15, మార్చి 2023, బుధవారం

సీతా జయంతి

  సీతా జయంతి!*


ఫల్గుణ మాసంలో కృష్ణ పక్ష అష్టమి నాడు జానకీ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజును సీతాదేవి జనక మహారాజుకు పొలంలో దొరికిన రోజుగా చెప్పుకుంటారు. సీత త్యాగానికి, అంకిత భావానికి ప్రతీక. ఈ రోజున సీతారాములను పూజించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగి పోతాయని నమ్మకం. ఈ రోజున శ్రీరాముడితో పాటు సీతా మాతను కూడా పూజిస్తే లక్ష్మీ నారాయణుల కటాక్షం దొరుకుతుందట. 


ఈ పండుగను ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. దక్షిణ భారత దేశంలో మహారాష్ట్ర, తమిళనాడులో కూడా దీనికి ప్రాముఖ్యత ఉంది. సీత భూదేవి పుత్రిక కనుక భూమి అనే పేరుతో కూడా సీతను పిలుస్తారు. జీవితం ముందుకు సాగడానికి, ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగేందుకు సీతా జయంతిని జరుపుకుంటారు. సీతా జయంతిని భక్తిగా జరుపుకునే వారికి ఆనందదాయకమైన దాంపత్య జీవితం లభిస్తుందని నమ్మకం. అంతేకాదు వివాహానికి అడ్డంకులు ఎదురవుతున్న వారు కూడా సీతాజయంతి రోజున సీతారాములను ఆరాధించి, ఉపవాసం చేస్తే తప్పకుండా అడ్డంకులన్నీ తొలగిపోయి వివాహం జరుగుతుందని చెబుతారు.

కామెంట్‌లు లేవు: