శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
ఈ మహాకాయుణ్ణి చూసి దేవతలే గడగడలాడిపోయారు. ఇంద్రుడూ వణికిపోయాడు.
యుద్ధవాంఛను విరమించుకున్నాడు. ఆ రాక్షసుడు గాలిలో ఆగిపోయిన వజ్రాయుధాన్ని పెదవులమధ్య
మతారంగా బంధించి నిలబడ్డాడు. ఉన్నట్టుండి ఇంద్రా! నిన్ను భక్షిస్తానంటూ వెంటబడ్డాడు. దేవతలు
హాహాకారాలు చేశారు. ఎటువారు అటు పారిపోయారు. ఇంద్రుడు కాళ్ళూ చేతులూ స్తంభించి ఎటూ
కదలలేక బిక్కచచ్చి నిలబడ్డాడు. మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. బృహస్పతిని తలుచుకున్నాడు.
మహామేధావి దేవగురుడు ప్రత్యక్షమయ్యాడు.
శచీపతీ! ఈ మహాకాయుడు అసాధ్యుడు. మంత్రాలకూ తంత్రాలకూ లొంగడు. నీ
వజ్రాయుధంకూడా వృధా. వీడు చ్యవనుడి తపోబలంతో యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించిన మదుడు.
అనివార్యుడు. ఒక్కటే మార్గం. చ్యవన మహర్షిని శరణువేడుకో. ఆ మహాత్ముడే కరుణించాలి. మరో
దారిలేదు.
బృహస్పతి ఖండితంగా చెప్పాడు. ఇంద్రుడికి బుద్ధి వచ్చింది. మనస్సులోనే చ్యవనుడికి
మొక్కుకుంటూ వచ్చి కాళ్ళమీద పడ్డాడు. క్షమించు మహామునీ! ఈ మహారాక్షసుణ్ణి ఉపసంహరించు.
సర్వజ్జా ! ప్రపన్నుడివై రక్షించు. ఇకమీదట నీ మాట జవదాటను. ఈ క్షణంనుంచీ అశ్వినులు ముమ్మాటికీ
సోమార్హులే. నాకు ఏ అభ్యంతరమూ లేదు. ఇది నిజం. నువ్వు వారికిచ్చిన మాటను నెరవేర్చడం నావిధి.
పొరపాటున అహంకరించాను. నీ తపశ్శక్తిని పరీక్షించడానికి శర్యాతి యజ్ఞకీర్తిని దశదిశలకూ చాటి
చెప్పడానికి ఇలా చేశానంటే నమ్ము నన్ను విశ్వసించు.
మయా యద్ధి కృతం కర్మ సర్వథా తు మునిసత్తమ ।
పరీక్షార్థం తు విజ్ఞేయం తవ వీర్యప్రకాశవమ్
(7-35)
ప్రసన్నచిత్తంతో అనుగ్రహించు. సకలదేవతలనూ ఆహ్లాదపరచు. ఈ మహాముడు
ఉపసంహరించు - అంటూ బతిమాలుకున్నాడు. పరమార్ధవేత్త చ్యవనుడు కోపాగ్ని దిగమింగుకున్నారు.
ఇంద్రుణ్ణి లేవనెత్తి సమాశ్వసించాడు. మదుణ్ణి ఖండఖండాలుగా విభజించి స్త్రీలలో, మద్యాలలో
జూదాలలో, మృగయా వినోదాలలో జీర్ణింపజేశాడు. సకల దేవతలకూ ధైర్యం చెప్పి శర్యాతి యజ్ఞాన్ని
దిగ్విజయంగా సుసంపన్నం చేశాడు. యజ్ఞ సంస్కృతమైన సోమరసాన్ని ఇంద్రుడికీ, అతడి సమక్షంలోనే
అశ్వినులకీ, సకల దేవతలకీ తృప్తిగా పంచిపెట్టాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి