ్చర్యంబుగా నింగినిన్
ధర వర్షంబులధాటి పెంపులయెనో ధాత్రీ ధరాల్మున్నటుల్
నరులే యాతన లందగా వరద లన్యాయంబు గావింపగన్.

హర్షోల్లాస మనస్కలై తిరుగుచు న్నానందంబునే పొంద నా
వర్షాభ్రమ్ములె,శారదంబె మరి యావర్షాలనే గాంచెనే!
శీర్షమ్ముల్ మునుగాడ నీట వరియే చేటందగా, నన్యముల్
శీర్షానేక మహాసనాల వ్యథ భాసించెంగదా ధాత్రిపై.

రాయప్రోలు సీతారామశర్మ, భీమవరం.

cbs చెప్పారు...

మనం ఎదుగుతున్నాం...!
నిజంగానే మనం ఎదుగుతున్నాం !

చిన్నప్పుడు పెన్సిల్ విరగ్గొట్టిందని "కటీఫ్" అన్న మనం... ఇప్పుడు మనస్సు విరగ్గొట్టినా పోనిలే అనుకుంటున్నాం...!

నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం... ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం...!
మనం ఎదుగుతున్నాం !!!

అమ్మ అరగంట కనబడకుంటేనే అల్లాడిపోయిన మనం... అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం...!
మనం ఎదుగుతున్నాం

నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం... నేనే హీరో... నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం...! మనం ఎదుగుతున్నాం !!!

గళ్ళపెట్టెల్లో చిల్లర దాచుకున్న మనం... అవే చిల్లరబుద్ధులతో బ్యాంకుల్లో కోట్లు దాచుకుంటున్నాం...! మనం ఎదుగుతున్నాం !!!

చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం... ఇప్పుడు వస్తుంటే భాధపడుతున్నాం...!
మనం ఎదుగుతున్నాం !!!

సంతోషాల కోసం పోటిపడుతూ పెరిగిన మనం... ఇప్పుడు సంపాధనల్లో పోటీ పడుతున్నాం...!
మనం ఎదుగుతున్నాం !!!

చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం... ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం...!
మనం ఎదుగుతున్నాం !!!

మనిషికే పుట్టి... మనిషిలా పుట్టి... కొన్నాళ్ళు మనిషిలానే పెరుగుతున్నాం...! కానీ... మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని... మరమనిషిలా మారిపోతున్నాం...! మనలో మనిషికి దూరంగా పారిపోతున్నాం..! మంచి నుంచి వేగంగా జారిపోతున్నాం...! నలుగురికి వెలుగునివ్వకుండానే ఆరిపోతున్నాం...!
ఎందుకంటే మనం ఎదుగుతున్నాం !!!
నిజంగానే మనం ఎదుగుతున్నాం !!!

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”


పరమ గమ్యం

గమ్యమేది, గమనమేది?
ఊరేది, దారేది, ఎపుడు చేరేది?
దూరమెంత, కాలమెంత?
వాహనమేది,వేగమెంత?
నేలపైనా,నీటిలోనా,నింగిపైనా?
అశ్వమా,మీనమా,విహంగమా?
తోడనొచ్చేదేవరు,తోడొచ్చేదేవరు?
ఎచ్చటికి,ఎప్పటికి,ఎందులకు ?
ఎవరికోసం, ఎంత కాలం?
ఏమి లక్ష్యం , ఏమి లభ్యం?
ఎన్నిప్రశ్నార్ధకాలు,ఏది బదులు?
అంతా అగమ్యగోచరం,అయోమయం!
దిక్కేది, దిక్సూచి ధ్రువుడేనా?
దిక్కెవరు? ఇంకెవరు దేవుడేగా!!
దేవుడే సాయం! నీకెందుకు భయం?

నీ గమ్యం గమనం నిర్ణయంనీది గాదు
ఈ జన్మకారకుడు ఈశ్వరేఛ్ఛేనీకు రక్ష
జన్మకారణం జననమరణ మధ్యకాలం
జగన్నాధునికే ఎరుక,జగన్నాటకమిది
జీవులన్నీనిశ్చిత పాత్రధారులు ధరిత్రిలో
జీవన్నాటక మేడపై సూత్రధారి దేవుడు
కధ,మాటలు,స్క్రీన్ ప్లే,దర్శకత్వం’శ్రీకృష్ణ’
నాట్యంసంగీతం ‘శివా’నిర్మాత ‘బ్రహ్మదేవ్’
అందులోపాత్రపావనం పోషించు,తరించు
నీ వంతు ముగించు పిదప నిష్క్రమించు

ఇహలోక సౌఖ్యాలన్నీ ఇష్టంతో త్యజించు
ఇలపై దుఃఖసాగరమీద విధాతంభజించు
ఆ భవబంధాల సంకెళ్ళ విరక్తితో తెంచు
ఈ జీవనపయనం ముక్తివైపు సాగించు
ఈ భవసాగరందాటి మోక్షమార్గం ఎంచు!

ఈ మానవ జన్మ మహోన్నతమైనది
జన్మజన్మల సత్క్రియల సమన్వయమది
అట్టి పుణ్యఫలం ద్విగుణీకృతమొనర్చు
సన్మార్గం ధర్మ మార్గం సదా ఆచరించు
సహజీవులకు సన్నిహితుడై గోచరించు
సహాయతా, మిత్రభావాలతో జీవించు
సహనగుణం క్షమార్పణంనిత్యంపాటించు
పితృదేవతల, పెద్దలందరినీ గౌరవించు
సతీ సంతతులకాదర్శ రూపంగా మెలగు
నీతి నియమనిష్టానుసారం నిత్యవ్రతుడౌ
నిత్యపారాయణం ఓంనారాయణ మంత్రం
సత్యపరిపాలన, సత్కార్య సత్పురుషుడై
తనకార్యమొరులకు భంగంగాని భంగిన్
తపోనిష్ట, అనుష్టాన మార్గాన జీవన్ముక్తి!

పరంధామ ధామంజేర దగ్గరదారేది లేదు
పరమ పధ సోపానారోహణమతి దుర్లభం
పఠంలోవలె నిచ్చెనలున్నానాగులెక్కువ
రాహుకేతులు పరాకాష్టలో ఆరుకాషుడు
ఉచ్ఛగతినుండి అధఃపాతాళానికితోస్తారు
మళ్ళిమళ్ళీ ప్రయత్నం మరుజన్మవరకు
జీవన పధసత్కృతి పరమపధ సంస్కృతి
ఈ జన్మమే చాలని జగద్రక్షకుని వేడుకో
మరుజన్మ నుండి మోక్ష ప్రాప్తి కోరుకో!!

ఈ జననీజనకులనిచ్చిన జన్మ ధన్యం!
సూకర కూకర జన్మరాహిత్యమే శ్రేష్టం!
పాపభూయిష్ట ప్రాపంచిక ప్రవేశమికవద్దు
పాపమొనర్చుటా పాపముల మోయుట
పాతకాలన్నీ దీర్చ పుట్టుట గిట్టుట చక్రం
ఆ సంకెలతెంచు ఆదిభగవానునినర్ధించు

ఈ ఆత్మ పరమాత్మలోనే లీనమగుగాక
ఆ మోక్ష ధామమే గమ్యాలలో అగ్రగణ్యం
జీవన పరమావధి పరమాత్మునిసన్నిధి
మానవ జన్మకు మోక్షమొక్కటే గమ్యం!
రమ్యమైన ఒకే ఒక పరమ గమ్యం!!!
************

cbs చెప్పారు...

🙏 అందరకీ శుభోదయం
నేటి మాట.
మంచి మనసున్న ఏ మనిషి
హద్దు దాటి కష్ట పెట్టకు,.
అందమైన అద్దము కూడా
పగిలితే పదునైన ఆయుధం
మౌతుంది గుర్తించుకో.
ఇట్లు
రజనీ కులకర్ణి
కలం సంజీవిని
తేదీ 29/10/2020
🙏🙏🙏

cbs చెప్పారు...

*వేదులయ్య పదాలు.*
శీర్షిక: *శిరీష సౌరభాలు.*
*తరగలమీగడ,
వరసలమనుగడ,
పదరసచెరకుగడ,
ఓ వేదులయ్య..
*పల్లెలమెరుగులు,
మల్లెల సొబగులు,
తల్లుల వెలుగులు,
ఓ వేదులయ్య..
*ఘనతరం పలుకు,
ధనవరం కులుకు,
మనస్వరం తళుకు,
ఓ వేదులయ్య..*
*పుణ్యాలకు భక్తి,
నైపుణ్యాల శక్తి,
కారుణ్యాను రక్తి,
ఓ వేదులయ్య..
*శబ్దాల వయసు,
అర్ధాల మనసు,
పదాల సొగసు,
ఓ వేదులయ్య..
*నమ్మకాలజనం,
అమ్మకాల ధనం,
వమ్ముకాని ఘనం,
ఓ వేదులయ్య..
*స్వభాష గళం,
యాస పరిమళం,
ఆశ సురభిళం,
ఓ వేదులయ్య..
*అచ్చు అందము,
హల్లుల పదము,
అక్షర ముదము,
ఓ వేదులయ్య..
*మనసుల కన్ను,
మనుగడ వెన్ను,
మమతల దన్ను,
ఓ వేదులయ్య..
*ఛందాల పద్యాలు,
గంధాల హృద్యాలు,
బంధాల సేద్యాలు,
ఓ వేదులయ్య..
*తెలివికి పోటీ,
తెగువకు సాటి,
తెలుగులె మేటి,
ఓ వేదులయ్య..
*నిండుగ వన్నెల,
పండుగ వెన్నెల,
గుండెల దన్నుల,
ఓ వేదులయ్య..
*డా.వేదులశ్రీరామశర్మ"శిరీష",
సహృదయ-కాకినాడ.9866050220.

cbs చెప్పారు...

*వేదులయ్య పదాలు.*
శీర్షిక: *శిరీష సౌరభాలు.*
*తరగలమీగడ,
వరసలమనుగడ,
పదరసచెరకుగడ,
ఓ వేదులయ్య..
*పల్లెలమెరుగులు,
మల్లెల సొబగులు,
తల్లుల వెలుగులు,
ఓ వేదులయ్య..
*ఘనతరం పలుకు,
ధనవరం కులుకు,
మనస్వరం తళుకు,
ఓ వేదులయ్య..*
*పుణ్యాలకు భక్తి,
నైపుణ్యాల శక్తి,
కారుణ్యాను రక్తి,
ఓ వేదులయ్య..
*శబ్దాల వయసు,
అర్ధాల మనసు,
పదాల సొగసు,
ఓ వేదులయ్య..
*నమ్మకాలజనం,
అమ్మకాల ధనం,
వమ్ముకాని ఘనం,
ఓ వేదులయ్య..
*స్వభాష గళం,
యాస పరిమళం,
ఆశ సురభిళం,
ఓ వేదులయ్య..
*అచ్చు అందము,
హల్లుల పదము,
అక్షర ముదము,
ఓ వేదులయ్య..
*మనసుల కన్ను,
మనుగడ వెన్ను,
మమతల దన్ను,
ఓ వేదులయ్య..
*ఛందాల పద్యాలు,
గంధాల హృద్యాలు,
బంధాల సేద్యాలు,
ఓ వేదులయ్య..
*తెలివికి పోటీ,
తెగువకు సాటి,
తెలుగులె మేటి,
ఓ వేదులయ్య..
*నిండుగ వన్నెల,
పండుగ వెన్నెల,
గుండెల దన్నుల,
ఓ వేదులయ్య..
*డా.వేదులశ్రీరామశర్మ"శిరీష",
సహృదయ-కాకినాడ.9866050220.

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”


పరమ గమ్యం

గమ్యమేది, గమనమేది?
ఊరేది, దారేది, ఎపుడు చేరేది?
దూరమెంత, కాలమెంత?
వాహనమేది,వేగమెంత?
నేలపైనా,నీటిలోనా,నింగిపైనా?
అశ్వమా,మీనమా,విహంగమా?
తోడనొచ్చేదేవరు,తోడొచ్చేదేవరు?
ఎచ్చటికి,ఎప్పటికి,ఎందులకు ?
ఎవరికోసం, ఎంత కాలం?
ఏమి లక్ష్యం , ఏమి లభ్యం?
ఎన్నిప్రశ్నార్ధకాలు,ఏది బదులు?
అంతా అగమ్యగోచరం,అయోమయం!
దిక్కేది, దిక్సూచి ధ్రువుడేనా?
దిక్కెవరు? ఇంకెవరు దేవుడేగా!!
దేవుడే సాయం! నీకెందుకు భయం?

నీ గమ్యం గమనం నిర్ణయంనీది గాదు
ఈ జన్మకారకుడు ఈశ్వరేఛ్ఛేనీకు రక్ష
జన్మకారణం జననమరణ మధ్యకాలం
జగన్నాధునికే ఎరుక,జగన్నాటకమిది
జీవులన్నీనిశ్చిత పాత్రధారులు ధరిత్రిలో
జీవన్నాటక మేడపై సూత్రధారి దేవుడు
కధ,మాటలు,స్క్రీన్ ప్లే,దర్శకత్వం’శ్రీకృష్ణ’
నాట్యంసంగీతం ‘శివా’నిర్మాత ‘బ్రహ్మదేవ్’
అందులోపాత్రపావనం పోషించు,తరించు
నీ వంతు ముగించు పిదప నిష్క్రమించు

ఇహలోక సౌఖ్యాలన్నీ ఇష్టంతో త్యజించు
ఇలపై దుఃఖసాగరమీద విధాతంభజించు
ఆ భవబంధాల సంకెళ్ళ విరక్తితో తెంచు
ఈ జీవనపయనం ముక్తివైపు సాగించు
ఈ భవసాగరందాటి మోక్షమార్గం ఎంచు!

ఈ మానవ జన్మ మహోన్నతమైనది
జన్మజన్మల సత్క్రియల సమన్వయమది
అట్టి పుణ్యఫలం ద్విగుణీకృతమొనర్చు
సన్మార్గం ధర్మ మార్గం సదా ఆచరించు
సహజీవులకు సన్నిహితుడై గోచరించు
సహాయతా, మిత్రభావాలతో జీవించు
సహనగుణం క్షమార్పణంనిత్యంపాటించు
పితృదేవతల, పెద్దలందరినీ గౌరవించు
సతీ సంతతులకాదర్శ రూపంగా మెలగు
నీతి నియమనిష్టానుసారం నిత్యవ్రతుడౌ
నిత్యపారాయణం ఓంనారాయణ మంత్రం
సత్యపరిపాలన, సత్కార్య సత్పురుషుడై
తనకార్యమొరులకు భంగంగాని భంగిన్
తపోనిష్ట, అనుష్టాన మార్గాన జీవన్ముక్తి!

పరంధామ ధామంజేర దగ్గరదారేది లేదు
పరమ పధ సోపానారోహణమతి దుర్లభం
పఠంలోవలె నిచ్చెనలున్నానాగులెక్కువ
రాహుకేతులు పరాకాష్టలో ఆరుకాషుడు
ఉచ్ఛగతినుండి అధఃపాతాళానికితోస్తారు
మళ్ళిమళ్ళీ ప్రయత్నం మరుజన్మవరకు
జీవన పధసత్కృతి పరమపధ సంస్కృతి
ఈ జన్మమే చాలని జగద్రక్షకుని వేడుకో
మరుజన్మ నుండి మోక్ష ప్రాప్తి కోరుకో!!

ఈ జననీజనకులనిచ్చిన జన్మ ధన్యం!
సూకర కూకర జన్మరాహిత్యమే శ్రేష్టం!
పాపభూయిష్ట ప్రాపంచిక ప్రవేశమికవద్దు
పాపమొనర్చుటా పాపముల మోయుట
పాతకాలన్నీ దీర్చ పుట్టుట గిట్టుట చక్రం
ఆ సంకెలతెంచు ఆదిభగవానునినర్ధించు

ఈ ఆత్మ పరమాత్మలోనే లీనమగుగాక
ఆ మోక్ష ధామమే గమ్యాలలో అగ్రగణ్యం
జీవన పరమావధి పరమాత్మునిసన్నిధి
మానవ జన్మకు మోక్షమొక్కటే గమ్యం!
రమ్యమైన ఒకే ఒక పరమ గమ్యం!!!
************

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”


కొత్త జీవితం
‘ఎల్కేజీ’కి పూర్వజన్మలోనే బుకింగ్ ?!
‘యూకేజీ’లోనే పోటా పోటీ
జీవన పోరాటానికదియే సాటి,నాంది!
జీవికదియే పోరాటం
చిరంజీవికదియే తొలి పాఠం
చిరు వయసులోనే పెను భారం
రంగు రంగుల యూనిఫారం
వంగదీసే బ్యాక్ ప్యాక్కులు
వయాసొస్తే భారానికి చెక్
పదారేళ్ళకు పాఠశాల చెకౌట్
కళాశాల కళ కళ
మళ్ళీ రాదు మరపు రాదు
తిరిగిరాని అనుభవం! .

పదారేళ్ళ వయసు
ఉరవళ్లు పరవళ్ళు దీసే మనసు
పరువానికీ పఠనానికీ మధ్య ఘర్షణ
జీవశాస్త్రమా?జీవన శాస్త్రమా?నిష్కర్షగ
పఠనమేనన్న పటిష్టనిర్ణయం మారదు
పాఠ్యాంశమేది? కళాశాల ఏది,ఎక్కడ?
గణితమా వణిజమా, విజ్ఞాన శాస్త్రమా?
గణించి ఎంపిక భావి ఉపాధికి పునాది!

కాలేజీ ప్రవేశం కాలిడితేనే పరవశం
కళలన్నిటికీ నిలయం కళాశాల
సకల విద్యలూ సమకూర్చు
ఆరితేరిన ఆచార్యులతో
ప్రసిద్ధికెక్కిన పూర్వవిద్యార్ధుల చరిత్రతో
వారసత్వ సౌధాల గత వైభవంతో
కళ కళ లాడుతూ క్లాసురూముల
కాలేజీ ఇచ్చే క్రొత్త జీవితం
చదువు భారమెక్కువే!
యువతకు బాధ్యత ఎక్కువే!!

హాస్టల్ జీవనం మరో కొత్త అనుభవం
ఇల్లుగాని ఇల్లు ఆ వసతి గృహం
వార్డనే తండ్రి, మ్యాట్రనే మాత
వారు ఇచ్చేవే పరమాన్నాలు
క్రమపధ్ధతికీ ,క్రమశిక్షణకు వారే
సహవిద్యార్ధులే సహచరులు
అయిదేళ్లకైన మరో క్రొత్త జీవితం .
మరపురానివెన్నో మరువజాలనివెన్నో
మదిలో స్థిరంగా నిలిపే మరో జీవితం1

కళాశాల సెలవులు
విద్యార్ధులకు గొప్ప వరాలు
స్వస్థలం స్వగృహ పయనం
తల్లిదండ్రులు , తోబుట్టువులు బంధువులు,హితులు స్నేహితులతో
గడిపే స్వల్ప కాలం వారికి
తిరిగి వచ్చిన ఇహలోక స్వర్గం
ఆరు నెలలకైన అమృత సమం!

ఆర్జించిన విద్య ఒక ఎత్తు
అర్ధసంవత్సర పరీక్షలు పై ఎత్తు
ఉన్నతంగా ఉత్తీర్ణులవడమే ధ్యేయం
అయిదేళ్ళ అహోరాత్రాల అభ్యాసం
లక్ష్యసాధనకై కఠిన పఠనా తపోబలం
ప్రధమశ్రేణిలో ఫలితం ఖాయం
విద్యాశ్రమం ముగిసింది విజయమై
పట్టం వచ్చింది పడిన కష్టం తీరింది
పట్టాభిషేకానికి వేళాయెరారాకుమారా!

పట్టం పట్టుకు ఊరంతా వెదుకపన్లేదు
ఆవరణ ముఖాముఖి నందిన ఉపాధి
ఆహ్వానిస్తోంది అర్హుడైన బ్రహ్మచారిగా
అందమైన మళ్ళీక్రొత్త జీవితామారంభం
అనుభవించు పొదుపు నలువరించు!

స్వతంత్రుడవు స్వయంవర పాత్రుడీవు
సుకుమారి రాకుమారి నిను వరిస్తుంది
వైవాహిక జీవితగృహస్థాశ్రమం వైవిధ్యం
ప్రమాణ పరిణయం సుదూర ప్రయాణం
ఒకరికొకరై సర్వత్ర సగభాగస్వాములై
సుఖదుఃఖ, కలిమిలేములొకే విధంగా
కలసి జీవనంజంటగా నూరేళ్ళ పంటగా
షోడశసంస్కారాల వివాహంకేంద్రస్థానం
ఇర్వురి అనుసంధాన దాంపత్య ధర్మం
సత్సంతానప్రాప్తి వారిఅభివృధ్ధి సంతృప్తి
షోడశసంస్కారాలన్నీ వారిజీవనదశలౌ
పౌత్రదౌహిత్రుల నందినజీవనం సార్ధకం
వానప్రస్థ, సన్యాసాశ్రమ అవసానాలు
దైవచింతన భక్తివైరాగ్యప్రవృత్తి మార్గాలే
కాలచక్రంతో కదలే జీవితచక్రం ఆగనిది
అంతమేలేనిది వంశవృధ్ధి జాత్యాభివృధ్ధి

జన్మలోజీవనదశలన్నీకొత్తఅనుభవాలే
ఆత్మవిశ్వాసంతో అన్నిటా విజయమే
పుట్టుకనుండి కడవరకు నీకుజయమే
ప్రతి ఘట్టం నీకు ఒక కొత్త జీవితమే!!
********************




























cbs చెప్పారు...

హిమనగంబు.
౼౼౼౼౼౼౼౼౼
సతి వియోగవ్యథన్ సర్వంబువిడనాడి
జడుడునై తపియించు సాంబుడనగ,
అమరాపగన్ బట్ట అటవిగా పెంపొంద
జటల విస్తృతి సేయు శర్వుడనగ,
నిటలాగ్ని కామునే నిర్దేహు నొనరించి
జ్ఞానశోభల వెల్గు శంభుడనగ,
స్వచ్ఛతాయోగంబు సంయమీంద్రులకీయ౼
బూనెడున్ దక్షిణామూర్తి యనగ,

అచలశక్తిని అంబర మ్మంటుచుండి
వన,వనజ నివహ వ్యాప్తినంది
స్వచ్ఛ సితదేహుడై మౌనివంద్యుడౌచు
శ్రేయసుల పరంపరగూర్చు హిమనగంబు.

రాయప్రోలు సీతారామశర్మ, భీమవరం.

cbs చెప్పారు...

*చేతిలోనా గ్లౌజు చేవిపైకి ఒక మాస్కు ||*
*చెంత నెపుడు మంచి శానిటైజరు ||*
*ఉండినంత గాని బయటికి పోరాదు ||*
*విశ్వదాభిరామ వినురవేమ ||*

*రెండు చేతులెత్తి నిండైన దండంబు ||*
*నేర్పు కొలది పెట్టు నీటుగాను ||*
*షేకు హ్యాండు అనుచు చేతులన్ కలపకు ||*
*విశ్వదాభిరామ వినురవేమ ||*

*ఎంత వారలైన ఎదురుపడిన గాని ||*
*దూరముండు దరిజేర బోకు ||*
*వారి తుమ్ము దగ్గు వారుణాస్త్రము నమ్ము ||*
*విశ్వదాభిరామ వినురవేమ ||*

*మందు లేదు దీని మర్మమ్ము చూడగా ||*
*బాల వృద్దులకును ప్రాణ భయము ||*
*శుద్ధి శ్రద్ద ఒకటే దీని నాప గలదు ||*
*విశ్వదాభిరామ వినురవేమ*||

cbs చెప్పారు...

తనకు మెట్లెక్కడం భారమనుకుని , *లిఫ్ట్* ను కనుక్కుని ఎక్కడం
అలవాటు పడ్డాక ,
తద్వారా
పెరిగిన కొవ్వును
కరిగించు కోవడానికై
*మళ్లీ*
*మెట్లెక్కుతున్నాడు* !!!!

నడక కష్టమనీ, ఎంతో శ్రమపడి కారు ను తయారు చేసుకుని,
వాడటం మొదలెట్టాక ,
లావెక్కిన తనను తాను.. తగ్గించు కోవడానికై,
వాఁకింగ్ పేరుతో
*మళ్లీ* *రోడ్డున* *పడ్డాడు* *మనిషి* !!


హరిత విప్లవం అంటూ
అనేక రసాయనాల్ని వాడి, పంటలను పెంచుకున్నానని
గర్వపడేలోగా, వాటి
దుష్ప్రభావం తెలిసి
మళ్లీ *ఆర్గానిక్ పేరు జపిస్తున్నాడు!!*

పారిశ్రామిక విప్లవంతో
ఏదో సాధించాననుకుని మిడిసిపడ్డ మనిషి,
తను నాశనం చేసిన
ప్రకృతిని బ్రతికించు కోవడానికి మళ్లీ *పర్యావరణ మంత్రం పఠిస్తున్నాడు!!*

పిజాలు, బర్గర్లు అంటూ వెంపర్లాడిన,
మనిషి కరొనా పుణ్యమా అని
మళ్లీ *ఆరోగ్యకరమైన ఇంటి తిండికి అలవాటు పడుతున్నాడు!!*

ఇంగ్లీష్ మందులంటూ, జిమ్ములంటూ పరిగెత్తిన మనిషి కరొనా నుంచి రక్షణ కై మళ్లీ *యోగా, ప్రాణాయామం, ఆయుర్వేదం అనడం నేర్చుకుంటున్నాడు!!!*

ఉమ్మడి కుటుంబాలని చీదరించుకుని,
చిన్న కుటుంబాలతో సుఖపడదామనుకున్న, మనిషి మళ్లీ *అంతా కలిసుందాం రా అంటూ పాత బంధాల వైపే మొగ్గు చూపు తున్నాడు!!!*

పడచు పిల్ల లాంటి పట్నం మోజులో పడి తల్లి లాంటి పల్లెను మరచిన మనిషి, కరోనా భయంతో , ఫామ్ హౌజుల పేరిట,
*పచ్చని ప్రకృతి కొరకై*

*మళ్లీ* *పల్లె* *బాట* *పట్టాడు* !!

*ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమోమరి*!!

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”
‘చంద్రగిరి రహస్యం’

తిరుమల పాదాన వెలసిన ‘గిరి’
ఊరికి ఉత్తరాన ఉన్నత పర్వతం
రాజ్యానికి రక్షణగ నిలచిన అచలం
కొండ లోయల నడుమ సురక్షితం
పర్వత పాదానుసారం రాజ్యాకారం
అర్ధ చంద్రాకార రూప విశాల క్షేత్రం
అందుకే యన్నారు అది ‘చంద్రగిరి’
ప్రకృతి పాషాణ ప్రాకారమైన కొండ
ఉచ్ఛి నుండి శత్రుజాడల జూడనగు
ఆ నేపధ్యం మధ్య దుర్గమ దుర్గమది
కార్వేటినగరాధీశ నరసింహరాయలు
శ్రీవారికృపతో కొండక్రింద కోట నిర్మించె
కొండపై ‘ఉప్పుసట్టి’’పప్పుసట్టి’ కోనేర్లు
చంద్రగిరి అరణ్యమధ్య నెలకొన్న కోట
పిదప విజయనగరరాజ్య రాజకోటఅది
వింతలెన్నో గల ఆ ‘చంద్ర గిరి కోట’
మూడువైపుల ఎత్తైన రాతి అడ్డుగోడ
అది అతి పరిమాణ రాళ్ళ నిర్మాణం
ఆనుకొన్న అగాధ కందక త్రవ్వకం
అందులో మకరుల మచ్చిక రక్షణ
నిటారు కిలోమీటరు నిడువైన గోడ
నేటికీనిలచియున్న నాటి వింత సృష్టి
రాజా మహల్ ,రాణీ మహల్ అన్నవి
హిందూ మొగలాయ వాస్తు రూపాలు
160x50 చ.అడుగుల 95’ ఎత్తైనది
రాజా మహల్ మూడంతస్తుల భవనం
‘కలప’నే వాడని బ్రహ్మాండ కట్టడమది
కృష్ణదేవరాయ బాల్య కౌమార్యమక్కడే
రాణిచిన్నమదేవి నెంచుకొన్నదీకోటలో
అట్టి చంద్రగిరి చరిత్ర పుటలలో శ్రేష్టం
మహా మంత్రి తిమ్మరసు జన్మస్థలం
కృష్ణ దేవరాయుల తిరుమల యాత్ర
విడిది విశ్రాంతి నిచ్చిన విశేష స్థలం
‘శ్రీవారి మెట్టు’ మార్గం ‘శ్రీవారి మార్గం’
అదే రాయలవారి తిరుమలకై మార్గం
చంద్రగిరి రాజకుటుంబ ప్రత్యేక మార్గం

దిగువచెరువునీరు ఎగువచెరువుజేరు
గురుత్వాకర్షణ నధిగమించు ఆరోహణ
యంత్రములులేవుమంత్రములుకావు
విద్యుఛ్చక్తి లేదు విద్వఛ్చక్తి మాత్రమే
చంద్రగిరిఎత్తిపోతలు ఎన్నటికీ వింతలే
కొండపై సైనికశిబిరం నీటి సౌకర్యమది
అతిశయ సాంకేతికమది అతిరహస్యం
అందుకే యన్నారది చంద్రగిరిరహస్యం

చంద్రగిరి తిరుపతి చేరువ చరిత్ర స్థలం
చంద్రగిరికోట పలురాజ్య రాజుల స్థానం
ప్రాచీన ప్రావీణ్యతకానవాలైన ప్రస్థానం
క్రీ.శ 1000 లో స్థాపితమైన దుర్గమది
యాదవరాయ వంశావళి నిర్మాణమది
14వశతాబ్దాంతం యాదవరాయకేంద్రం
క్రీ.శ.1367న రాయల వారి వశమైంది
నాటి విజయనగర అరవీడు వంశావళి
చంద్రగిరితో బంధం చరితార్ధ ఉదంతం
తలికోటయుద్ధం-విజయనగర పతనం
దక్కను సేనల వశమైంది 1565లోనే
అళియరామరాయలు బలైన యుద్ధం
భ్రాత తిరుమల దేవరాయలు వెడలె
దూరాన పెనుగొండలో మరణమొందే
హంపి శతృబాధలవిడువడు ద్రోవలేదు
రాయచూరు నుండి కుమరి మొనకు
వ్యాపిత సామ్రాజ్యం కుంచిత మాయె
కొండ అండన నెలకొన్న చంద్రగిరి కోట
దుర్గమమైన దుర్గం శతృదాడి దుర్లభం
విజయనగర సామ్రాజ్య నవ రాజధాని
అరవీటి రాజుల కాలవాలం 1585 లో
1646 లో గోల్కొండసుల్తాను దాయె
శ్రీ రంగరాయ III ఇక్కేరికి పారిపోయె
1678న శ్రీరంగరాయులు మృతి నొందే
తుది రాయల వారిమృతితోసమసింది
విఖ్యాతవిజయనగర మహాసామ్రాజ్యం
1565-1646 81ఏళ్ళు పతనం పిదప
విజయనగర సామ్రాజ్య క్షేమం యశం
కాచినచంద్రగిరి చరిత్రలోప్రసక్తి చాలదు
1687 లో మొగలాయ వశమై పోయె

చంద్రగిరి - చెన్నైలది బలమైన బంధం
చంద్రగిరి కోటలోనే 1639న ఒప్పందం
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి
రాజా శ్రీ రంగరాయల వారి రాయితీ
చెన్నపట్టణం కోటస్థానం కేటాయింపు
సెయింట్ జార్జ్ కోటతో చెన్నై ఉదయం
బ్రిటనుల దక్షిణ విస్తరణ కదే కేంద్రం!!












కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”
మైత్రి
ఒంటరితనం కాదు శ్రేయస్కరం
శ్రేయాభిలాషులు,మిత్రుల సేకరించు
ఈ విశాల జగతిపై జీవనమొక కళ!
సంఘజీవనం సమాజ సహజీవనం
మానవులకేగాదు సకలజీవులనైజం!
‘వసుధైవకుటుంబకం ’ఋగ్వేదవాక్కు’
మన కుటుంబంలో వివాహ బంధం
మన తోబుట్టువులతో రక్త సంబంధం
మన బంధుప్రీతి,వస్తువాహన రాగం
అన్నిటినీ మించినది ‘మిత్ర భావం’
పొరుగుఇల్లు,ప్రదేశం,దేశం,విదేశమైనా
‘మైత్రి’తో ‘వసుధైకకుటుంబం’గావించు
ఎవరూ కొత్తగాదు బంధువులే యన్న
ఋగ్వేదవాక్కు ఋజువుజేయు మైత్రి!

మోదీజీ ఐరాసలో మ్రోగించిన ఘంట
‘వసుధైవ కుటుంబకం’ వేదాంత సారం
నాడు‘ప్రియ సోదర సోదరీమణులారా!’
వివేకానంద వాక్కు చికాగోనే నిలబెట్టే
విశ్వమే జయధ్వానాలు మ్రోగించింది!
వసుధయే ఏకమనిఎలుగెత్తి పిలుపది

పండిత నెహ్రూజీ చీన జ్హౌ ఎన్లై ల
పంచశీల సూత్రాలు పరస్పర మైత్రి
శాంతియుత సహజీవనానికిఒప్పందం
పాటించుట ఇప్పటికీ అవసరం?!!

‘పోరు నష్టం, పొందు లాభం’ అన్నారు
‘మైత్రి’ సహాయతనేగాదు సహనాన్ని
పరస్పరావగాహన ప్రయోజనాలిచ్చు
సమభావం క్షమాధర్మం సమకూర్చు
“ఫర్వాలేదు,పోన్లే,మంచిది,సంతోషం”
ఆ ఓదార్పు,మన్నింపు పల్కులనేర్పు

సమాజానికైనా మనుజునికైనఅవనిపై
మిత్రుత్వం మిత్రులు విశ్వాసపాత్రులు
మైత్రికి దేశమతవర్ణవర్గలింగభేదంలేదు
వయోభేదం పేదగొప్ప అంతరం లేదు
‘భిన్నత్వంలో ఏకత్వం’ మిత్ర తత్వం!

“మైత్రి”మిత్రులకు కొలబద్దలేకపోలేదు:
“మొదల జూచిన గడు గొప్ప పిదప గురుచ
యాది గొంచెము తర్వాత నధిక మగుచు
దనరు,దినపూర్వ పరభాగ జనితమైన
చాయ పోలిక గుజన సజ్జనుల మైత్రి “
దుర్జన మైత్రి ఉదయపు నీడవోలె
క్రమేణా తరిగిపోవు అస్థిరం,అనుచితం
సత్సాంగత్యం చిరకాలం గాచు మైత్రి
సాయంకాల నీడవలె దీర్ఘం స్థిరమైనది
“అఘము వలన మరల్చు హితార్ధ కలితు
జేయు ,గోప్యంబు దాచు బొషించు గుణము,
విడువ డాపన్ను లేవడి వేళ నిచ్చు ,
మిత్రుడీ లక్షణంబుల మెలగు చుండు “
మంచి మిత్రుడు తన మిత్రుని
పాపములనుండి దప్పించు
రహస్యముల దాచు మరియు
ఆపదలగాచు అవసరాల దీర్చు
ఉచితానుచిత చింతనతోనే మైత్రి!

శ్రీకృష్ణ సుధాముల స్నేహం ఆదర్శం
ఉజ్జైనిలో సాందీపని ముని ఆశ్రమంలో
ఉదయించిన మైత్రి మైత్రికే మారుపేరు
తారతమ్యమెరుగని తారక స్నేహమది
ఆ చిరకాలమిత్రుని ఆదుకొన్న వైనం
ఆ శ్రీ కృష్ణునికే తగు,ఆ భక్తవత్సలుడు
మిత్ర కుచేలుని కుటుంబానికి సాయం
పిడికెడు అటుకులకు పట్టేడు ఐశ్వర్యం
అడుగకనే అవసరాల దీర్చిన మిత్రుడు
అట్టి మైత్రినొందిన సుధాము ధన్యుడు!

మహాభారతంలో దానకర్ణుడు రారాజుల
మైత్రి వారిర్వురి వరకు ఖ్యాతినందినదే
సూతసుతుని అంగరాజుగాజేసి రారాజు
కర్ణుని క్షత్రియగౌరవమిచ్చి కాపాడే!!
అట్టిమిత్రుని విడనాడలె ప్రాణదానకర్ణ!
కర్ణ సుయోధనుల నేస్త వృత్తాంతం
కలకాలం ప్రాణ స్నేహానికి దృష్టాంతం!!

నీతి కధలలోనేస్తకధలెన్నోనిత్యనిజాలు
నీతి చంద్రికాయుత పంచతంత్ర కధలు
పిల్లలకు రాజనీతినేర్పుపాఠ్యగ్రంధమది
‘మిత్ర లాభం – మిత్ర భేదం’ చిత్రకధలు
సహ జంతువులలోనూ ఉన్న సఖ్యత
ఆ మైత్రిలో ఉపకారము ప్రత్యుపకారం
ఆ జంతు మిత్రుల సంవాదంలో నీతి
భావి పౌరుల తీర్చి దిద్దే భాండాగారం

చిత్రగ్రీవ కపోతసమూహం చిక్కునుండి
మిత్ర మూషిక హిరణ్యకుడు విడిపింప
వారి మైత్రిలోమహిమ గాంచి వాయసం
లఘుపతనక కాకి హిరణ్యకహితుడౌట
మంధరకూర్మ చిత్రాంగహరిణ కలయిక
కాకమూషికహరిణకూర్మవిచిత్రకూటమి
కలసి జీవనంలో కలుగు ‘మిత్ర లాభం ‘
అల్లిన కధలుగా మైత్రికి నిర్వచనమది!

మిత్ర లాభం జూచి ఓర్వలేని ఒకరున్నా
మిత్రభేదం జేయ కూటమి చేర్చులోకం
కరటక దమనకులు ఎక్కడైనాలేకపోరు
ప్రాణమిత్రులు పింగళకుడుసింహరాజం
సంజీవకుడు వృషభ రాజం,వార్నిజూచి
మైత్రిని చేధింప ‘మిత్ర భేదం’ కల్గింప
కరటక దమనక నక్కలు జేరిన కధయే
‘మిత్ర భేదం’ అను పంచతంత్ర కధ.!

‘మిత్ర లాభం – మిత్ర భేదం’ చిత్రకధలు
మైత్రినొందుటలోనున్న క్లిష్ట ప్రయత్నం
మైత్రి చెరచుటలోనుండుస్వలాభతత్వం
మనుజులందరూ ఎరిగిమెలగడంనేర్పు

‘మైత్రి’ లోనూ జాగృతికై హెచ్చరిక ఇది:
‘యూ టూ బ్రూటస్’ ప్రఖ్యాతినందినది
షేక్స్పియర్‘జూలియస్ సీసర్’ కధయది
సీసర్ ‘ప్రాణమిత్రుడు’ బ్రూటస్ ద్రోహం
సమూహ హత్య శత్రువుల మధ్యలో
మిత్రుని వెన్నుపోటు పొడిచినబ్రూటస్

అట్టి నమ్మక ద్రోహానికిదృష్టాంతం ఇట్లు:
“కమలములు నీటబాసిన
గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
దమ తమ నెలవులు దప్పిన
దమ మిత్రులు శత్రులగుట తధ్యము సుమతీ “

పై నోరులేని జంతువుల విచిత్ర సఖ్యత
‘వసుధైవ కుటుంబకం’అన్నవేదవాక్కు
శ్రీకృష్ణ సుధాముల నిర్మలమైనస్నేహం
శ్రీ శివా విష్ణుల పరస్పర గౌరవ భావం
మనుజుల మనసుల కలిపే ‘మైత్రి’గాక!
******************

























కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”


పల్నాటి హోరు (Hoary Past క్రీ.శ 1178 - 1182)
(PART I )


“మేడపిలో అలరాజు చావు”
అదే ఆంధ్ర మహాసంగ్రామ ఆరంభం
అలరాజు అలనాటి మహాశూరుడు
శత శత్రు రాజుల వధించి, జయించి
‘రాచమల్లన్న’ బిరుదాంకితుడాతడు
నలగాముని కల్లుడు ‘అల్లుమల్లన్న’
మాచర్ల మలిదేవుని ‘మేనల్లుడు’
గుర్రం‘సవరాలజిమ్మడు’ ‘శివక అశ్వం’
శతక్షతశత్రురాజుల శిరరూప పెండేరం
ముంగాలికి ధరించిన అశ్వ రాజమది
అలరాజు ఖడ్గం ‘సూర్య భేతాళం’పాశం
కదనంలో దూస్తే చేస్తుంది సర్వ నాశం
దూసిన కత్తి బలిచూడక యొరచేరదు
అట్టి అతివీర పరాక్రమ పల్నాటి కేసరి
నాగమ్మ చేతి నాగ విషాన్నంచే బలి!!!

“వెల్నాడు, పల్నాడు, పోల్నాడు వేగినాడు, కోర్నాడు, పల పల నాడు”
పలునామాల పల్నాడాంధ్రుల నాడు
‘వెలలేని మాగాణి వెల్నాడు పల్నాడు’
గుంటూరుజిల్లా ఉత్తరంలో ‘పల్నాడు’
‘గురజాల,మాచర్ల,కార్యమపూడి’ అది
జబల్పూరి అనుగురాజు పల్నాటిరాజు
బ్రహ్మనాయుడాయన మహా మంత్రి
నలగామునికి అరణమైంది పల్నాడు
నాయకి నాగమ్మ నలగాముని చేరింది
అనుగురాజ ‘స్వల్పకాల ప్రభు’ హామీ
తన ప్రాణరక్షక నాగమ్మకు వర పత్రం
ఆబలంతో బ్రహ్మనాయుని స్థానభ్రంశం
అతిబల వీరభద్ర ఆమె అంగరక్షకుడు
నాగమ్మపగ ప్రధమకుట్ర బ్రహ్మన్నపై
పల్నాడు రాజ్యంలో రగిలే చిచ్చు అది
జ్ఞాతి వైరం సృష్టించి రాజ్యం విభజన
మాచర్ల మలిదేవునిరాజ్యమైంది విడిగ
బ్రహ్మనాయుడు మాచర్లకేగే మంత్రిగ
అంతర్యుద్ధ పర్యవసాన పరిణామమది
బహిరంగ అంతఃకలహం కీడుగ మారు
తృతీయుని కానందదాయకంలోకంలో

ఆంధ్రుల ఆ నాటి ఘోర అంతర్యుద్ధం
శైవవైనవ కలహమే పల్నాటియుద్ధం
శివకేశవులు ఏకమన్నది ఎరుగరేమో
‘మహాభారతం పోలినదీ ‘ఆంధ్రభారతం’
మాచర్లరాజు మలిదేవుని మహామంత్రి
బ్రహ్మనాయుడు మహావిష్ణు భక్తుడు
బడుగుజీవ దళితులనాదుకున్నాడు
నాగులేరు పొంగె వాడవాడల ముంచే
బలహీన, శ్రామికవర్గం గృహహీనులైరి
వారికాలయ ప్రవేశమొసగిన మహాత్మ
మాలపిడుగు వంశీయులే అర్చకులైరి
దత్త మాలకన్నమదాసు సైన్యాధిపతి
కుల మత రహిత సమ సమాజత్వం
చాపకూడన్నసమబంతి పెట్టెబ్రహ్మన్న
గురజాల నలగాముని వద్ద నాగమ్మ
చరిత్రలోనే మొదటి మహిళా మంత్రి
నాయకినాగమ్మ మహాశివ భక్తురాలు
అగ్రజాతుల చేరతీసిన అమాత్యురాలు
మలిదేవ నలగాముని దాయాది పగ
బ్రహ్మనాయుని నాగమ్మల మతభక్తి
తండ్రిని చంపిన బ్రహ్మన్నపై తన పగ
నాయకి నాగమ్మ పన్నిన కుట్ర దగా
800 ఏళ్ల పూర్వం మహా రణ కారణం
‘పల్నాటి యుద్ధం’అనే ‘మినీ భారతం’

జ్ఞాతులవైరమేగాదు క్రీడల అక్రమంలో
జూదంలో ద్యూత క్రీడతో రాజ్యకబ్జాతో
సామ్యముంది గురజాలకు హస్తినకు
‘కోళ్ళ పందె’మంటే మోజు బ్రహ్మన్నకు
అలరాజు రత్నాలపేరమ్మ వివాహ వేళ
వేడుకల వరుసలో ‘కోళ్ళ పందెం’ క్రీడ
మాచర్లగురజాలల మధ్య కీడైమారింది
వ్యసనం వ్యాకులానికి ప్రధమకారణం
బ్రహ్మనాయుడు మన కధానాయకుడే
పన్నాగ నాగమ్మ మన అభినవశకుని
కోడేరుగుట్ట కోళ్ళపందెం నాగమ్మకుట్ర
మాచర్లగురజాలలో పుంజులన్నీ వశం
చివర నల్గొండ పానగల్లు‘చిట్టిమల్లు’తో
సపరివారం బ్రహ్మనాయుని పయనం
‘చిట్టిమల్లు’బ్రహ్మన్న కోడి అజాతశత్రు
66వీరుల అదివరకే జంపిన పుంజట
‘సివంగిడేగ’నాగమ్మ పంపినకుక్కుటం
ఘోరగోళ్ళ కోళ్ళపోరు పందెం కాచుకో
చిట్టిమల్లుపుంజు పుంజుకొనివిజృంభణ
సివంగిడేగ కోడి ఓడింది రెండుచుట్లలో
మాచర్లవారికి విజయోత్సాహం కోడితో
ముచ్చటగా మూడవ చుట్టు ప్రకటన
కోడిమడిసిన ఓడినవారికి రాజ్యభ్రష్టత
ఏడేళ్ళ ఘోర వనవాసం అనివార్యం
చిట్టిమల్లుపై అపారవిశ్వాసంమాచర్లకు
బ్రహ్మన్న కళ్లుగప్పి మంత్రకట్టు కుట్ర
‘సివంగిడేగ’ ‘చిట్టిమల్లు’ పై గెలిచింది
పన్నాగ నాగమ్మ వంచన ఫలించింది
మాచర్ల రాజ్యం నలగామ వశమైంది
నిష్టాపరుడు బ్రహ్మన్నఅడవిపాలాయే
మలిదేవునితో ఏడేళ్ళ వనవాసి ఆయే
వనవాసులనూ వదలని నాగమ్మ పగ
వారువసించే మందాడిపైపల్నీడుదాడి
వారిగోవుల మందలపైనే మంద పోరు
వీరలంకన్న పల్నీడుతో పొరాడిమడిసే
సేనాని కన్నమదాసు గోవుల రక్షించే
పాండవుల అజ్ఞాత వాసానికే సామ్యం
నాగమదేవి’శకుని’’సుయోధన’ రూపం
వనవాసంపూర్తి మాచర్ల మాకిమ్మనగ
అలరాజ రాయబారం చారిత్రాత్మకం
నాగమ్మ నిరాకరించే రాయబారంలో
అల్లుడుఅలరాజు గురజాల’వారసుడు’
రాయబారి అలరాజును కుట్రతోవధించే
“మేడపిలో అలరాజు చావు”
అదే ‘పల్నాటి యుద్ధానికి’ అంకురం
అందుకే ‘పల్నాటి యుద్ధం’అనివార్యం

Part ii Continues

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”

పల్నాటి హోరు (Hoary Past క్రీ.శ 1178 - 1182)
(PART II)

నాయకురాలు నాగమ్మ
భరతఖండ ప్రప్రధమ మహిళామంత్రిణి
గురజాల నలగామరాజు మహా మంత్రి
‘ఆరవెల్లి’కరీంనగర కుగ్రామంలో జన్మం
‘పంటరెడ్డి’ జగ్గారెడ్డి పుత్రికయేనాగమ్మ
సాధారణ గ్రామీణస్త్రీ అసాధారణసాధన
కత్తి సాము అశ్వస్వారీలో ఆరి తేరింది
చొప్పదంట్ల పోరులో తండ్రి,భర్తమరణం
మూడ్రోజుల ముచ్చటగనే వితంతువు
ఆ నాడే మొదలు బ్రహ్మన్నపై ద్వేషం
పల్నాడు వరకు చేరింది పగ తీరింది
“పల్నాటి యుద్ధం” - లోక ప్రశస్త్యం
రాయబారంవికటితం యుద్ధంప్రకటితం
అలరాజువధతో క్రోధాగ్ని ద్విగుణీకృతం
మాచర్ల మలిదేవ కార్యంపూడి కదనం
‘మహాభారత్’ తలపించే మహాయుద్ధం
ఒంగోలుమేడపిలో కదలింది మహాసేన
శ్రీనాధుడి వర్ణన “దివ్యస్వరూపాల్తో మూర్తీభవించిన
మలిదేవభూపతి, మంత్రి బ్రహ్మనాయుడు నేతలై”
“దండు పయనిచండం దారిపొడుగు వినిపిస్తాయి- డమాయీలు,కాహళలు,మురజలు,బూరలు,
శంఖాలు, మురళి జయం, తప్పెటలు, రుంజలు,
డోళ్ళు, చిరుగంటలు”
‘జయముహూర్తం’జయజయ ధ్వనితో
ఎనభై మైళ్ళ దూరం సేనల ప్రయాణం
గురజాలవారి గుండెలలోగుబులెత్తించే
మాచర్లగురజాల మధ్య కార్యమపూడి
రణరంగక్షేత్రం పల్నాటివారి‘కురుక్షేత్రం’
మలిదేవ నలగాముల ఘోర యుద్ధం
జ్ఞాతి వైరం రాజ్య కాంక్ష నాగమ్మ కుట్ర
అయిదు రోజుల అనవరోధంగా కదనం
వేలాదిసైన్య నష్టం అశ్వహస్తుల హతం
మలిదేవుడు సహా 66వీరుల మరణం
నాగులేరు రక్తపుటేరుగ మారి పారింది
నాగమ్మపగ నాగులేటి రుధిర ధార
ప్రాణనష్టం గాంచలేని బ్రహ్మనాయుడు
సంధి మార్గమొకటే భావ్యంగ భావించే
బంగరు బొంగరాల వీరుడు
ఉదాత్త బ్రహ్మనాయుని తపోపుత్రుడు
‘బాల చంద్రుడు’ చివరకు రంగప్రవేశం
బ్రహ్మన్నఐతాంబల ఏకైక తనయుడు
ముద్దుగా పెరిగినా సకలవిద్యావీరుడు
బొంగరక్రీడలో వైశ్యపడతి పరిహాసంలో
యుద్ధవృత్తాంత మెరిగిమేలుకొన్నాడు
సతి వీర మాంచాల వీరతిలకం గైకొనే
కార్యమపూడి ఖడ్గం బూని చేరినాడు
తండ్రి సంధి సమాధాన మార్గ మరసే
యుద్ధంచేయజాలని జన్మ వృధాయని
మిత్ర అనపోతు ఆత్మహత్యసందేశంతో
ఆక్రోషంతోసంధివిరమించి సమరంచేసే
అలరాజ సూర్య భేతాళం ఝళిపించే
శతృసేనల చీల్చి చెండాడిన ధీరుడు
అలరాజుని జంపిన నరసింగుని శిరం
తండ్రి మంత్రి బ్రహ్మన్నపాదాలనుంచే
పేరిందేవికిచ్చిన వాగ్దానం నెరవెరింది
అమర అలరాజ దేవులకాత్మ శాంతి
పుత్ర బాలచంద్రుని పిత ప్రశంసించే
కొనసాగిన యుద్ధంలో స్వైర విహారం
బొంగరమై వధించే శతృ సేనల తానే
ఆసంకుర సమరంలో‘సామంతం’ఖడ్గం
గురజాల సేనల విరివిగ అంతం జేసె
ఒంటరి వీరుడై ‘బాలచంద్రుని యుద్ధం’
ఏకాకియై వీరస్వర్గము ‘అభిమన్యుడై’
బాలచంద్రుని కదన కౌశలమపూర్వం
తండ్రి పుత్రుడు అమర వీరుని మెచ్చే
శ్రీనాధుడంతటి మహాకవి స్పందించే
“బాలచంద్ర యుద్ధం” కావ్య మందించే
PART III Continues

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”

పల్నాటి హోరు (Hoary Past క్రీ.శ 1178 - 1182)


( PART III)

స్వల్పసమయ యుద్ధవిరమణ ఆన
జన,ధన,ప్రాణ నష్టం అయినది చాలు
సంధిసామరస్యాలు మేలన్నబ్రహ్మన్న
భట్టు రాయబారం పట్టుగా జరిపించే భట్టు నలగామరాజుకు రాజనీతి తెల్పే
“ పలువలుమిముజేరి పగజావనీక
చెప్పుచునుందురు చెనటివాక్యములు
ఐకమత్యముచెడు నద్దానితోడ
చెడునుబలంబును చెడునుభాగ్యంబు
చెడునుయశంబును చెడునుశౌర్యంబు
చెడునురాజ్యంబులు చెడ్డపిమ్మటను
దేశంబు పరనృపాధీనమౌసుమ్ము
పారతంత్ర్యంబు మీపైబడగలదు
పరతంత్రజనముల పాలికష్టములు
చెప్పంగనలవియే శివునకునైన
పంజరంబుననున్న పక్షులరీతి
బంధించిబుట్టలో పాములవాఁడు
వదలకపెట్టిన ఫణులచందమున
గంగిరెద్దులవాఁడు కావరమణచి
ముకుదాడుపొడిచిన పోతెద్దులట్లు
బోనులోనుంచిన పులులవిధంబు
స్వతంత్ర్యహీనఁత బడియుండవలయు
పరికింపగా మనోవాక్కాయములను
ప్రథమమ్ముపట్టగా రానిదిగాన
వాక్కాయములురెండు బంధింపబడును
మనసులోఁబుట్టిన మంచితలంపు
లాచరణమునందు అలవికాకున్న
జన్మఫలంబేమి చచ్చుటేమేలు
అవ్యక్తకీట తిర్యగనేకహీన
యోనులలో నెన్నియోమార్లు పుట్టి
పడయకపడయక పడిసినయట్టి
దుర్లభనరజన్మ దూషితంబగును
పార్థివాయిటువంటి పారతంత్ర్యంబు
కటకటా పగవారికైననువలదు”
“ఉభయవాదులుమీర లొక్కటైయున్న
సకలకార్యంబుల సమకూర్పవచ్చు
ప్రజలకుసుఖమౌను పంటలుపండు
ధనముసంపాదింప దగియుండునపుడు
సంపూర్ణకాములై సకలసేవకులు
కాపాడుదురుమిమ్ము కనిపెట్టియుండి
పరరాజులనుగొల్వ పైకొనిపోయి
అమితమ్ముగాగ ధనాదులనెల్ల
కొనవచ్చు ధర్మముల్ కూర్పంగవచ్చు
సత్కీర్తిజగముల సాంద్రమైనిల్చు
కలహించి వెనుకటి కౌరవులెల్ల
గతిచెడిపడినట్టి కష్టముల్ వినమె
పగపెరిగించుట భావ్యంబుగాదు
ఉభయవాదులుమీర లొకటికనుక
నయమొప్పజెప్పితి నామాటవినుడి
అనుచుజెప్పిననీతు లాలింపడయ్యె!!”


భట్టుహితవు సహింపడునలగాముడు
నాగమాంబ ‘న్యాయమే’ నయమైందనే

“ఇద్దరురాజులై యేర్పడిరేని
అవనిలోపలనాఙ్ఞ కమరికయౌనె
సిరిపొత్తుచేయిట చెల్లునుగాని
ఆఙ్ఞపొత్తిచ్చుట అదినీతిగాదు
చర్చించిచూచిన ఙ్ఞాతియుండంగ
అగ్నితోబనియేమి అన్నవాక్యంబు
వినవెపెద్దలుచెప్ప పృథ్వీతలేంద్ర
పరగకుజోటివ్వ పాదుకొనెదరు
తరువాతబెరుకంగ ధరనసాధ్యంబు
పాండవులకుభూమి పాలిచ్చిపిదప
కౌరవులేమైరి కార్యమర్మజ్ఞ
నీవెరుంగనినీతి నేనెరుంగుదునే
అనవినిభూమీశు డాత్మలోదెలిసి”
పితృసమానులు పెంచిన తండ్రి
బ్రహ్మనాయుని తలంపడాయే!!
మహామంత్రి బ్రహ్మన్న శౌర్యం వీరం
ఎరుగనివాడు కాడా గురజాలరాజు
తెలిసీతెలియని మనుజుడాయే‘ఆరాజు
నాయకిదుర్బోధలే ‘హితవాక్యాలాయే’
‘మార్జాల కలహం మర్కటం మధ్యవర్తి’
సంధి నిరాకరించే ,సమరము సాగే
‘అంతఃకలహాలే ఆంగ్లేయుల ఆయుధం
‘మాచర్ల’ రేచెర్ల బ్రహ్మన్న రెచ్చిపోయే
స్వయంగా సంగరమున ఉగ్రసంహారం
చరిత్ర సృష్టించే మహాభారత సామ్యం!

ఘోర సంగ్రామ పరిణామం విషాదమే
తమ్ములు, తనయులు, అల్లురే గాక
యోధులు,మహావీరులు,సైన్యవరులు
రధ గజ తురగ సంపదలు సర్వనాశం
తుదకు బ్రహ్మన్ననలగాములే మిగిలే
“పోరునష్టం పొందులాభం”మార్గంశ్రేష్టం
గురజాలమాచర్ల పల్నాడైమళ్ళీఏకమై
రామరాజ్యం వెలసింది ప్రజా క్షేమమై
సహృదయుడు బ్రహ్మన్న మంత్రియై
రాజ్య విభజన అంతఃకలహం హత్యల
కుట్రకుతంత్ర అధికార దుష్ప్రయోజనం
నేరస్థురాలుగా నాగమ్మ బందీ ఆయే

పల్నాటి యుద్ధం తుదకు ముగిసింది

PART IV Continues

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”

పల్నాటి హోరు (Hoary Past క్రీ.శ 1178 - 1182)
(PART IV)

పల్నాటి యుద్ధం తుదకు ముగిసింది
మహా విష్ణుభక్తుడు ఉదాత్తపురుషుడు
తనఆశయసిద్ధికై సత్కార్యాలుసాగించే
ప్రాణమునిచ్చి వీరస్వర్గ మొందిన 66
వీరు లందరికీ ‘వీర్లాలయం’ నిర్మించే
వీరునికొక ‘వీరగల్లు’ 66 స్థాపిత గుడి
కార్యమపూడి వీరాచరణపీఠం స్థాపించే

ప్రజాహితుడు బడుగువర్గాలబంధువు
పరమ విష్ణు భక్తుడు ఉత్తముడు
కృష్ణా తీరాన నాగార్జున కొండచరియ
గుత్తి కొండ బిలమున బ్రహ్మన్న బస
ఈ నాటికీ ఏ నాటికీ బ్రతికేయున్నాడు
బ్రహ్మన్న యన్నది పల్నాటి విస్వసం

పశ్చాత్తాప ప్రాయశ్చిత్తంపాపమోచనం
ప్రజాహితకార్యాచరణ గావింపనాగమ్మ
స్వస్థలం ఆరవెల్లిచేరే నాగమాంబ దేవి
సర్వమత సమసమాజ సేవలందించే
వారధుల నిర్మించే చోరుల సంహరించే
గ్రామం సుభిక్షంగ మార్చి ఆనందించే
ప్రజలకు ఆమె ఖ్యాతి పూజార్హమైంది
‘నాగమ్మ గుడి’ నేటికీ ప్రశస్త మైంది!!

వీర బ్రహ్మనాయుని సరి క్రొత్త భావం
కార్యమపూడి వీరారాధన ఉత్సవాలు
నేటివరకూ “పల్నాటిహోరు” చాటుతు
కార్తీక మాసాన ఐదు రోజుల సంబరం
బ్రహ్మన్న బ్రహ్మరధంబట్టిన వీరపూజ
8వందలేళ్ళైన సాలుదప్పకసాగుపూజ
సమరవీర్ల ఆరాధన ఐరోపా రోం లోనే
కాక మరొక్కఊరు మన కార్యమపూడి
14జిల్లాల ప్రజలు జాతిమత బేధంలేక
అమావాస్యమొదలు ఐదురోజులపూజ
రాచగావు రాయబారం మందపోరు
కోడిపోరు మరియు కళ్లిపాడు పేరున
రోజుకో స్మారక కధనంగా వీరులపూజ
వీరుల నిజ ఖడ్గ సేవ ఉద్వేగ భరితం
‘అమరవీరుల నివాళి’ ఉత్తేజ పూరితం

ఈ ‘పల్నాటి హోరు’చరిత్రలో నిజపోరు
పల్నాటి వీరుల కరవాల కవచాలు
విల్లంబులు,ఈటె, బల్లెములన్నియు
బ్రహ్మన్న స్థాపిత చెన్నకేశవ సన్నిధి
భద్రపరచి భక్తులచే భజింపబడునాయే

హోరీపాస్ట్‘పల్నాటి హోరు’ మనహిస్టరీ
ఆ చరిత్రలోకి మరుపయనం వీరావేశం
***************************

ms creations చెప్పారు...

’మాయ’...
=====================

నీ ఇంద్రియాలకు నిగ్రహశక్తి నింపినప్పుడు..
’మాయ’ అన్న మాటకు చోటెక్కడ?

నీ మనోవాంఛలకు కళ్ళెం పడినప్పడు..
’మాయ’ అన్న శబ్దానికి అర్థమెక్కడ?

నీ మూర్ఖత్వపు అజ్ఞానం వీడినప్పడు..
’మాయ’ అన్నపదాల పలుకెక్కడ?

నీ త్రిగుణాతీత పయనం సాగినప్పడు..
’మాయ’ అన్న స్థానానికి ఉనికెక్కడ?

నీ ఇహలోక సౌఖ్యాలకు తిలోదకాలిచ్చినప్పడు..
’మాయ’ అన్నఅడుగుకు మూలమెక్కడ?

నీ రాగ,ద్వేషాలు హద్దులు దాటనప్పుడు..
’మాయ’ అన్న పాదానికి తోడెక్కడ?

నీ లోని నేనన్న భావన నిలువరించినప్పుడు..
’మాయ’ అన్న వాక్కుకు దిక్కెక్కడ?

సర్వ ’మాయ’లను నీ శక్తి,యుక్తులచే ఛేదించి చూడు.
’మాయా’ జగత్తులోన.. ఓ వెలుగు వెలిగి చూడు.
నీ మనో సంకల్పంతో.. 'మాయ'నే మటు 'మాయం' చేసిచూడు.
=======================

’’మాయావినో మమిరే అశ్య మాయాయ’’
(ఋగ్వేదం 9.83.3)
(మహా మాయగాళ్ళు ఆయన మాయచేతనే మాయచేస్తుంటారు.)
=======================

రచన : మొరుమూరి శేషాచారి
05 మే 2021

KOSURI SUMANTH BABU "SUMAKIRANASAMYUKTHAM" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”

‘యువరాణి సంయుక్త’
రాణి సంయుక్త
అప్సర తిలోత్తమ మానవావతారమట
కనౌజ్ రాకుమారి సుకుమార సుందరి
ఆర్యావర్త వారణాసి కడ కనౌజ్ రాజ్యం
కన్యాకుబ్జ ప్రదేశమే ‘కనౌజ్’గా ప్రతీతి
12వ శతాబ్దం నాటి అమర ప్రేమ గాధ

రాథోడ్ వంశావళి రాజాజయచంద్రుడు
రాజా జైచంద్ ఏకైక అనుంగు పుత్రిక
‘సంయుక్త’ ‘సన్యోగిత’‘సంజుక్త’ ‘సన్యుక్త’
నామధేయ‘యువరాణిసంయుక్త’ఆమె
ముగ్ధ మనోహర రూప అందాల అతివ
అందమేగాదు సంయుక్త సకలవిద్యల
గాన నాట్య కళ అశ్వస్వారి కత్తిసాము
కదనకౌశలం పరిపాలనాపాటవయుక్తి
యుక్తాయుక్త వ్యక్తావ్యక్తవ్యక్తిసంయుక్త
నేర్పరి సద్గుణవతి తండ్రి ప్రియపుత్రిక
దేశప్రజానీకానికి అభిమాన రాకుమారి
పలుదేశ యువరాజులు మెచ్చిన నారి

యుక్త వయసు సంయుక్త పృధ్వీ రాజ్
ప్రేమగాధ పృధ్విలో అతిశయపురాణం
ఢిల్లీరాజా పృధ్వీరాజ్ చౌహాన్ వీరుడు
అసహాయశూరుడు అతిపరాక్రముడు
పృధ్వీరాజ్ పృధ్వికేరాజు హిందూపులి
విలువిద్యలోమేటిఆయనకాయనేసాటి
శబ్దభేది విద్యలోనూ ప్రతిభ అద్భుతం
1179 11 ఏళ్ల బాల్యంలోనే రాజ దీక్ష
చివరికి ముందు హిందూ పాలకుడు
ఢిల్లీ ఆజ్మీర్ల నుండి ఉత్తర భారత రాజు
పలురాజుల గెలిచి రాజ్య విస్తరణ జేసె
ముస్లిం దండయాత్రల కడ్డుగోడ పృధ్వీ
స్వరాజ్యం స్వతంత్రం గాచిన రారాజు
ముహమ్మద్ గోరీ 14 దండయాత్రలు
విఫలీకృతం జేసి విజయం సాధించే
పృధ్వీ రాజు ప్రతాపం దేశవ్యాప్త కీర్తి
యువరాణి సంయుక్త కనుగొన్నది
యుక్తమనసు ఆరూపం చూరగొన్నది
సంయుక్త సద్గుణరూపాలు ఢిల్లీవరకూ
పృధ్వీరాజు హృదయంలోప్రేమోదయం
పృధ్విలోఆ మరో అమర ప్రేమోదంతం

తండ్రిజైచంద్ తనయవివాహ యత్నం
తగిన వరాన్వేషణ తక్షణ నిర్వహణ
రాకుమారినిమెచ్చి పలురాజ పిలుపు
రాకుమారికినచ్చిన యువరాజేసబబు
‘స్వయంవరం’నిర్వహింప నిర్ణయంజేసె
స్వయంవరపూర్వం అశ్వమేధయాగం
‘అశ్వమేధ యాగ” ఆహ్వానంరాజులకు
“సంయుక్తా స్వయంవరం” సందేశం
సామంతులు బహుమతులతో హాజర్
ఢిల్లీ చక్రవర్తి పృధ్వీరాజుతో బద్ధవైరం
ప్రతిమంజేసి ద్వారాపాలక స్థానమిచ్చే
ప్రతిభావంతుని పరాభవించిప్రమోదం
కన్యాకుబ్జ రాజకన్య రారాజుల కలకన్య
యుక్త సంయుక్త వరమాలతో ప్రవేశం
ఉత్తమాసీనరాజులు ఉద్వేగభరితులు
‘స్వయంవర’ కార్యక్ర మారంభమాయే
పరిచయ వాక్యాలేవీ పట్టించుకోని స్థితి
పరీక్షా పరికింపు ప్రతీక్ష పృధ్వీరాజునకే
ప్రతిమయై నడచి ద్వారపాలక ప్రతిమ
శిల్పరూపపృధ్వీరాజశిరానికేవరమాల
ఆస్థానమంతా అల్లకల్లోలం ఆశ్చర్యం
వైరినివరించిన పుత్రికనే బంధింప ఆన
గారాల తనయకే తప్పని కారాగారం!!
(PART II Cont.)

KOSURI SUMANTH BABU "SUMAKIRANASAMYUKTHAM" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”

‘యువరాణి సంయుక్త’
రాణి సంయుక్త
(PART II Contd.)

తండ్రి జైచంద్ తనకు జేసిన పరాభవం
తనయ రాణిసంయుక్త జేసినసత్కారం
తెలిసిన పృధ్వీరాజ్చౌహాన్ పులకిరించే
తక్షణంశరవేగం కార్యాచరణకార్యక్రమం
వరించిన వనితను విడిపింప ధ్యేయం
కనౌజ్ పై ప్రతీకారం యుధ్ధం ప్రకటన
కోట శివార్ల శిబిరాల సైన్య సన్నాహం
ఒకరాత్రి అతిదుర్లభ సంయుక్తాయోగం
ఆంతరంగిక సఖీభట సహాయకైంకర్యం
సంయుక్తపృధ్వీరాజ్ల గాంధర్వవివాహం
మానసిక ప్రేమికుల జీవన బాంధవ్యం

జైచంద్ కహరీకంఠీరనాయకత్వసేనలు
3000 సైన్యం పృధ్వీ రాజుపై పంపే
పృధ్వీరాజ మంత్రి ఆతతాయికి సేనాని
కహరకంఠీరికి మధ్య ఘోరమైన పోరు
మంత్రిఆతతాయి పోరవీరస్వర్గమాయే
ఢిల్లీ సేనలు డస్సిపోయే భ్రాంతి పాలు
పృధ్వీ రాజుపై లంఘించి పైకెగసిన
కహరకంఠీర కరవాలం ఖండములైంది
ఒక చురకత్తి వంటి యువకుడొచ్చే
పృధ్వీరాజు ప్రాణ మానముల గాచే
ఆ వీరుడే మన వీర వనిత సంయుక్త
రాణి ఆగమనం ఢిల్లీసేనలప్రోత్సహించే
విజృంభించి కనౌజ్ సేనలనెదురించే
పృధ్వీరాజు సంయుక్త జంట ఢిల్లీ జెరే
మూడవ ముఖ్య మహారాణి సంయుక్త
ఢిల్లీ రాణిగా రాణించే కనౌజ్ సంయుక్త
ప్రజల ప్రేమానురాగ పాలకులైనారు

కన్యాకుబ్జ రాజాజైచంద్ కసిదీర ప్రతీక్ష
ఖైబరుకనుమ ద్వార ఇరానీయుడు
శహాబుద్దీన్ ముహమ్మద్గోరీ చొరబాటు
భారతదేశంపై కొల్లగొట్టుదండయాత్రలు
120000దృఢసేనల గోరీ దురాక్రమణ
ముహమ్మద్ గోరీ 14మార్లదండయాత్ర
దేవాలయవిధ్వంసం స్త్రీలపైదురాచారం
పాల్పడ్డ గోరీకి పృధ్వీరాజు గుణపాఠం
జైచంద్ మినహా రాజులంతా సాయమే
పృధ్వీరాజు సహృదయంగోరీకిప్రాణభిక్ష

మనరాజ్యాల పరస్పరద్వేషవిద్వేషాలు
పరాయిల పాలిట పాలుబోసే వరాలు
కనౌజ్ రాజు గోరీతోచేతులుగలిపినాడు
ఢిల్లీపైదండెత్తగోరీనుత్సాహపరచినాడు
‘తల్లి’కే అపకారం జేయ తలపెట్టినాడు
మారువేషంలో వచ్చిన రాణిసంయుక్త
తనయసంయుక్త హితవుమాటవినడు
తనతండ్రి యనుట తలవంపులేనాయే
గోరీ కనౌజ్ సేనల మరో దండయాత్ర
తరైన్లో గోరీ పృధ్వీరాజ సేనల యుధ్ధం
ఇరు వైపుల సేనల ప్రాణ నష్టం పెరిగే
ఢిల్లీసేనలు సన్నగిల్లిపోయే ఆ పోరులో
పృధ్వీరాజు మనసు తల్లడిలిపోయే!!
రాణి సంయుక్త పౌరుష ప్రోత్సాహం
క్షత్రియ ధర్మం వెన్నుజూపరాని వీరం
రణమున జయమో మరణమో ఏకం
గెలిచివచ్చిన కలసి కదలుదాము లేక
మడిసిన వీరస్వర్గాన కలసికొందుము
మీధర్మం సలుపుడు నా పత్ని ధర్మం
ఢిల్లీ వనితల కాచి ప్రోత్సాహంచి రక్షణ
తామోడిన గోరీకి ఢిల్లీ స్త్రీజాతి చిక్కదు
తమదేశ తమమానరక్షణకాత్మాహుతి
స్త్రీలందరూ పరమేశ్వర పూజలొనర్చిరి

పోరులో పృధ్వీరాజు బందీ అయినాడు
బలీయ లోహ సంకెళ్ళు తన కాళ్ళకు
శక్తివంతమైన కళ్ళు శత్రువు తీయించే
కారాగారవాసం దేశానికై అనుభవించే
దేశంగాని దూరంగ గొనిపోయేనకటా!
ఓటమినెరిగిన ఢిల్లీ పరిత్యాగం జేసె
గెలిచినగోరీకి ఒక్కస్త్రీ గానరాదు ఢిల్లీలో
ప్రతిజ్ఞాపాలన మనస్త్రీజాతికికొత్తగాదు!

కళ్ళుపోయినా పృధ్వీరాజుచేవచావదు
విలువిద్యలోమేటిఆయనకాయనేసాటి
శబ్దభేది విద్యలోనూ ప్రతిభ అద్భుతం
పృధ్వీరాజ మిత్రుడు కవి ఛాందభట్టు
గోరీని చేరి యుక్తితో స్నేహం గలిపే
పృధ్వీరాజును కారాగృహమున గలిసే
గోరీతో మాటలతో మాటగ యుక్తిపన్ని
పృధ్వీరాజు శబ్దభేది విద్యప్రతిభ దేలిపే
గోరీఉత్సుకతో పృధ్వీరాజును రప్పించే
కంచు పళ్లాన్ని మోగిస్తేదానినిచేదించు
"నాలుగు వాసాల ఎత్తు లో 24 గజాల 8 బెత్తెడుల దూరం లో నీకు ఎదురుగా ఉన్నాడు సుల్తాన్”
అన్నపద్య రచన పఠిస్తాడు మిత్రభట్టు
ఈ మారైనా వదలకు మనశత్రువును
“లక్ష్యాన్నిశబ్దబేధివిలువిద్య సాధించు”
ఛాందభట్టుసలహా గోరీ తానే ఆనతిచ్చే
క్షుణ్ణంగవిని పృధ్వీరాజువిలు సంధించే
ఆ యానతి వచ్చిన దిశ అంబుపారే
గురిగగోరీ గుండెల చీల్చిచంపే ఆ శరం
కళ్ళులేకున్నా చెవులతో పసిగట్టేరాజు
మహాధముని ప్రాణందీసిన రక్షకుడు
వెనువెంటనే ప్రణాళిక ప్రకారం కార్యం
ఛాందభట్టు పృధ్వీరాజునుపొడిచిచంపే
తానూఅదేకత్తికి ఎరజేసి ప్రాణం విడిచే
దేశభక్తి,పతి భక్తి,స్నేహశక్తికి ఆదర్శం
అమరప్రేమ కధ నిలిచే ఆచంద్రార్కం!!
***********************

























కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”


శివగంగ శౌర్యం





(PART I)
“శివగంగై రాజ్యంలోని చారిత్రాత్మక అంతఃపురం వద్ద ’వేలురాణి ’ విగ్రహం.”

‘వీర వనిత’ రాణి వేలు నాచ్చియార్
‘శివగంగై’ నేలిన ‘వీరమంగై’ యామె
సూర్యాస్తం లేని ఆంగ్లేయపరిపాలనలో
ధైర్య సాహసాల జూపిన దక్షిణాది రాణి
బ్రిటనులపై విజేతయై జయభేరిచాటిన
మొట్టమొదటి భారతీయ మహా రాణి
శివగంగసీమ శివంగి శౌర్య ప్రతాపశాలి
శివగంగ పాళయం పౌరుషానికి ప్రతీక
1730 జనవరి 3 సుదినాన ఉద్భవం
శివగంగ సమీపం సక్కంది గ్రామంలో
రామనాధ పురం రాజా చెల్లముత్తు విజయ రఘునాధ సేతుపతి
రాణి సక్కంది ముత్తాల్ ఏకైక పుత్రిక
రామనాధపురరాజ్య యువరాజ్ఞి ఆమె
యువరాజుగనే రాజ విద్యలన్నీ నేర్చే
కత్తిసాము కర్రసాము అశ్వపు స్వారీ
విలువిద్య- పలు కదనకౌశలం చూపె
‘వలరి’ వీచుటలో అతిశత్రుభయంకరం
పలుభాషాకోవిద పండితురాలు ‘వేలు’
తమిళ ఆంగ్ల ఫ్రెంచి ఉర్దూభాషల దిట్ట
శివగంగ రాజా ముత్తు వడుగనాధ పెరియవఉడైదేవర్ తో ఆమెపరిణయం
1746 లో మెట్టినిల్లు శివగంగసీమచేరె
రామ్నాడ్ యువరాణి ‘శివగంగ’ రాణి
రాజదంపతులకు ‘వెల్లచ్చి’ఒకే పుత్రిక
ఉడైదేవర్ యుద్ధవిద్యల బహు నేర్పరి
‘వలరి’ విసురుటలో ఆరి తేరిన రాజు
పులిని విసిరి వేయు ‘పెరియమరుదు
సింహబలుడు చిన్నమరుదు సేనాన్లు
రాజు బ్రిటీషువారిపన్నుల తిరస్కరించె
వడుగనాధుని ఎదురు నిలువ జాలని
బ్రిటిష్ సేనలు ఆర్కాట్ నవాబు సేనతో
బొంజోరు దొర పన్నిన కుతంత్రమున
శివగంగపై ఆకస్మిక దాడికి పాల్పడే
‘కాళైయర్కోయిల్’పూజలో నిరాయుధ
రాజుపైకాల్పులలో రాజు వీరగతి నందే శివగంగ సీమ శతృసేనల వశమాయె!
శివగంగ ‘హుస్సైన్ నగరు’ గా మారె
1772శివగంగసీమ సీమదొరలదాయె

రాణి వేలు బ్రిటనులనెదిరింప ప్రణాళిక
చిన్నమరుదు సలహా శివగంగ విడిచె
దిండుగల్ విరూపాక్షికోట పుత్రికతోచేరె
పాళయకారుడు గోపాల నాయకుడు
చేరదీసే,రాణి బృందానికిఆశ్రయమిచ్చే
ఎనిమిదేళ్ళ ఎడతెరపి లేని కఠినకృషి
సేనల చేర్చే ఆయుధాల సేకరించె
దుర్గమ వనముల కొండ శిఖరాలపై
దుర్గముల తలదాచి ఎదురుదెబ్బదీసె
మైసూరు పాలక హైదర్ అలీ నర్ధించి
సైనిక ఆయుధ సాయము నందుకొనె
శ్రీ రాజరాజేశ్వరీ దేవిని కొలువజాలని
రాణికి దేవి బంగరు ప్రతిమబహుమతి
సుల్తాన్ హైదర్అలీ చూపిన సమత్వం

వేలునాచ్చియార్ దారినదాహందీర్చిన
పశులకాపరి ‘ఉడైయాళ్’రాణి జాడల
బ్రిటన్ సేనలు బెదిరించినా పలుకదు
చిత్రవధనోర్చే చివరకు ప్రాణ మర్పించె
స్త్రీలలోసంచలనం సృష్టించినఘట్టమది
వేలాది మహిళలు ‘ఉడైయాళ్’దళమై
రాణివద్ద అండగ దండుగా వలారినేర్చే
మాతృ గడ్డ విజయమే తమ ధ్యేయం

రహస్య శిబిరాల విశ్వాస సేనల శిక్షణ
మహిళా దళాల నుత్తేజమినుమడించె
శివగంగ స్త్రీ లోకం ఏకమై శివమెత్తింది
హైదర్ అలీ సైనికుల సాయము నొందే
1780-బ్రిటనులపై యుద్ధభేరిమ్రోగించే
శివగంగ ‘గౌరీవిలాస’ దసరా వేడుకలు
తాము భజించే రాజరాజేశ్వరిఆలయం
ఉడయాళ్ దళం భక్తుల రూప ప్రవేశం
ప్రతి మహిళ ప్రభు భక్తితో కత్తి నాభిలో
ప్రతీకార దీక్షతో పగ దీర్చాలన్నకక్షతో
మర్మవేషంలో పొంచియున్నవ్యాఘ్రమై
మహిషాసుర వధకైన దసరాసంబరాల
తగు సమయం తమ కనుగుణ్యమని
శ్రీ రాజరాజేశ్వరీ దీపార్చన చేయు వేళ
సేనాని‘కుయిలి’ దీపఆజ్యం దివ్వేతానై
కోవెలకావలి ప్రేలుడాయుధ గిడ్డంగిలో
దుమికి ఆత్మాహుతి జ్వాలల పేల్చే
బ్రిటీషు సేనలు వెలవెల పోయి నిలిచే
‘కుయిలి’ప్రధమ ‘మానవబాంబు’ఆమె
శివగంగకు విముక్తిదెచ్చిన ఆత్మత్యాగి
‘దళిత’కుయిలి వెలురాణి దత్తపుత్రిక!
‘కుయిలి’కై సర్వస్త్రీసేన ఉదయమాయే
వేలు రాణి పై ‘ఉడైయాళ్ సేనతో గెలిచే
లొంగిన ‘బొంజోరుకు’ ప్రాణదానమిచ్చే
ఓడిన రాజ్యాన్ని గెలిచిన వేలు రాణి
ఆంగ్లేయుల నోడించిన మొదటి రాజ్ఞి
బ్రిటీషు సామ్రాజ్యంలో ‘రెకార్డు’ సృష్టి
హైదర్ అలీసేనలతో తన సాహసాలతో
ఆర్కాటు నవాబును సైత మోడించే
‘వీరమంగై’ వీరవనిత’గ సార్ధకమాయే
ఫ్రెంచ్ వీరాంగన జోన్ ఆఫ్ ఆర్క్ పోలి
జోన్ఆఫ్ఆర్క్ ఆఫ్ఇండియావేలురాణి
బ్రిటిష్ ఝండ దిగింది మొట్టమొదటిగ
శివగంగ పతాకం ధ్వజమెక్కి చాటింది
‘హుస్సేన్నగర్’మళ్ళీ‘శివగంగ’ యైనది
1780-90ల రాణి వేలు స్వపరిపాలన
శివగంగపాళయం సర్వస్వతంత్రమైంది
‘1857’కు 77 ఏళ్ల పూర్వ వీర చరిత్ర బ్రిటిషువారిపై మొదటి పోరాటమది!!

(PART II Contd.)

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...



కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”
శివగంగ శౌర్యం
కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”
శివగంగ శౌర్యం
(PART II )


యువరాణి‘వెల్లచ్చి’గద్దెనేక్కే తల్లి ఆన
శివగంగనేలే నేర్పుగ 1790-93మధ్య
రాజ్యభారంతో వ్యాధిగ్రస్త తల్లి బాధ్యత!
ఫ్రాన్స్ నాటసైతం చికిత్స తల్లికానాడు
ఫ్రెంచ్ విప్లవదార్లకామె ఆదర్శమాయె
1796 25 డిసెంబరు తుదిశ్వాసనందే
వీరవనితచరిత్ర నేటికీ మరగిపోని గాధ
శివగంగకేగాదు దేశానికో తలమానికం
శివగంగశౌర్యం వేలురాణిపిదపసాగింది
ఉడైదేవరనుండి వేలు వెల్లచ్చి వరకూ
అండదండలైన మరుదు భ్రాతలిర్వురు
మరుదు పాండ్యులు మహా యోధులు
శివగంగ శౌర్యానికి శాశ్వత ప్రతీకలు
ఒకరువ్యాఘ్రమే ఒకరు సింహస్వప్నం
పెద్ద మరుదు,చిన్న మరుదు ద్వయం
1748 జననం వెల్లమరుదు జ్యేష్టుడు
1753తమ్ముడు చిన్నమరుదుదయం
పుదుపట్టి పొన్నాత్తాల్ వారి వీరమాత
ముక్కులం మూకయ్యసేర్వై పుత్రులు
వడుగనాధ ఉడైయార్ సేనాధిపతులు
మహారాజు నమ్మిన మహాయోధులు
వడుగనాధుని రక్షింప కై వడిసి పట్టి
పులినే గిరగిరత్రిప్పివీచినవెల్లమరుదు
రాజు మెచ్చి‘పాండ్య’నామం జతగూర్చే
మరుదపాండ్య సోదరులని చరిత్రచెప్పే
మన మరుద పాండ్య సోదర వీరులు
ఏరోడైనమిక్స్ ఎరిగిన నిపుణమతులు
‘వలారి’యను గాలిందూసు ఆయుధం
మలచిన ఖ్యాతి మన ‘మరుదు’ లదే
వలారి వలయమార్గానమరలివచ్చేకత్తి
వీచిన వీరుని చేతికే వెనుతిరిగే వాలం
శతృసేనల వధించే ‘విష్ణుచక్రమే’యది
‘వలారి’వీచుటలో వన్నెతెచ్చిన చేయి
‘గెరిల్లాపోరువ్యూహాల’ వారేప్రధములు
ఉడైయార్ బ్రిటీష్ కుట్రకు బలియైనదే
రాణికి తోడై తలమరుగై సేనల చేర్చి
రాజ్యమునకై పొరాడి గెలిచిన ధీరులు
మరుదు సోదరులు 21ఏళ్ల పాలకులు
సర్వ మానవ సమానత్వం సిద్ధాంతం
సర్వమత సామరస్యం వారిఅభిమతం
శివగంగసీమ శ్రేయమైందివారిరక్షణలో
దేశం సస్యశ్యామలం సుభిక్షమై వెలసె

మరుదురాజులు బ్రిటనులకు లొంగరు
ఈస్ట్ఇండియాకం.పన్నుకు విరోధులు
బ్రిటనుల ఆధిక్యం అణచివేత కెదురు
కోయంబుత్తూర్ జైలుబ్రేకు కారణమైరి
వీరపాండ్య కట్టబ్రహ్మన ప్రాణ మిత్రులు
పాళయం కోట జైలుబ్రేకుతో సఖ్యులైరి
సమకాలంలో సమరధ్వజమెత్తినవీర్లు
కట్ట బ్రహ్మన అమరత్వంతో అనుజుడు
ఊమతురై కాశ్రయమిచ్చినఅనుజులు
ఆగ్రహించిన ఆంగ్లేయుల దురాక్రమణ
మరుదు సోదరుల ధాటికాగలేకపోయె
మూడు మాగాణులు మరుదులకొచ్చే
తిరుచిరాపల్లి కొండకోటలో ఎలుగెత్తిన
మరుదుపాండ్యుల జంబూద్వీపప్రతిజ్ఞ
దేశానికే సంచలనాత్మక సందేశ మది
మొదటిస్వాతంత్ర్యసమర తీర్మానమది
పాశ్చాత్య పాలకుల పక్కలో బల్లెమది
భరతఖండంలో వారి ఉనికి ఊసలాడే
బలోపేతమైన బలగాలనుప్రతిపాదించె
బ్రిటన్నుండి విశేషసేనలు తరలి వచ్చే
1801 లో ఘోర సంగ్రామం సాగించె
చోళపురంలో విప్లవకారుల బంధించె
వందలాదివంశీయుల వయసు గానక
తిరుపత్తూరున సామూహికావధ చేసె
1801 అక్టోబరు 24న మన సోదరుల
మహా బలురు అసహాయ శూరులు
దేశ భక్తులు శివగంగ శౌర్య సింహాలు
ఎదురు తిరుగగలరన్న భయముతో
అకటా!వ్యాఘ్ర బోనుల బంధించితెచ్చి
తిరుపత్తూరుకోట ఉరికంబ మెక్కించె!
నిర్దయతో బహిరంగ మరణశిక్ష జరిగె!
మనమరుదు భ్రాతలు ‘మాతృ’సేవలో
చివరివరకూ చిర్నగవున దేశ భక్తితో
అమర వీరులై అమరలోక ప్రాప్తినందే
అదే కడపటి స్వాతంత్ర్య యుధ్ధమాయె
బ్రిటిష్ విస్తారానికి‘ఒకే అడ్డు’ తొలగింది

వారి సేవ వారి ఖ్యాతి సమసిపోలేదు
శివగంగసీమ నేటికీవారి ప్రశస్తిమ్రోగు
అక్టోబరువిప్లవం గ్రామసీమ కధలాయె
అక్టోబరులో వార్షిక‘గురు పూజ’జరుగు
మరుదులు భజించినకాళైయరుకోవెల
సోదరులకు విగ్రహ పూజ ప్రత్యేకం !!
*************************


కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”

మోక్షం


మోక్షం
బృహత్సాగరంలో నీవోయొంటరియోడ
చుట్టువిశాలఅగాధఅంబుధిలో అనాధ
తెరచాపచాలదుతెడ్లువేగిరపడుటలేదు
అమావాస్య రాతిరి అంతా కటిక చీకటి
అంతలో పెను తుఫాను అల్లకల్లోలం
అయోమయం, అపాయం, గమ్యమేది
సాగరాకాశాలు సంగమమై అనంతమై
‘సప్తర్షులు’ ‘ఉత్తర తార’ ఊర్ధ్వాన లేరు
దిక్సూచి లేదు ‘చరవాణి’కి ‘సిగ్నలేదీ’
దిక్కుతెలియని దిక్కులేని నావికుడివి
తీరం బహుదూరం దరిలో ద్వీపం దీవి
దీవినందిన ’దివి’నందు కొన్నటులనే
దీన స్థితిలో ఆప్తులెవరూ లేని జలధి
దూరంలో ఒకవెలుగు ఓ శంఖారావం
ప్రళయంలో’నోవా’,ప్రమాదంలో ‘నౌక’
చేయూతతో నౌకా కెప్టెన్ మానవత్వం
దయతో దరిచేర్చి తీరం చేర్చే దైవత్వం
అట్టిఅతి దుర్లభదుర్గమయాత్ర జీవితం
భవసాగర మధ్యవ్యధ మన కర్మఫలం
నడిసంద్రంలో నావ నాకలోకదివ్యనౌక
కర్మానుసారం కలిగేఇహలోక 'మోక్షం'

'మోక్షం'గతంలో లేదు గతించిన రాదు
నిత్య నిజ జీవనంలోనే ప్రతినిత్య ప్రాప్తి
మానవ జన్మమతిశ్రేష్టం మళ్ళీ రానిది
'మానసప్రజ్ఞ'తో మహనీయమైన సృష్టి
'ఆరోప్రజ్ఞ' నరుదైనజీవి మనీషి మనిషి
మరుజన్మ మరోజన్మరహితం ధ్యేయం
ధ్యేయ పాలనాధ్యయనం ముక్తిమార్గం
కలియుగప్రభావంలేని సదాచారాచరణ
ఫలాపేక్ష లేని కర్మాచరణ ధర్మాచరణ
జీవన్ముక్తివైపు నడిపించు సన్మార్గాలు
సంపద దాన ధర్మాలు ముక్తినీయవు
గురు ప్రశంస గ్రంధపఠనం శ్లోక శ్రవణం
ముముక్షుత్వసాధన సాధనాలుకావు మోక్షమార్గం అతిదూరం అతి దుర్లభం
తమస్థితి నెరిగి పరమలక్ష్య సాధకులు
సద్గురుసద్గ్రంధ హితవున మార్గమరసి
తీవ్రమైన తపోనిష్ట సదా అనుసరించి
అన్నిఅవరోధాలనధిగమించిసాగిపోవు
శక్తిసామర్ధ్యాల సముపార్జించుప్రాజ్ఞులు
"జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతఃత్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో ర్జున॥
- భగవద్గీత (4.9)"
భగవానుని జన్మ,కర్మల దివ్యత్వం
ఎరిగినవ్యక్తికి మరుజన్మలేదని తత్వం
నిజమైన మోక్షం శ్రీ కృష్ణుని ప్రసాదం
మోక్షమన్నది పైలోకాలఉన్నది గాదు
బ్రతికుండగఆత్మతోజీవించడమేమోక్షం
తానంటే శరీరమన్న భ్రాంతి పారద్రోలు
ఆత్మవేరు ఆ బొందేవేరు మనసువేరు
దేహభ్రాంతిని వీడిఆత్మజ్ఞానం పొందాలి
దేహంజడం ఆత్మ చేతనం అన్న నిజం
జీవాత్మ శరీరానికున్న భేద జ్ఞానము
మోక్షంవైపు ఆసక్తిగొల్పు ‘విరక్తి’తెల్పు
(PART II Cont.)

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”

మోక్షం
PART II

‘మోక్షం’ శాశ్వతానందం శ్రేయస్కరం
మరుజన్మపునర్జన్మమరోజన్మరహితం
జన్మకర్మ పునర్జన్మ ఒకపెద్ద వలయం
జన్మతఃకర్మాచరణ కర్మానుసార జన్మ

జన్మజన్మల తీరని బంధమీ కర్మఫలం
మనుజ జన్మ కర్మ లొనర్చక సాగదు
కర్మకార్యాలతో కొత్తబంధాల బందీస్థితి
‘జన్మ కర్మ- కర్మ జన్మ’ఆట వదలదు
ఆ వలయాన్నివీడి బంధాలను విడిచి
చివరకు జీవాత్మ జననమరణాలబాసి
పరంధామం చేరుమోక్ష మీజన్మలోనే
నిష్కామకర్మ ఫలామి, మోక్ష మార్గం
ఫలాపేక్షరహిత కర్మధర్మాచరణమేగతి
ధర్మబధ్ధ నిత్య కర్మలైన అనివార్యం
మోక్షాపేక్ష సైతం లేని కర్మలు సఫలం
‘ధర్మార్ధ కామ’ విజేతలు మోక్షార్హులు
సామాన్యులకు సాధ్యమా?అసాధ్యమే
మహర్షిమునుల కఠోర తపమీయనిది
మహాయజ్ఞయాగాదుల నిష్టతో రానిది
నిష్కామనిండు మనసుభక్తితోప్రార్ధించి
భగవన్ శ్రీకృష్ణ చరణపద్మ శరణు గోరు
భక్తుని కర్మఫలం భగవంతునికర్పణం
శరణు వేడిన భక్తుని కరుణించి కాచు
తపమొనర్చినను రానిమోక్షమొసగు
దేవుని కృపతో కపాలానికే మోక్షమట
కపాలఫాల వ్రాతలు వారివారిపుణ్యమే
విరించి వివరించి రచించిన చేవ్రాలవిలే
“ఈపుర్రెముల్లోకాలతిరిగిమోక్షమందు”
వృధాకాని వృత్తాకారఅక్షరాల నిజాలవి
కపాలమోక్షానికి కారకులైనశాసనాలు
మహాముని దర్శనం కపాల కర్మఫలం
దేవర్షి నారదుడే సారధిగా స్వారీభోగం
‘వైకుంఠం కైలాసం సత్యలోకం స్వర్గం’
ఆ పుర్రెనోచుకున్న ముల్లోక పయనం
నారద మునికొచ్చిన సందేహ నివృత్తి
ఆ కపాలానికి‘వ్రాసియున్న’మోక్షప్రాప్తి
‘కపాల మోక్షం ‘అన్న గాధమర్మమది
మోక్షసాధనకు గీతలోభగవన్నువాచ
“అభ్యాసం కంటే జ్ఞానం,
జ్ఞానం కన్నా ధ్యానం,
ధ్యానం కన్నా కర్మ ఫల త్యాగం శ్రేష్ఠం
త్యాగం వల్లనే శాంతి” దైవ వాక్కు
అట్టికర్మయోగి లోకంలో ధన్యడౌతాడు
కర్మఫలంత్యజించడమే సహజజీవనం
సహజ జీవనమే మోక్షానికి మార్గం!

చివరి మోక్షం ‘పరమపదం’ ‘కైవల్యం’
మోక్షమన్నది పరమ కైవల్యమేగాదు
నిత్యకష్టంనుండి విడుదల ఒక మోక్షం
శోకంబాపి దుఃఖసాగరవిముక్తి మోక్షం
ఇహలోకంలో ఒత్తిడి వదులైతే మోక్షం
మన కర్మఫలంతోనే మోక్షలక్ష్మి వరం
బంధము విడనాడిన నాడే మోక్షప్రాప్తి
బ్రహ్మజ్ఞాని జడభరుతుని లేడి బంధం
భగవచ్చింతన మరపించినకొత్తబంధం
చివరకు మోక్షంలేక మృగ జన్మనొందే
జడభరతునికే మరుజన్మ,జంతుజన్మ
బంధమున చిక్కి బ్రహ్మము మరిచే
అమిత వ్యామోహమే మోక్షావరోధం

‘అహం బ్రహ్మస్మి’ అన్న జ్ఞానయోగం
‘నేను ఎవరు’ అన్నది ఎరిగినదేజ్ఞానం
‘ఆత్మఏది అనాత్మఏదన్నభేదం’జ్ఞానం
ఆత్మ అనంతం అనాత్మ అశాశ్వతం
ఈ భౌతికశరీరం ‘నేనుకాదన్నదే’మేధ
బాధలన్నీ కాయానికే ‘ఆత్మకు’ కాదు
పుట్టుటగిట్టుట సహజంమరణంతధ్యం
జర మరణము శరీరానికే ‘నాకు’గాదు
దేహ మరణానికి భయపడని ప్రాజ్ఞుడు
అట్టివాడే ‘బ్రహ్మజ్ఞాని’యై మోక్షార్హుడు

మోక్షాన్నిబౌద్ధంలో‘నిర్వాణం’అన్నారు
బంధందుఃఖం తీరిపోవటమే నిర్వాణం.
అల గజేంద్ర మోక్షగాధ ఒక దృష్టాంతం
ఇహ సుఖ సౌందర్యమోహమే మకరిగ
భోగలాలసుడైభక్తివిడిచినవాడే ఆకరిగ
కరిమకరుల పోరాటమే వీడనిబంధమై
మహాగజబలమెంతైన చాలదన్నపోరు
చివర మహావిష్ణుచరణమొక్కటేసద్గతి
శరణు గోరిన గజేంద్రునికి మోక్ష ప్రాప్తి
ఈ వృత్తాంతం దైవ కృపకు దృష్టాంతం
గజేంద్ర మోక్షంలో సూక్ష్మ అంతరార్ధం
భక్తిమార్గాన శబరిఅహల్యజటాయులు
శ్రీరామునికృపతో మోక్షమందిన వారు

ఈ భువిలో 84 లక్షల పై జీవరాశులు
అన్నిటా మానవ జన్మ చివరిది, శ్రేష్టం
ఆత్మజ్ఞానంతో మోక్ష సాధన ముఖ్యం
బ్రహ్మం పర బ్రహ్మం అన్నది జీవాత్మ
దేహబలం, మనోబలం, బుద్ధిబలం
అసలైన శక్తిలో 10 శాతం మాత్రమే
90 శాతం ఆత్మబలానికే చెందినదట
ఆత్మస్వరూపమై లక్ష్యముతో జీవనం
దానిని సాధించాలనే తీవ్ర తపనలోనే
ఆత్మబలం జాగృతం చేసుకొనుమార్గం.
చిరులక్ష్యవిజయం పెను సాధనలిచ్చు
ఆత్మబలమద్వితీయంభగవద్గీతాసారం
బాల్య జీవితమంతా ఆటపాటలతోను, యవ్వనం ధనకనక వస్తు వాంఛలతో వృద్ధాప్యం చీకు చింతలతోను గడిపి, జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం అనర్ధం సచ్చిదానంద స్వరూపమైన శ్రీ కృష్ణ పరమాత్మ
వైపుకు అడుగు వేయాలి
బాల్య యవ్వనం వృద్ధాప్యం లోనైనా
పరమార్థమైన మోక్షాన్నికైకృషి చెయ్యి
కాక పరమాత్మనుచేరుకొనేదెప్పుడు?
ఉన్నతమైన మానవజన్మ వివేకంతో
నిత్యభగవన్నామస్మరణతో సద్కర్మల
భక్తి మార్గంలో భగవానుని కరుణగోరి
జీవన పరమార్ధం వైపు పయనించు
దుఃఖ బాధాపూరిత సాంసారిక జీవనం
జనన మరణ చక్రం నుండి విడుదలై
క్షణికమైన లాభనష్టాలు సుఖదుఃఖాల
విముక్తుడై శాశ్వతపరిపూర్ణ ఆనందం
జన్మవిమోచనం మోక్షకైవల్యధామమే
సత్పురుషుల సంగత్యాగ సర్వస్వం!!
*************





















కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”

భక్తి

భక్తియంటే భజించుట భజనజేయుటయే
విభజించుట గాదు విభజన అసలే గాదు
భక్తియంటే కలుపుకోవడం కలసిపోవడం
భక్తి,వ్యాకరణ’విభక్తి’ కలయికకుసంకేతం
జీవేశ్వరకలయికయే భక్తియన్నది నిజం
ఈశ్వరత్వం ఈశ్వరతత్వం ఎరిగిన నాడు
ఆ ఏకత్వం నిజమైనకలయిక పరిపూర్ణం
దేవునిదెలిసిన జీవుడు ఆత్మజ్ఞానియగు
“అహమస్మి” అన్నజ్ఞానమే మోక్షము
కర్మయోగ,జ్ఞానయోగ,సమాధియోగ
భక్తి యోగములన్నీ మోక్ష మార్గాలు
ఆత్మజ్ఞానికి వలసిన భావనయే భక్తి
భక్తి లేని సాధన మోక్షమివ్వ లేదు
ఆ భక్తి లేని పని సార్ధకమవ బోదు.
సగుణ భక్తితో గోవులు,గోపికలు,చెట్లు,
జంతువులు,పాముసైతంమోక్షమందు
సగుణభక్తికి గ్రంధ పఠనం శ్లోక శ్రవణం
విద్యఅధ్యయన మాణ ప్రమేయంలేదు
ఉధ్ధవుని మునిగాజేసిన గోపగోపీ భక్తి
సూక్ష్మరూపలతగగోవర్ధన గిరిపై వెలసి
బృందావనిలో గోపీజన భక్తిగని తరించే
శ్రీకృష్ణునిపై నిండు విశ్వాసం నిత్య భక్తి
మోక్షసాధనకేకైకసాధనం రహదారియే

భక్తులలోరకములు భక్తిలో రకములు

‘ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు,
జ్ఞానులు’ భక్తులలో నాలుగు విధాలవి
భగవంతుని భక్తితో ఆరాధించు భక్తులు
‘ఆర్తులు’ఆపద అవస్థలో ప్రార్ధించువారు
‘అర్ధార్ధులు’ ధన కనక వస్తుల గోరువారు
ఇహలోక సుఖమే ప్రధాన మన్నవారు
‘జిజ్ఞాసువు’ తత్వజ్ఞాన రక్తి గొన్నవాడు
తానెవరు తన గమ్యమేది మోక్షమెక్కడ
‘తత్ త్వం’ లకున్నబంధమేమిటి ఎట్టిది
సర్వేశ్వరుని పొందు సాధ్యం మార్గమేది
అట్టిఆరాలు అన్వేషణలే ఆ జిజ్ఞాసయగు
తర్కించి పెద్దల గురువుల నర్ధించువాడు
‘జ్ఞాని’ దైవ జ్ఞానార్జనకై జీవించు వాడు
అద్వైతదర్శనమే జ్ఞానం అదే నిజమైనది
సర్వంసర్వేశుడేయన్నజ్ఞాని ఇష్ట భక్తుడు

‘భక్తి’ పలురకములభగవానుని స్తుతింప
“శ్రవణం, కీర్తనం, విష్ణోఃస్మరణం
పాద సేవనం, అర్చనం, వందనం
దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం”
నవ భక్తిమార్గాలు మానవ జన్మ వరాలు
శ్రవణ భక్తి :
గురుబోధ ప్రవచనం నిత్యపారాయణం
హరికధ దైవ నామ సంకీర్తనం కీర్తనల
సత్సంగీతసాహిత్యాలఆలకించి మోదం
జ్ఞానానికి మార్గం దైవ భక్తి కిదే నాంది
శ్రవణ భక్తి పండిత పామరుల కుచితం
పరీక్షిత్ మోక్ష మొందిన ‘శ్రవణ భక్తి’
కీర్తనా భక్తి :
వాల్మీక నారద తుంబుర ప్రహ్లాదులు
ఆళ్వార్లు,ఆండాళ్,63గురునాయనార్లు
త్యాగరాజ రామదాస అన్నమయ్యలు
దైవ మహిమల లీలల వర్ణించి కీర్తించి
రచించి ఆలపించి తరించిన కీర్తనలు
దేవుని స్తుతించి కీర్తింప సాధనాలవి
భగవత్సాక్షాత్కారానికి ‘కీర్తనా భక్తి’
స్మరణ భక్తి :
భగవల్లీలల అంతరంగ రంగ దర్శనం
నామ, రూప, స్వరూప స్మరణ భక్తి
ప్రహ్లాద ధృవ త్యాగరాజ తులసీదాసు
సదాస్మరించి తన్మయులైన ‘స్మరణం’
పాదసేవన భక్తి :
పాదంపవిత్రం శ్రీ చరణం శరణం ప్రపత్తే
బ్రహ్మకడిగిన పాదాలవి పద్మదళాలు
శ్రీపాదాల సేవించి గుహుడు మైమరచే
పాదుకల కొలిచి భరతుడు రాజ్యమేలే
శ్రీమహాలక్ష్మి నిత్య పాదసేవ ప్రతీకయే
ఆ పాద సేవన భక్తి మార్గం ముక్తిబాట
అర్చన భక్తి :
ఫలంతోయం పత్రంపుష్పం అర్ఘ్యమైనా
పంచభక్ష్య పరమాన్నాలతో పనిలేదు
ఒక్కతులసీ దళమర్పణతోసరితూచిన
శ్రీ రుక్మణి దేవి కృష్ణ భక్తి అర్చన భక్తి
భక్తికే, పతి భక్తికే గాక ‘అర్చన భక్తికి’
తులాభార ‘ఎపిసోడ్’ కనులకు విందు
శ్రీకృష్ణుడే ఆడిచూపిన నాటక క్లైమాక్స్
అర్చారూపాన దేవునిపూజఅర్చనభక్తి
వందన భక్తి :
కైమోడ్చి శిరసొంచినమ్రతతో వందనం
జన్మనిచ్చినపరమాత్మకునమస్కారం
ఆయుర్దాయంలో మరో రోజు దైవ కృప
వేకువ నొకమారు సుషుప్తికి పూర్వం
కృష్ణునికికృతజ్ఞతాభివందనం ముఖ్యం
వందనభక్తి విద్య, యాగ ఫలితమిచ్చు
దాస్య భక్తి :
లక్ష్మణ హనుమలు ఆచరించినదీ భక్తి
ఇష్టదేవుని సేవకుడై దాసుడై భజించు
పాపమయ జీవదాస్యశృంఖల విముక్తి
కరుణామయ దేవదాస్యభక్తితో సౌలబ్ధి
రామదాసు తులసీదాసు కబీర్దాసులే!
సఖ్య భక్తి :
భగవానునితో స్నేహం అరుదైనదేగదా
సుగ్రీవుడు శ్రీరాముడు పార్ధశ్రీకృష్ణులు
ప్రాణమిత్రులే,సుగ్రీవపార్ధులదిసఖ్యభక్తి
దేవుడే సఖుడు దేవుడేప్రభువు వారికి
దేవదేవుని ప్రీతిపాత్రులైరి ముక్తివారికి
ఆత్మ నివేదన భక్తి :
భగవంతుడొక్కడే గతి అన్యులు గాదు
శ్రీ కృష్ణ చరణములే శరణమన్న భక్తి
ఆత్మసమర్పణం కర్మఫలార్పణంముక్తి
ఆత్మనివేదన భక్తి లఘు మోక్షమార్గం
ద్రౌపతిశ్రీకృష్ణుల బంధం ఆత్మనివేదన
గజేంద్రునిమోక్షం ఆత్మనివేదన భక్తితో

పతి భక్తి పితృ భక్తి గురు భక్తి రాజభక్తి
ప్రభుభక్తి దేశ భక్తి వృత్తి భక్తి విద్యా భక్తి
ఇత్యాది భక్తి ప్రవృత్తులన్నీసద్క్రియలు

భక్తి మార్గం మోక్షసాధనకు సన్మార్గం
దేహ మోహ ఇహ బాహ్య సుఖ విరక్తి
భక్తిభవసాగర విముక్తి భగవానునిప్రీతి
పాప మోచనయుక్తి జన్మ రహిత ప్రాప్తి
భక్తి శక్తి ఆద్యంతంలేని అనంతమైనది
భక్తి శూన్యతత్వం యోగమార్గం చేర్చు
“దేవుడే జీవుడు - జీవుడే దేవుడు”
అన్ననిజం అది భక్తి మార్గాన గ్రాహ్యం
మన జన్మకదే చరమార్థం పరమార్థం
************************ .









































కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”
మహా ప్రళయం

Part i
ప్రళయం, విలయం, జలమయం
ప్రవహించి ఆవహించిన
ప్రకృతి తాండవం
సృష్టి పుట్టించిన అతి వృష్టి
మిన్ను విరిగి మీద బడిందా !?
ఆకాశం చిల్లు బడిందా !
కుండపోతగా కురిసింది – కుంభవృష్టి
నింగీ నేలల నడుమ యాకాశ గంగ
నిలుపులేనెడతెరపీలేని ప్రవాహం
దివినుండి భువికి జాలువారే జలధార
కనీ వినీ ఎరుగని వర్షపాత కొలమానం

కార్తీక మాస కారు మబ్బులు
ఈశాన్య ఋతు పవనాల కాలం
విజృంభించి వర్షించిన వైపరీత్యం
12-20 అంగుళాల కొలమానం
చెన్నయ్యేనా చిర్రపుంజిలోనా యన్న అనుమానం
చెన్నైలో విచిత్రమే, వంద యేళ్ళ చరిత్ర అనంతరం
నవంబర్ – డిసెంబరు 2015, నవ చరిత్ర సృష్టి
అల్లకల్లోలంజేసిన అతివృష్టి
అయిదు రోజుల ధ్వజం,అంతా ధ్వంశం.

అయిదేళ్ళ అనావృష్టి గత
అయిదు నెలల అగచాట్లు-కరవు
త్రాగు నీటికై వేసవిన బడిన పాట్లు
నగరవాసులనుభవించిన నరక వేదనలు
చెరువులెండిపోయె, చేలు బీటలు వారె
నగర సరఫరా నిలచి పోయె
పంపులూ పైప్పులూ పలుకవాయె
కుండనీటికై క్యూ పెద్దాదాయె
కులసతికొచ్చిన కష్టమాయె
నైరుతి ఋతు పవనాలూ విఫలం
ఈశాన్య ఋతుపవనాలకే ఎదురు చూపులు

వచ్చిందమ్మా నవంబరు తెచ్చిందమ్మా దీపావళి ముసురు
గ్రామ వాసులు, పురవాసులందరికీ ఇచ్చిందమ్మా ఆనందం
ముసురు ముదిరింది , వరుణ వాయువుల కలయిక అదిరింది
వాయు గుండాల వరుసపెట్టి వచ్చేశాయి
వర్షం కురుసింది వలసినంతగా వలదనేంతగా!

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...


కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”

మహా ప్రళయం
PART II




ఎండిన చెరువులన్నీ నిండే , కాల్వలన్నీ పారె
జలాశయాలన్నీ నిండే శరవేగంతో
ఒక్కరోజులోనే ‘మెరుపు’లోనే
నీటిమట్టం లేచే ,అపాయపు రేఖన్దాటే
అర్ధరాత్రి కట్టలు దాటే ,ఎండిన కట్టల దెంచే
పలు ప్రాంతాల భక్షించె
వరదలై పారి వాసుల నివాసాల జొచ్చే
ప్రమత్తులైన వాసుల ప్రవాసుల జేసె
ప్రాణాలు అరచేతుల పారద్రోలే
వీధులన్నీ నదులాయే , నీటికి అడ్డులేదాయే
ఇరుబది యడుగుల నీరు ఇండ్లలో నుండ
ఇంటిడాబాలే తమకు ఆశ్రయమాయే
కట్టుబట్టలతో కన్నబిడ్డలతోనూ నిరాశ్రయులైరి
కష్టార్జితమంతా కళ్లకెదుటే కొట్టుకుపోయే
కన్నీళ్లే మిగిలే , ప్రాణాలెన్నాళ్లని పరితపింపు
ఎవరో రక్షకులకై ఎదురు చూపులు.

లక్షాధికార్లు భిక్షాధికారులైరి
కారులున్నవారు బికారులైనారు
అన్నార్తులయిన యాచకులైరి
ఆకలితో అలమటింపు
చుట్టూ నీరున్నా చుక్క నీరైన లేదు గొంతుకు
ఆహారం లేదు అహోరాత్రాలు నిద్దుర లేదు
అంతా జలమయం , అయోమయం
దిక్కులు తెలియని దిక్కులేని వారైరి
తొలకరి చినుకలకై నింగిని చూసిన ఆ కనులు
అన్నార్తులై చూడాల్సి వచ్చే ఆకలితో
ఎవరికోసమో ఎదురుచూపు
దేవునిపై భారం! అయినవారికి దూరం

అది డిశంబరు ఒకటి రాత్రి మరువదీ ధాత్రి
ఎదురుచూడని ఎన్నడూలేని
ఎడతెరపీలేని జడివాన
వందేళ్ళకు ముందు వచ్చిందటేప్పుడో
నూట ఇరవై సే.మీ ల వాన మళ్ళీ ఇప్పుడే
చంబరంబాక్కం చెరువు నిండింది , చెన్నైనే ముంచింది
అడయారుప్పొంగింది అదుపుదప్పింది
ఉరవడినంతా ఊరిపై జూపింది
వడి వడిగా వరదలై పారింది
బడుగుజీవుల గొడుగు గృహాలు
బలవంతుల భవంతులు
రాజ బాటలు రహదారులు
బజారు వీధులు సందు గొందులు
ఒక్కరాత్రిలో సర్వ వ్యాప్తం
పన్నెండడుగుల వెల్లువ.

అంతటా జలమయం
నేలపై సాగరం
మహా సముద్రమా ! చెన్నై మహా నగరమా?
ఎక్కడి వారక్కడే, ఎవరికి వారే !
ఈదలేము,ఎగురలేము,తప్పించుకోలేము!
పడవలు రావా, పైన ‘చేతక్కు’లు రావా?
ఎదురు చూపులు , బెదురు చూపులే మిగిలే.

ఆకలి దప్పులు తీరవు,అందుబాటులో లేవు
భవనాలన్నీ ద్వీపాలైనవంతటా
దీపాలు లేవు , పాపలకు పాలు లేవు
చుట్టూ నీటిమయం , జీవితం కన్నీటి మయం.

కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”

సమ్మక్క-సారక్క
PART I


సమ్మక్క సారలక్క దివ్య గాధ
కొండ దేవతలు కొండంత అండ
దైవ సంభూత దేవేరి దివ్యమాత
మేడారంలోవెలసిన జన రక్షకమాతలు
ప్రజలనడుమ కలసిన ప్రత్యక్షదేవతలు
నిత్యపూజలందే వనమాత జగన్మాత
ద్వైటేట ఏర్పాటు ఎనలేని జాతరమేళా
మేడారంజాతర మనవూరి కుంభమేళా
భక్త సమూహం సముద్రమై ఉప్పొంగు
గిరిజనులేగాక సుదూర పురజనులు
తండోపదండులై తరలి వచ్చి భజించి
తల్లిదీవనలంది తరించు తరుణం అదే

ఆ సమ్మక్కఎవరు సారక్కలకధ విను
ఏడుశతాబ్దాల కావలకాలం నాటిమాట
అది పొలవాసను ఆటవిక గ్రామ సీమ
కాకతీయ పాలక ఓరుగల్లు వనప్రాంతం
గిరిజన పొలవాసను రాజు మేడరాజు
సుభిక్షదేశం దుర్భిక్షంతో క్షామమొచ్చే
కరువు కాటకాల పాలైరి గూడెమంతా
వనదేవతవారిలోనొకరై ఉద్ధరింపదలచె
మేడరాజు దట్టపుటడవికి వేటకైబోయె
పుట్టపై పుట్టినపసికందు పాపనుజూచె
సింహవ్యాఘ్ర సమూహం పాపను గాచె
తమ గూడెం పాలిట దేవతగ గ్రహించె
సమ్మక్క నామమిడి ముద్దుగ పెంచె
సమ్మక్కపై నమ్మకం ప్రజలకు పెరిగె
కన్నీరే మాడ్చిన కరువు బాపు దేవత
సమ్మక్కచూపు చల్లన మాటమధురం
ఆమె ఆకుమందు సకలరోగ నివారణి
సమ్మక్క హస్తవాసి అమృత సమం
గూడెపు క్షేమమే ధ్యేయమన్న దేవత

జనులందరికీనచ్చిన జవ్వని సమ్మక్క
మేడరాజు మేనల్లుడు మేడారం రాజు
పగిడిద్దరాజుతో పరిణయవైభవమాయె
మేడరాజు భారీమనస్కుడై సాగనంపే
పగిడిద్ద సమ్మక్క దాంపత్యం ఆదర్శం
సారలక్క, నాగులమ్మ, జంపన్నలు
ముచ్చటగ మువ్వురు వారి సంతతి!

మేడారం రాజు కాకతీయ సామంతుడు
అది క్రీ.శ.1083 నుండి1323 నడుమ
ఓరుగల్లు ప్రతాపరుద్రుని పాలకకాలం
మేడారప్రాంతం కరువుక్లిష్టం పాలాయె
కాకతీయులకైన కప్పం కట్టలేని స్థితి
ప్రతాపరుద్రుడు రుద్రుడై ఆగ్రహించె
మేడరాజుకాశ్రయం,కోయల విప్లవం
కారకుడని నేరం మోపి అపనిందలేసె
మంత్రి యుగంధరునితో దండెత్తి వచ్చె
మేడారంపై యుద్ధం ప్రకటన మాయె
కోయప్రజానీకం కొంచెమైనవెనుకాడరు
ఓరుగల్లును ఒక్కుమ్మడిగ ఎదుర్కొనె
విల్లంబులు కత్తి కటారులతో పోరాటం
సారలమ్మ నాగులమ్మ జంపన్నలు
అల్లుడు గోవిందరాజుల సమేతమై
తండ్రి పగిడిద్దరాజు పక్కబలమై పోరె
సారలక్క జంపన్నవీరావేశమమోఘం
తుదకు పగిడిద్దరాజు వీరస్వర్గమాయే
మేనమామ మేడరాజు పోరునమరణం
సారక్కజంపన్న వెన్నుపోటునమడిసె
వీర జంపన్న సంపెంగ వాగున దూకె
తన రక్తలీన వాగు జంపన్నవాగాయె
అల్లుడు గోవిందరాజు అశువులుబాసె
ఆత్మీయుల కోల్పోయి సమ్మక్కపొంగె
స్వయం సమరరంగాన సమ్మక్కవీరం
కాకలుదీరిన కాకతీయుల కత్తికెరజేసె
ఆమెశౌర్యంతో ప్రతాపుడేఅచ్చెరువందే
శత్రువుదగాతో సమ్మక్క గాయపడే!!
రుధిరధారతో రణభూమి విడిచి వెడలె
చిలుకగుట్ట వైపు వెనుదిరుగక నడిచె
మార్గమధ్యంలో మాత అదృశ్యమాయే
మేడారజనులు వెంట వెదుకుచురాగ
సమ్మక్కమాత కానగలేక కలతనొందె
వల్మీకంపై ఒక కుంకుమభరిణ వెలిసె
సమ్మక్కతల్లే కుంకుమభరిణగ తెలిసె
సమ్మక్క సారక్కలు ఊరికి దేవతలు
ఊరికై ప్రాణాలిచ్చిన పావనమూర్తులు
రెండుగద్దెల నెలకొల్పిన ఇలవేల్పులైరి
నాడేగాక నేటికీ కోరినవరమిచ్చు తల్లి
మాఘశుద్ధ పౌర్ణమి జాతర మొదలౌ
అదే మేడారంలో “మేడారం జాతర “
‘సమ్మక్క, సారలమ్మల గద్దెల’ పూజ
ద్వైవార్షిక మహోత్సవమీ మహా జాతరే
సకలజనులు మొక్కులుదీర్చు జాతర

ఫిబ్రవర17-20ల నాల్గు రోజుల జాతర
ఆసియాలోనే అతిపెద్ద గిరిజనోత్సవం
వరంగల్లు నుండి 110 కి.మీదూరము
తాడ్వాయి మండలం మారుమూల
అటవీ ప్రాంతం ఆ మేడారం కుగ్రామం
దట్టమైన అడవిలో కొండకోనల మధ్య
జరుగు చారిత్రాత్మక మేడారం జాతర

PARY II CONTINUED


కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”

సమ్మక్క-సారక్క
PART II


జాతర విశేషాలు:-
పెద్దపులిపై సమ్మక్క జింకపైన సారక్క
భక్తులకైదర్శనం కనులపండగౌ దృశ్యం
మాఘశుద్ధ పౌర్ణమి రోజున జరుపు
ముత్తయిదువల చేతి ఆ పండుగ
కాలక్రమేణ జాతరగ రూపాంతరమందే
గూడెపు సంప్రదాయాల చాటి చెప్పు
ఆదివాసీ ఆచారాల ప్రపంచానికితెల్పు

మొదటి రోజు కన్నెపల్లి ఆలయమాత
సారలమ్మతల్లి భక్తితో గద్దెపై ఆవాహన
రెండవ రోజు పవిత్ర చిలుకల గుట్టపైని
భరిణెరూప సమ్మక్క గద్దె ప్రతిష్ట శ్రేష్టం
రక్షకభటులరక్షణతో మేడారం జాతరకై
కొండాయినుండి గోవిందరాజు విచ్చేసె
పొనుగొండ నుంచి పగిడిద్దరాజు రాక
సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద జేరి
కోళ్ళను ఎగురవేసే ‘ఎదురుకోళ్లు’ జేసి
సమ్మక్కకు సాంప్రదాయక స్వాగతం
పోలీసుతుపాకీకాల్పుల గౌరవ అంజలి
జంపన్నవాగులో పుణ్యజలకాలు జేసి
అమ్మలగద్దె వైపు రోజంతా జనులరాక
దేవతల ప్రతిష్టతో భక్తులలో పూనకం
మూడోరోజు అమ్మవార్లగద్దెల కొలువు.
తుదిగా నాలుగవ రోజున సంధ్య వేళ
ఆవాహన పలికి ఇరు దేవతామూర్తుల
యదాస్థానాలకై భక్తిశ్రద్ధగ తరలింపు
వంశపారంపర్యం గిరిజనులే పూజార్లు
తమ కోర్కెల తీర్చగ భక్తుల నివేదనం
అమ్మకు బంగారం(బెల్లము) నైవేద్యం
నిలువుదోపిడీ తలనీలాలసమర్పణ
తులాభారాలు జరిపి మొక్కులు దీర
ఆడపడుచులుగ నెంచి తల్లులిర్వురికీ
మహిళలు ఒడిబియ్యం పోసి కొలిఛి .
చీరసారెలు పెట్టి పూజలు సల్పుతారు
జంతుబలినిచ్చి మ్రొక్కుల దీర్చుకొను
సర్వమతసామరస్యాన భక్తుల రాకలు
నానారాష్ట్ర సకలజన సమ్మర్ధం కూడు
కోటిభక్తకోటి ఒకేచోటజేరు మహాజాతర
కీకారణ్యం మహానగరమౌనాల్గురోజులు
నాలుగోరోజు దేవుల మరు వనప్రవేశం
మేడారం వనం మరలా నిర్మానుష్యం
రెండేళ్ళకు మళ్ళీ సర్వలాంచన జాతర
2022మేడారంజాతర ఒక కుంభమేళా!


*************************

























కోసూరు సుమంత్ బాబు "సుమకిరణసంయుక్తం" చెప్పారు...

కోసూరు సుమంత్ బాబు
170 /2 (46 ) బిగ్ స్ట్ర్రేట్ ,తిరువల్లిక్కేణి ,
చెన్నై -600 005, తమిళనాడు
ఫోను 09445878668
“సుమకిరణసంయుక్తం”

మహా ప్రళయం
PART III

భూవలయాన్ని ముంచెత్తాలనీ
కడలి గనే కలలన్నీ ఫలించేనా ?!
జలధి పంపిన ‘జలచక్రం’ జయించేనా ?
వాయు గుండాలు వరుసగా సృష్టించి
అల్పపీడనాలనే జలాస్త్రంగా ప్రయోగించి
అతిశయ వృష్టి నిరవధికంగా కురిపించి
అవనినంతా అవలీలగా ఆక్రమించేసిందా!
‘సునామీ’తాకని సుదూర సీమలనే
సునాయాసంగా సుడి గుండాల ముంచింది
జలచరాలన్నీ జనుల నడుమ విహారం
పురవీధులలో క్రొత్త జీవాల ప్రవేశం
భూచరాలెన్నిటికో వచ్చిన జల సమాధి
ఇది కడలికీ పుడమికీ నడుమ నడిచే నిత్య పోరాటం
భూమి గోచరించడం నుండి , కలకాలంగా
పురాణేతిహాస ,చారిత్రక కాలము నుండి
భౌగోళిక సమయ స్థాయి , భారీ యుగాంతాల
బైబిలులో నోవార్కుల బ్రతికించిన కధనం

తాంబరం తల్లడిల్లింది , మణలి మునిగిపోయింది
కోట్టూర్పురమంతా కొట్టుకుపోయింది
వేలచ్చేరి వెల వెల బోయింది
అడయారు అల్ల కల్లోలం
గిండీ గండి బడింది, కె కె నగర్ కేకలు బెట్టింది
టీ నగర్ చిన్నబోయింది , అశోక నగర్ శోక నగరైంది
మాంబలం మహాసముద్రమైంది
సైదాపేట సాగరమైంది
ముడిచూరు ముంచుకు పోయింది
ఊరపాక్కం ఉసూరుమంది
పాలవాక్కం పాలిపోయింది
మీనంబాక్కమూ తప్ప లేదు
చాకలిపేట చాలదెబ్బతింది .

నీరు, నీరు ,నీరు నిలువెత్తు నీరు
నిండింది యూరంతా నిశిరాత్రి వేళ
నిద్రలేపి పంపింది పారిపొండని
దీర్ఘనిద్రకే పంపింది ఎందరినో .
వరద ,వరద, వరద వాడవాడలంతా వరద
వచ్చింది వండ్రుతో,తెచ్చి నింపింది బురద
చెన్నైయ్యే చిన్నబోయింది !!

ఆశ్చర్యం, ఆందోళన ,అశాంతి
భ్రమ,భయం,దిగ్భ్రాంతి
గాలివానలో గమ్యం తెలియని పడవ ప్రయాణం
అగమ్యమై అస్తవ్యస్తమైన జీవనం
కష్టార్జితం కళ్ళముందే కొట్టుకుపోయే
ఇష్టమైన గూడు ఇకపై లేకపోయే
గూడే గుబులై నీడే కరవాయే
తోడేవరొచ్చేది? తోడిచ్చేదేవరికి?
కట్టుకొన్న భార్య,కన్న బిడ్డలు
కన్న వారు , కావలసిన వారు
మమతజూపే మాటలురాని
మార్జాలమా , విశ్వాసపాత్రమౌ పప్పీనా
పాడి పశువులా ,కుక్కుట,కపోత ,శుక ,పికాలా
దస్తావేజులా , ధన కనక వస్తు జాలమా ?
ఆలోచించలేరు , ఆలసించలేరు
తక్షణ నిర్ణయం , తగు సమయ స్ఫూర్తి
అరచేతిలో ప్రాణాలు, విలువైన క్షణాలు
బ్రతికి బయట బడితే బలుసాకు తినచ్చు
విషాద వేళలో వివేకపూరిత చర్యలు
వడిగా పెరిగే వరద ప్రవాహం
ఛాతీ వరకు నీటిమట్టం,తేల్చివేసే నడక
స్వచ్ఛంద సేవకుల, నావికాదళ నావలోనో
విమానదళ కాప్టరులోనో
మొదటి యవకాశం , సదవకాశం
రక్షింపబడడం దైవ సంకల్పం .

సహాయ కేంద్రాలు సంక్షేమ నిలయాలు
సాదరంగా ఆదుకొన్నాయి
సహకార చర్యలు , సకలమూ ఇచ్చాయి
ఎండీయారెఫ్, ఐ ఏ ఎఫ్ , అగ్నిమాపక దళం
వైమానిక ,నావికా,రక్షక దళాలన్నీ వచ్చాయి .
సహృదయత, సహకార దక్షత
సమయస్ఫూర్తి , సమానవత్వం, మానవత్వం
చెన్నైకే సొంతమైన చైతన్యం
ఆపదలో మునిగిన అందరినీ ఆదుకోసాగింది
స్వచ్ఛంద సంస్థలు , సంఘ సేవకులు
నగరంలో యువకులు నడుము బిగించి
కుమ్మరించే వానలో కటిక చీకటిలో
వడి వడిగా లేచే వరద ప్రవాహంలో
ప్రాణాల తెగించి పురవాసుల రక్షింప
జాతి మత బేధాలు ,వర్ణాలు ,వర్గాలు
చిన్నా పెద్ద , పేద – గొప్ప
అంతస్తుల అంతరం అంతమైంది
అందరికీ రక్షణకై , అతి వేగ నిర్వహణ
నీరు చొచ్చని అన్నీ ఇండ్లూ ఆశ్రయాలే
కళాశాలలు, పాఠశాలలు ,సినీ రంగాలు
వాణిజ్య మాళ్ళు ,వర్తక నిలయాలు
కర్మాగారాలు , కార్యాలయాలు
అన్నిటా ఆదరించే ఆర్ద్ర హృదయాలే
అయిదు రోజులనంతరం అంతటా నిశ్శబ్దం
నీరు పారిపోయింది నగరం నీరు గారి పోయింది
అయినా పట్టణవాసుల పట్టుదల ఫలించింది
ఓరిమి , కూరిమి ఓదార్పునిచ్చింది
పునరుధ్ధారణ , పునర్జన్మలా
గతాన్ని మరచింది కాలగమనంతో
వర్తమానంతో రాజీ ,'వర్తకం ఎప్పటిలాగే'
సాగిపోతోంది పట్టణవాసం సాధారణంగా
'ఫీనిక్స్ ' పక్షిలా మరుజన్మలోకి .

చరిత్ర - అయిదేళ్ళకోమారు అరుదెంచే జలప్రళయం!
2004 డిసెంబరు 26 నాటి అతి వృష్టి, ఆ నాటి సునామీ
2005 డిసెంబరు 4 న ‘ఫనూస్’ తుఫాను
2008 నవంబరు 24 నాటి 'నిషా'
2009 నవంబరు 9 వచ్చిన 'ఫ్యాన్' తుఫాను
2010 నవంబరు 6 న 'జల్'
2011 డిసెంబరు 30 నాటి ‘తానే’ తుఫాను
2013 డిశంబరు 8 నాటి 'మాడి'తుఫాను
2015 నప్పటి డిశంబరు మహా జల ప్రళయం
2016 నాటి ‘వర్దా’ తుఫాను
2018 నవంబరు ‘గజా’ పెను తుఫాను
2019 లోనా "కరోనా" దాడి
అన్నీనవంబరు - డిశంబరులోనే అనూహ్యంగా
కర్షకులు ,కృషీవరులు వానకెదురుజూడ
వరదలై ,తుఫానులై విచ్చేసిన ప్రకృతి విధ్వంసం
పండిన పంటలు,పెంచిన తోటలు వినాశం,అయినా
అతి వృష్టి, అతిశయ క్రిమి ఏదైనా ఎదుర్కొంటూ
అతిక్రమించి , అధిగమించి , పరిశ్రమించి
అతీతుడు , అజీతుడు ,అసాధ్యుడవుతాడు!!!
***************


«అన్నిటి కంటే పాతది ‹పాతవి   232లో 201 – 232   కొత్తది» సరి కొత్తది»