24, అక్టోబర్ 2023, మంగళవారం

_బోర్డర్లు దాటే బోర్డులు..

 *_బోర్డర్లు దాటే బోర్డులు..!_*

_______________________


*చెప్పులు కుట్టే దుకాణం..*


_చర్మం ఒలిచైనా_ 

_మీ సేవ చేస్తాం.._!

_______________________


*కంటి వైద్యుడు..*


_మీకు ఏం కావాలో_  

_అదే ఇక్కడ లభిస్తుంది.._

_కానీ మా బోర్డే మీకు_ _కనిపించడం లేదంటే మీరు ఖచ్చితమైన చోటికి వచ్చినట్టే..!_

_______________________


*ప్లంబర్..*


_ఇంట్లో మీ ఆయన సరిగా_ _ఫిక్స్ చేయలేక పాడుచేసినవి_

_మేము కరెక్టుగా అమర్చి పెడతాం..!_

_______________________


*రెస్టారెంట్..*


_బయట నుంచుని ఆకలితో అలమటించడం దేనికి.._

_లోపలికి వచ్చి కడుపు నిండా తినండి..బిల్లు మాత్రం కట్టి వెళ్ళండి..!_

_______________________


*స్మశానవాటిక..*


_లాంగ్ రైడుకు వెళ్తున్నారా.._

_మీ కోసం మేమిక్కడ ఎదురు చూస్తున్నాం..!_

_______________________


*మునిసిపల్ చెత్త సేకరణ వ్యాన్*


_ఇంత కంపు ఏంటాని అనుకుంటున్నారా.._

_దీని నిండా రాజకీయ నాయకుల తిట్లు ఉన్నాయి..!_

_______________________


*_సురేష్...9948546286_*

కామెంట్‌లు లేవు: