డబ్బుకన్నా..తల్లిదండ్రులు మిన్న...
సీ..
జన్మకారకులౌచు జగతిలో ప్రేమించు
త్యాగాత్త వర్తనుల్ తల్లిదండ్రు
లవ్వారి పూజ్యతనరయంగ ధర్మమౌ
నదియెపో రక్షించు ననవరతము
పుట్టలోనిచెదలు పుట్టుచు చచ్చుచున్
పుడమినిల్చినయట్టి పోలికగుచు
తల్లిదండ్రుల మీద దయలేని బిడ్డలు
నున్నను పోయిన నుర్వికేమి?
తేగీ..
నేటి బిడ్డలు నుద్యోగనెపముతోడ
తల్లిదండ్రుల బాగోగులెల్ల గనక
వృధ్ధ శరణాలయముల చేర్పించి చేయి
దులుప క్షేమము తనకౌనె!దుఃఖకరము.
తల్లిదండ్రులదినోత్సవం సందర్భంగా...
రాయప్రోలు జగదీశచంద్రశర్మ తెనాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి