నిత్యపద్య నైవేద్యం-1562 వ రోజు
సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-197. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి
ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు
సుభాషితం:
అఘం స కేవలం భుక్తే
య: పచత్యాత్మ కారణాత్l
యజ్ఞ శిష్టాశనం హ్యేతత్
సతామన్నం విధీయతేll
తేటగీతి:
ఎవడు కేవల తనకోస మింట వంట
చేసుకొని భోజనమ్మును చేయుచుండొ
తనదు పాపమునే తాను తినుటయగును
సత్పురుషుల కన్నమిడుట సత్ఫలంబు.
భావం: ఎవరు కేవలం తనకోసం వంట చేసుకొని భోజనం చేస్తాడో.. వాడు తన పాపాన్నే తిన్నట్లు సుమా! సత్పురుషులకు అన్నం వడ్డించిన పిదప భోజనం చేస్తే యజ్ఞశేషాన్ని తినటంతో సమానం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి