దశరథాత్మజ శతకము (21)
సీ. భండన భీముండు పరమాత్మ రాముండు
కరుణాంత రంగుండు కడలిసముడు
భరతాగ్రజా ! నిన్ను భజియించు వారికి
భయమేల కల్గును భక్త వరద !
సంతాపముల మాన్పి సంతసమ్ముల నిచ్చు
సాకేతపురవాస ! సత్త్వ తేజ !
నిరతమ్ము నినుమది నీమమ్ముతో నెంచ
భవబంధ మోహముల్ బాసి పోవు
తే.శరణు వేడిన వారిని కరుణ తోడ
కూర్మి రక్షించి కాపాడు కోసలేంద్ర !
భక్తి నర్పింతు నతులను ముక్తి గోరి
ధశరథాత్మజ ! శ్రీరామ ! ధర్మపురుష !
జయలక్ష్మి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి