1, ఆగస్టు 2021, ఆదివారం

రోమ్ రోమ్ మే రామ్ నామ్ హై"

 "రోమ్ రోమ్ మే రామ్ నామ్ హై"


"రామ్నమీ" అంటే " రామ్ నామీ" సమాజ్ అని హిందూ మతం లో ఒక తెగ ఉంది. వీరు ఆరాధించే దేవుడు రాముడు.


చరిత్ర ప్రకారం 1870 లలో ప్రస్తుత చత్తీస్గహార్ రాష్ట్రంలో గల చార్పోరా గ్రామంలో చమర్ కులంలో జన్మించిన 'పరశురామ్' అనే వ్యక్తి 1890ల కాలంలో తనను దేవాలయంలోకి ప్రవేశించనివ్వలేదు అనే దానికి నిరసనగా తన నుదిటిపై "రామ్" అని పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అతనే మొట్టమొదటి గా రామ నామాన్ని ఇలా పచ్చబొట్టు పొడిపించుకున్న వ్యక్తిగా చెప్పబడుతున్నాడు.. అతను స్థాపించిన తెగే ఈ "రామ్నమీ" లు. అందుకే ఈ తెగలో ఎక్కువగా చమర్ కులస్తులు వుంటారు. కానీ కొంత కాలానికి ఈ ఉద్యమంలో

బ్రాహ్మణ, బానిక్, కుర్మి మొదలైనవారు అందరూ కూడా చేరారు. ఈ తెగ 15 వ శతాబ్దపు భక్తి ఉద్యమం యొక్క కొనసాగింపుగా మరియు ఈ ప్రాంతం యొక్క సత్నాంపంత్ యొక్క శాఖగా చెప్పబడుతోంది. వీరు ప్రధానంగా ఛత్తీస్‌గర్ లో నివసిస్తున్నారు.  


ఈ తెగను అనుసరించే వారు మద్యం తాగడం కానీ పొగ త్రాగటం గానీ చేయరు. ' రామ్' పేరు జపించడం వీరి దినచర్యలో ఒక భాగం. ఇలా పూర్తి శరీరం పై పచ్చబొట్లు ఉన్నవారిని "పూర్ణనాక్షిక్ " అని పిలుస్తారు. వీరు ఇప్పుడు ఎక్కువగా వారి డెబ్బైలలో ఉన్నారు. 

వివక్షకు గురి అవుతావేమో అన్న భయంతో యువతరం ఇలా పచ్చబొట్లు వేయించుకుందుకు సందేహిస్తున్నారు.


రాయ్‌పూర్ జిల్లాలోని సర్సివా గ్రామంలో డిసెంబర్-జనవరిలో పంట కాలం ముగిసే సమయానికి మూడు రోజుల భజన్ మేళా కోసం "రామ్ నామీ"లు ప్రతి సంవత్సరం సమావేశమవుతారు. అక్కడ వారు "జయోస్థంబ్‌" అంటే విజయ స్థూపం ను ఏర్పాటు చేస్తారు. అంటే ఒక తెల్లటి స్తంభం పై రామ్ నామం చెక్కబడి ఉంటుంది. ఈ ఉత్సవాల మూడు రోజులూ రామ్‌చరిత మానస్ నుండి పాటలు, భజనలు గానం చేస్తారు.


ఈ ఉత్సవాలకు సుమారు 20 వేల మంది వరకు వస్తారు అని అంచనా. అందుకే వీరి జనాభా 20 వేలు ఉంటుంది అని కొందరు చెప్తే, కాదు ఒక లక్ష వరకు ఉంటాం అని ఈ తెగ పెద్దలు చెప్తారు.


ఇటువంటి వారిని చూస్తే అందుకే అనిపిస్తుంది ఇంత విలక్షణమైన, వైవిధ్యం గల సంస్కృతి ప్రపంచంలో మరో దేశంలో కనిపించదు.  


కానీ దురదృష్టం ఏమిటంటే ఇలా మారు మూల అడవుల్లో పల్లెల్లో ఉంటూ తర తరాలుగా తమ వంశాచారాలను పాటిస్తూ, కాపాడుకుంటున్న ఇటువంటి వారిని టార్గెట్ చేస్తూ ఒకే విధమైన సంప్రదాయాన్ని నెత్తిన రుద్దే అబ్రాహామిక్ మతాలు మత మార్పిడి ద్వారా ఈ వైవిధ్యాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా దురదృష్టం ఏమిటంటే ఉదారవాదం, నాస్తికత్వం, కమ్యూనిజం పేరుతో దేశంలో మేధావులుగా చెలామణీ అయ్యేవారు పరోక్షంగా ఇటువంటి మత మార్పిడి శక్తులకు ప్రోత్సాహం ఇస్తూ ఈ వైవిధ్యం నాశనానికి తమ వంతు కృషి చేస్తున్నారు.


విచిత్రం ఏమిటంటే ఎన్నో వేల సం.ల నుండి ఈ దేశంలో ప్రతీ మూలా వివిధ పద్ధతుల్లో పూజింపబడుతున్న రాముడిని ఇప్పుడు ఎదో కొత్తగా దేశం నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు అని విమర్శిస్తారు. కానీ రామ్ శబ్దం

ఈ భూమి మీద ప్రతీ రేణువులో, శ్వాసలో ఉంది.

కామెంట్‌లు లేవు: