6, ఫిబ్రవరి 2024, మంగళవారం

ఏకాదశఉత్పలమాల

 *శ్రీరామచంద్రునకు ఏకాదశఉత్పలమాల పాదరేకులు*


రామునిమీరుమానవులిలన్ కనిపించరుసద్గుణంబునన్

ప్రేమనుపంచువల్లభుడువిశ్వమునందునరాముడొక్కడే

భీమపరాక్రమంబునవిభిన్నమనస్కుడురామచంద్రుడే

కోమలులందరున్ సతముకోరెడునందనుడాతడొక్కడే

నామముచెప్పినంతనెమనంబునగొల్చెడుదేవుడాతడే

భామలమెప్పుపొందెడుస్వభావముగల్గుమగాడురాముడే

నీమముతప్పనట్టియపనిందలకోర్వనిరూపమాతడే

కామములేనిక్షత్రియుడుగంగనుమించుపవిత్రుడాతడే

క్షేమముగూర్చియెల్లరకుకీడునుబాపెడుమూర్తియాతడే

క్షామములేనిరాజ్యమునుస్థాపనచేసినరాజురాముడే

ఆమహనీయమూర్తికథఅద్భుతమైధరనిల్చెసత్యమై

       తపస్వీవిజయవాడ

కామెంట్‌లు లేవు: