30, మార్చి 2023, గురువారం

పరమాచార్య వారి ఆదేశం

 పరమాచార్య వారి ఆదేశం... ఆంజనేయస్వామి వారి ప్రతిష్ట...

బెల్గామ్ కు దగ్గరలో, బ్రిటిష్ వారినీ గడగడ లాడించిన రాణి చెన్నమ్మ పరిపాలించిన కిత్తూరు లో పరమాచార్య వారు మకాం చేసిన రోజులలో జరిగిన సంఘటన..

స్వామి వారు ఒక పెద్ద చెట్టు నీడన కూర్చోని ఉన్నారు.వారికీ దూరంగా చాలా మంది భక్తులు కూర్చోని ఉన్నారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ స్వామి దర్శనానికి వచ్చారు. వారు, సాష్టాంగం చేయటానికి ప్రయత్నించగానే స్వామి "వద్ధని "వారిస్తూ సైగ చేసారు.మఠం మేనేజర్ దగ్గరకు వచ్చి "స్వామి కఠిన ఉపవాసం లో ఉన్నారు. మీరు సాష్టాంగం చేస్తే వారు ఈ స్థితిలో ఆశీర్వదించలేరు. అందుకే వద్దన్నారు "అని చెప్పి స్వామి వారి వద్దకు తీసుకోని వెళ్ళాడు.

స్వామి చీఫ్ విజిలేన్స్ ఆఫీసర్,రాజగోపాల్ తో వారి పేరు, జన్మస్థలం అడిగారు.

"తంజావూరు లోని

అడుతురై "

"అది నీ జన్మ స్థలం ఎలా అవుతుంది."

"నేను చిన్నప్పుడు అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ణి."

"జన్మస్థలం మీ నాన్న గారి స్వస్థలం అవుతుంది కానీ అమ్మమ్మ గారి ఊరు కాదు."

స్వామి వారు అనేక గుర్తులు చెప్పినప్పటికి రాజగోపాల్ స్వస్థలం గుర్తించలేదు.

స్వామి "మీ తాత గారు ఆ ఊళ్ళో ఒక దేవాలయం నిర్మించారు. కానీ అందులో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట చెయ్యలేక పోయినారు. నీవు ఆ ఊరు వెళ్లి ఆలస్యం చెయ్యకుండా ఆగమ శాస్త్ర ప్రకారం విగ్రహ ప్రతిష్ట చెయ్యి."అని ఆదేశించారు.

రాజగోపాల్ వెంటనే తొంభై సంవత్సరాల వాళ్ళ అత్తయ్య ను కలిసి తన స్వస్థలం మన్నార్ గుడికి వెళ్లే దారిలో ఉన్న కుదమరట్టి నదిని ఆనుకొని ఉన్న త్తిళ్ళాంబుర్ తన స్వస్థలం అని తెలిసింది.వెంటనే ఆ ఊరు వెళ్లి చూస్తే స్వామి వారు చెప్పినది సత్యమని తెలిసింది.

గ్రామాధికారి కుమారుడు కృష్ణస్వామి మరి కొందరు కలిసిరాగా ఆగమశాస్త్ర ప్రకారం ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరిపించారు . రెండు దశాబ్దాలుగా ఆ గ్రామం, దేవాలయం అభివృద్ధి కి కృషి చేసి నేడు ఆంజనేయస్వామి వారి ఆలయం సుప్రసిద్దమై పెళ్లికాని అమ్మాయిల తల్లిదండ్రులు ఆరు శనివారాలు పూజ చేసి తమ బిడ్డల పెళ్లిళ్లు జరిగాయని సంతోషం గా తెలిపారు.

***స్వస్థలమే తెలియని రాజగోపాల్ గారికి వారి తాత అంతే రెండు తరాల ముందు జరగవలసిన విగ్రహ ప్రతిష్ట గురించి చెప్పారంటే స్వామి వారి దివ్యత్వం మన ఊహకు

 కూడ అందనిది.

కామెంట్‌లు లేవు: