శ్రీ గాయత్య్రైనమః
1992 సంవత్సరంలో కొందరు దక్షిణ తమిళనాడుకు చెందిన బ్రాహ్మణ వేదపండితులు శ్రీ కంచి పరమాచార్యులను దర్శించుకుని, *జగద్గురువులతో:*
'దక్షిణ తమిళనాట, కేరళా ప్రాంతాల్లో మతమార్పిడులు ఉద్రుతంగా ఉన్నాయి, సనాతన ధర్మం నశించిపోయే ప్రమాదం ఉంది. కావున, మీరే దీనిని అడ్డుకునేందుకు ఏదైనా ఒక ఉద్యమ రూపకల్పన చేసి, మమ్ములను నడిపించవలసినదని' విన్నవించుకున్నారు.
శ్రీచరణులు కొద్ది సేపు కళ్ళు మూసుకుని మౌనం వహించారు.
ఆ తర్వాత నెమ్మదిగా:
"ఆదిశంకరులు పీఠాధిపతులను ఉద్యమాలు నడిపించమని నియమించలేదు. కేవలం సనాతన ధర్మ వ్యాప్తి మాత్రమే మాకు అప్పచెప్పారు.
మీ ధర్మం మీరు వదలకుండా నిర్వర్తించండి. వీటన్నింటికీ కారణం బ్రాహ్మణ ధర్మం లుప్తమవుతోంది క్రమేపీ. నిత్య సంధ్యోపాసకులు తగ్గుతున్నారు.
*మీ ప్రాంతంలో కనీసం వందమంది నిత్యం సహస్ర గాయత్రి చేసేవారుండే విధంగా మీరు కృషి చేయండి.* ఎవరూ ఏమీ చేయలేరు.
ఈవిషయం కూడా నేను చెప్పడం లేదు, నా గురువులు నాకు స్పురింపచేసారు.
*నిత్య గాయత్రి జరిగే ప్రాంతాల్లో ఎటువంటి ఉపద్రవాలు కూడా రావని శాస్త్ర వచనం.*
కావున, ఎటువంటి ఇతరత్రా ఉద్యమాల జోలికి పోకుండా, *ప్రతి ఇంటా నిత్యసంధ్యోపాసన, ఎక్కువగా గాయత్రి అనుష్టానం జరిగే విధంగా కృషి చేయండి.* అంతా చక్కబడుతుంది."
అని ఉపదేశించి వారిని పంపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి