*అబ్దుల్ కలామ్ - భారతావని ఆణిముత్యం*
~ తుమ్మ జనార్ధన్ (జాన్)
భారత వైజ్ఞానిక ప్రగతికి బాటలువేసిన బాటసారి
చిర కీర్తి గడించిన మిస్సైల్ మాన్
యువతను ఉత్తేజ పరచడమే ఉద్యమంగా ఎంచుకున్న ఇగ్నైటెడ్ మైండ్
భారతావనిలో పుట్టి, విశ్వానికెదిగిన వ్యక్తిత్వం
దేశానికి ముద్దుబిడ్డ భరతమాత మెడలో భారత రత్నం.
మతం, రాజకీయం ఏమీ అంటని ఆధ్యాత్మికవేత్త
ఏమీ తేలేదని, ఏమీ తీసుకెల్లలేనని తెలిసిన తాత్వికుడు
ఆస్థి దాచని ఘనుడు, అభిమాన ధనుడు, సుజనుడు
భారతీయత నిండిన దేశప్రేమికుడు, దేశాభివృద్ధి కాముకుడు
రాష్త్రపతి పదవికే వన్నెతెచ్చిన విశ్వవిఖ్యాతుడు
ఉపన్యాసమే ఆయుధంగా కదిలిన యోధుడు
మరపురాని సంస్కారం, అలుపులేని ఆదర్శం
అందరికీ వారి తలపే స్ఫూర్తి మంత్రం
కనులు తెరచి కలలు కను-సాకారం చేసుకో, అన్న స్వాప్నికుడు
స్వయం కృషితో సాధించలేనిది లేదని నిరూపించిన కృషీవలుడు
ఊహించని అందలాలు దక్కినా చలించని వైరాగి
వారు అంచనాలకందని మహా యోగి
చివరి క్షణం వరకూ తన లక్ష్యంతో గడిపిన సాత్వికుడు
ఆశించిన విధంగానే మృత్యువును శాసించిన ఈశ్వరుడు
మీరు మాకు ఎప్పుడూ ఆదర్శం, మరువలేము మీ జీవిత సందేశం
ఇవే మీకు మా కవితా నివాళులు – కలాం సర్ మీకు మా సలాం.
🙏🙏🙏💐🌹💐🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి