15, మార్చి 2023, బుధవారం

జలుబు హరించుటకు

 జలుబు హరించుటకు సులభ ఆయుర్వేద యోగాలు - 


 *  అల్లం , మిరియాలు , తులసి దళాలు సమభాగములుగా తీసుకుని దంచి కషాయం కాచి పూటకు గిద్దెడు (టీ గ్లాసు ) మోతాదులో తీసికొనవలెను . 


 *  పండు జిల్లేడు ఆకు రసం మరియు నువ్వుల నూనె కలిపి శరీరముకు మర్దన చేయుచున్న జలుబు హరించును . 


 *  10 గ్రాముల శొంఠి చూర్ణమును 50 గ్రాముల వేడి నీటిలో కలిపి నిద్రపోయే ముందు పుచ్చుకొనుచుండిన యెడల జలుబు హరించును . 


 *  నల్ల జీలకర్ర చూర్ణమును గుడ్డలో మూటకట్టి వాసన చూచుచుండిన జలుబు త్వరగా తగ్గును . 


 *  వేడి వేడి మినప గుగ్గిళ్లను ఉప్పు కలిపి భోజనము చేసిన పిమ్మట తినుచుండిన యెడల రెండు మూడు రోజుల్లో జలుబు తగ్గిపోవును . 


   పైన వివరించిన ఆయుర్వేద చిట్కాలలో మీకు అనువుగా ఉన్న ఒకదానిని ఎంచుకొని పాటించి సమస్య నుంచి బయటపడగలరు . 


      జలుబు , పడిసం వంటి సమస్యలతో ఇబ్బంది పడున్నప్పుడు చల్లటి పదార్దాలు , పచ్చళ్లు , పాలు మరియు పాల సంబంధ ఉత్పత్తులు , ఫ్రిజ్ నీరు , కూల్డ్రింక్స్ వంటివి సేవించరాదు . 


         

కామెంట్‌లు లేవు: