15, అక్టోబర్ 2022, శనివారం

మనస్సున నాటిన మాటలు

 శ్లోకం:☝️

*రోహతే సాయకైర్విద్ధం*

  *వనం పరశునా హతం l*

*వాచా దురుక్తం భీభత్సం*

  *న సంరోహతి వాక్ క్షతం ll*

  - విదురనీతి, ఉద్యోగపర్వం

బాణగాయమ్ము కాలాన మాని పోవు 

పరశుఖండిత వృక్షమ్ము పెరుగు మరల

మదిని తాకిన దూషిత మాట లెల్ల

మరల కెప్పుడు నిరతమ్ము మదన పరచు


గోపాలుని మధుసూదనరావు

భావం: బాణం వల్ల కలిగిన గాయం కాలాంతరంలో మానుతుంది. గొడ్డలివేటుకు గురియైన చెట్టు కూడా కొంత కాలానికి చిగురించవచ్చు. కానీ మనస్సున నాటిన మాటలు వెలికి తీయలేము కదా!

కామెంట్‌లు లేవు: