10, జూన్ 2024, సోమవారం

అమ్మ అంటే అమృతమూర్తి

 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

🚩నమః శుభోదయం 🚩🚩

విమలానంద బొడ్ల మల్లికార్జున్ 

 

     "‘ఆలు’ అంటే స్త్రీ"

ఇంటావిడ, ఇంటి ఆలు, 

ఇంటికి యజ మానురాలు... 

అనే అర్థాల్లో ఆమెను ఇల్లాలిగా సంబోధిస్తారు. 

భార్య అనే మాటకు అర్థం వేరు. 

భర్త తన ఉద్యోగ వ్యాపారాల రీత్యా గ్రామాంతరాలకు వెళ్ళినప్పుడు భర్త స్థానంలో కుటుంబ బరువు బాధ్యతలను నిర్వహించేది భార్య. 

సత్వగుణంతో శోభించే స్త్రీ సతి. 

అన్ని వేళలా భర్తతో కలిసిమెలిసి అన్యోన్యంగా జీవనం సాగించేది దార! 

ఇలా ఒక్కో కర్తవ్యానికి ఒక్కో పేరు. బాధ్యతకు సరితూగే సంబోధన భావన. ఏ పాత్రకు ఆ పాత్రే విభిన్నం... ప్రత్యేకం. 

ప్రతిదానికీ ఎన్నో పర్యాయపదాలను ప్రతిపాదించే ఆంగ్లభాష భార్యకు ఒక్క వైఫ్‌ అనే పదాన్ని చెప్పి ఊరుకుంది. అర్ధాంగి పదానికి సరిపడేలా ‘బెటర్‌హాఫ్‌’ అనే ముద్దు పేరును వ్యాప్తిలోకి తెచ్చింది. 

భార్యకు ఎన్నో పర్యాయపదాలు వినియోగంలోకి రావడం భారతీయ భాషల పరిపుష్టికి చిహ్నం.

స్త్రీకి అన్నింటికన్నా గొప్ప గౌరవ వాచకం తల్లి. 

అమ్మ అంటే అమృతమూర్తి. 

అన్ని చోట్లా తాను ఉండలేని ప్రత్యేక పరిస్థితుల్లో భగవంతుడే తనకు ప్రతిరూపంగా సృష్టించిన పాత్ర పేరు అమ్మ!

 బ్రహ్మ చేసే పనికి అమ్మ సాయపడుతుంది.సరం ఉంది.

👏🏼👏🏼

కామెంట్‌లు లేవు: