*ప్రతీఒక్కరూ పరోపకార స్వభావం కలిగివుండాలి*
మనిషి మనసులో ఎప్పుడూ ఉన్నతమైన ఆలోచనలు ఉండాలి. అతనికి, ఇతరులకు హానికలిగించే ఆలోచనలు ఎప్పుడూ రాకూడదు. ఇతరులకు బాధ కలిగించేవాడు చివరికి తనకుతానే ప్రమాదం తెచ్చుకుంటాడు.
రామాయణంలో రావణుడి చర్యలలో ఇది సుస్పష్టంగా కనిపిస్తుంది. శ్రీరామచంద్రుని భార్య సీతామహాసాధ్విని అపహరించి లంకలో బంధించాడు. హనుమంతుడు ఆ లంకకు వెళ్లి సీతను శ్రీరామునికి తిరిగి ఇస్తే బాగుంటుందని రావణునికి చెప్పాడు.
అది వినకుండా రావణుడు తనకు సలహా ఇచ్చిన హనుమంతుని వాలానికి నిప్పంటించాడు. ఆ అగ్ని హనుమంతునికి హాని చేయకుండా రావణుడు నివాస స్థలంగా ఉన్న లంకను దహించింది.
కాబట్టి ఇతరులకు హాని చేయవద్దు. శ్రీ శంకర భగవత్పాదులు తనకు హాని కలిగించిన వారి పట్ల కూడా సహనం ప్రదర్శించారు.ఇది గొప్పవారికి, వారి విజ్ఞతకు సంకేతం.
*భగవాన్ గీతలో*
ఎదుటివారి మనసులో ఎన్నటికీ భయం పుట్టనివ్వని వాడు నాకు ప్రీతిపాత్రుడు.అని చెప్పారు.
అలాంటి వ్యక్తి ఎవరు కావచ్చు? అతను ఇతరులకు హాని కలిగించడానికి ఇష్టపడడు. అటువంటి వ్యక్తి మాత్రమే భగవంతుని యొక్క నిజమైన భక్తుడు కాగలడు.
మహాభారతంలో కూడా యుధిష్ఠిరునికి హాని కలిగించే ప్రయత్నంలో దుర్యోధనుడు తనను తాను నాశనం చేసుకోవడం మనం చూస్తాము.
కావున ప్రతి ఒక్కరు ఈ భాషణలో ఉందహరించిన వాటిని చక్కగా గ్రహించి ఇతరులకు హాని తలపెట్టకుండా పరోపకార స్వభావాన్ని పెంపొందించుకోవాలి.
-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి