10, జూన్ 2024, సోమవారం

చంద్రుడు

   చంద్రుడు

 చంద్రుడు రొజుకు రెందు ఘడియలు ఆలస్యంగా వస్తాడు.మరియు తన స్థితిలో 1/15 వంతు తక్కువగా కనపడతాడు.  ఒక ఘడియ అంటె 24 నిముషాలు, వెరసి రెండు ఘడియలు అంటె 48 నిముషాలు. ఆ లెక్కన పక్షానికి  15 X 48:= 720 ఇప్పుడు దీనిని గంటలలోకి మారుద్దాము అంటే 720/60= 12 అంటే12 గంటల ఆలస్యం అవుతుంది. 

ఇప్పుడు మనం అమావాస్య నుండి లెక్కిద్దాము. మనకు తెలుసు అమావాస్య నాడు చంద్రుడు రాత్రిపూట కనపడడు అంటే దాని అర్ధం చంద్రుడు పూర్తిగా పగటి పుట మాత్రమే ఉంటాడు.అంటే ఉదయం 6 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాడు.  చంద్రుని పరిమాణం 0 అనుకుందాము. సాధారణంగా అమావాస్య మరుసటి రోజు అంటే సాయంత్రం 6 గంటలకు 48 నిముషాలు కలిపితే 6-48 నిముషాలు వరకు చంద్రుడు ఉంటాడు చంద్రుని పరిమాణం size 1/5 వ వంతు ఉంటుంది ఆ లెక్కన ప్రతి రోజు 48 నిముషాలు సమయం కలుపుకొని 1/15 వ సైజును పెంచుకుంటూ పోతాడు. అంటే సప్తమి నాడు యెట్లా ఉంటాడో చూద్దాము 

సమయం 7 X 48అంటే  336 నిముషాలు దీనిని గంటలలోకి మారుస్తే 336/60= 3.36 అంటే రాత్రి 9 గంటల 36 నిముషాలకు చేంద్రోదయం అవుతుంది. size  1/15 X 7 = .47 అంటే దాదాపు సగము పరిమాణంలో ఉంటాడు. రెండు పక్షాలలో అంటే కృష్ణ పక్షం శుక్ల పక్షంలో కూడా చంద్రుడు దాదాపు సంగం సైజులో వుంది రాత్రిపూట సగం పగటిపూట సగంగా కనపడతాడు. చిత్రంగా లేదా. 

ఇక పౌర్ణమి నాటి లెక్క చూద్దాము ముందుగా సమయం అమావాస్యనుంచి పౌర్ణమి  15 వ రోజు వస్తుంది ఇప్పుడు లెక్క చూద్దాము 

15 X 48 = 720 నిముషాలు గంటలలోకి మారుస్తే 720/60 = 12 అంటే ఉదయం 6 గంటలకు అమావాస్యనాటికి 12 గంటలు కలిపితే సాయంత్రం 6 గంటలు వస్తుంది ఇక సైజు విషయానికి వస్తే 1/15 X  15 = 15 అంటే పూర్తీ బింబం అన్నమాట. కాబట్టి పౌర్ణమి నాడు సాయంత్రం 6 గంటలనుండి ఉదయం 6 గంటలవరకు చంద్రుడు ఆకాశంలో కనపడతాడు అది కూడా పూర్తీ బింబముగా. 

ఒక్క విషయం. చెంద్రుడు మనకు ఒక వైపు మాత్రమే కనపడతాడు. చెంద్రుని రెండవ వైపు మనకు కనపడదు. చంద్రుని మీద వున్న కొండలు గుట్టలు మనకు మచ్చలుగా కనపడతాయి. చంద్రుడు ఒక గ్రహం కాబట్టి స్వయం ప్రకాశం ఉండదు. సూర్యుయిని కాంతి చంద్రుని మీద పడి  reflex కావటంతో కనపడే బింబము. మనం చంద్రుని మీదకు వెళ్లి చుస్తే భూమి చంద్రుని మీద మనకు ఇక్కడ చంద్రుడు కనపడ్డట్లే కనపడుతుంది. 

శుభం 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ










కామెంట్‌లు లేవు: