🔯
వర్షాకాలం వచ్చేసింది. నైఋతి ఋతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాలను తాకాయి.
🔯 వర్షాకాలం లో సాధారణంగా ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో , TMC మరియు Cu Sec మొదలగు పదాలు, వినిపిస్తూ ఉంటాయి. వాటి గురించి చాలా మందికి తెలియదు.
🔯 ముందుగా క్యూబిక్ ఫీట్ ( ఘనపుటడుగు )అంటే తెలుసుకుందాం. పొడవు, వెడల్పు, లోతు ఒక్కొక్క అడుగు చొప్పున ఉన్న ఒక పాత్రలో ఎంత నీరు పడుతుందో , దాన్ని ఒక క్యూబిక్ ఫీట్ అంటారు.
🔯
1 క్యూబిక్ ఫీట్. = 28.3168 లీటర్లు.
🔯 జలాశయాలలో నిల్వ ఉన్న నీటి పరిమాణం చెప్పటానికి ఉపయోగించే ప్రమాణము టీ.ఎం.సీ. TMC - THOUSAND MILLION CUBIC FEET అని అర్థం.
ఒక టి .ఎం. సి . విలువ 2,832 కోట్ల లీటర్లు ఉంటుంది.
🔯 క్యూసెక్ అనేది నీటి ప్రవాహ వేగాన్ని కొలిచే ప్రమాణం.CU SEC - CUBIC FEET PER SECOND అని అర్థము. బ్యారేజ్ గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేశారు అంటే ఒక సెకను కాలంలో గేట్ల ద్వారా 28.3168 లక్షల లీటర్ల నీరు విడుదలైంది అని అర్థం.
🔯 సాంకేతిక సమాచారం ప్రకారం 1 TMC నీరు, సుమారు 10,000 ఎకరాలు సాగు చేయడానికి సరిపోతుంది.
🔯 విచారించ దగ్గ విషయం ఏమిటంటే - గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్కొక్క సంవత్సరం సుమారు 20 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణానది ద్వారా హంసలదీవి వద్ద బంగాళా ఖాతం లో కలిసిపోవడం .
🔯 ఈ నీటిని మనం నిల్వ చేయగలిగితే కొన్ని సంవత్సరాల పాటు సరియైన వర్షాలు కురవకపోయినా సాగునీటికి, త్రాగునీటికి లోటు లేకుండా మనం జీవించగలం.
🔯 ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాల్లో వేసవి కాలంలో ఏర్పడే నీటి కటకట అందరికీ తెలిసిందే. నీటి సమస్య రాకుండా ఉండాలంటే ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు యేర్పాటు చేసుకోవాలి. నీటి వృధా ను అరికట్టాలి.
🔯 అందరికీ ఈ రెండు పదాల అర్థము వివరించాలని నా ఆలోచన. ధన్యవాదములు.
ఇట్లు
మీ
భోగాది సుబ్రహ్మణ్యేశ్వరరావు,
రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి