28, జులై 2024, ఆదివారం

మానవ స్వభావం*

 *మానవ స్వభావం*


సభ్యులకు నమస్కారములు.


మనం పుడితే *తల్లి* సంతోషపడాలి, మనం పెరిగితే *తండ్రి* ఆనందపడాలి , మనం బ్రతికితే ఈ *సమాజం* సంబరపడాలి, మనం *చస్తే* స్మశానం కూడా *కన్నీరు* పెట్టాలి . అదే మన *జీవితం* కావాలి.


మనము  *అందంతో* పుట్టడం మన చేతుల్లో ఉండదు కాని, మంచి *మనసును* కలిగివుండడం అనేది మన చేతుల్లోనే ఉంది . మనము  *సంపన్నుల ఇళ్లలో* పుట్టడం మన చేతుల్లో ఉండదు కానీ మంచి *సంస్కారంతో* బతకడం అనేది మన చేతుల్లోనే ఉంది .


ఈ సమాజంలో ఒకరి *సమస్య* ఇంకొకరికి *నవ్వులాట* లా ఉంటుంది ఒకరి *జీవితం* ఇంకొకరికి *చులకన* గా ఉంటుంది , ఒకరి *ఆనందం* ఇంకొకరికి *అసూయగా* ఉంటుంది . ఒకరి *బాధ* ఇంకొకరికి *బరువుగా* ఉంటుంది . ఒకరి *పరువు* ఇంకొకరికి *ఎగతాళిగా*  ఉంటుంది . ఒకరి *ఆపద* ఇంకొకరికి *అవకాశంగా* ఉంటుంది . ఒకరి *బలహీనత* ఇంకొకరికి *బలంలా* ఉంటుంది .


 శాసనాలు చేసేటోళ్లే *నీతి* తప్పి డబ్బులు పంచుతుంటే,  *పట్టాలు* పొందిన పట్టభద్రులు *పైసలకు అమ్ముడు* పోతుంటే ప్రజాస్వామ్య మనుగడ *ప్రశ్నార్థకం* అవుతుంది మరియు *నీతికి* చెదలు పట్టినట్లే గదా.


క్యాలెండర్లో *పేజీలు* చిరుగుతూ ఉంటాయి, *కాలం*   గూడా గడిచిపోతూ ఉంటుంది. కాలంలో *వెనకకు* తిరిగి చూస్తే  *మనం* చేసిన మంచి *పనులు* ఏవైనా కానవస్తున్నాయా,  ఒకసారి *సరి చూసుకుందాము*.లేకపోతే *సరిచేసుకుందాము* 


.మనిషి కాలం వెంట *పరిగెడుతున్నా*, ఎప్పుడో  ఒకప్పుడు   *అగక*  తప్పదు అది *ఎప్పుడో* ఎవరికీ తెలియదు ముందుగా.


 *ఆలోగా సమాజానికి కొంత మేలు చేద్దాము* ఏ క్షణము నుండి మనము ఎదుటి వారిని సుఖము, సంతోషముగా ఉంచుతామో అప్పటి నుండి మనము ఆనందంగా ఉంటాము. *మానవ సేవయే మాధవ సేవ*.


ధన్యవాదములు.

*(సేకరణ)*

కామెంట్‌లు లేవు: