*పద్మసంభవు ధర్మపత్ని యపర్ణ యందురు పండితుల్*
ఈ సమస్యకు నాపూరణ.
*వితండవాది*
పద్మసంభవు ధర్మపత్ని యపర్ణ యందురు పండితుల్
*సంస్కార వంతుడు*
ఛద్మమేల వితండవాదివి చాలు వంకర మాటలున్
సద్మమౌ కమలాక్షి వాణికి సారసంబని వింటిమే
పద్మసంభవు ధర్మపత్నియె పల్కులమ్మనెరుంగవా!
(ఛద్మము =మోసము
సద్మము =ఇల్లు, నీళ్ళు)
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి