🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 73*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*కోర్కెలను దగ్ధం చేద్దాం'*
భక్తుల సంఖ్య పెరిగేకొద్దీ శ్రీరామకృష్ణుల కార్యకలాపాలు ఒక నిజాన్ని సూచించాయి. - ఆయన ఇక ఎక్కువ రోజులు జీవించబోరనే నిజమే అది. 1886 ప్రారంభంలో ఒక రోజు రాత్రి నరేంద్రుడు ఈ విషయాన్నే తక్కిన యువకులతో చర్చించి పడుకోవడానికి వెళ్లాడు. కాని ఎంతకీ నిద్రపట్టలేదు. తన మాదిరే నిద్రపట్టక పెద్దగోపాల్, శరత్, కాళీ ప్రభృతులు మేల్కొని ఉండడం చూసి, వారిని వెంటబెట్టుకొని తోటలో పచార్లు చేయసాగాడు. నడుస్తూ ఇలా అన్నాడు.
"గురుదేవుల వ్యాధి తీవ్రరూపం దాలుస్తూన్నది. శరీరాన్ని ఆయన త్యజించగోరుతున్నట్లు నాకు అనిపిస్తున్నది. ఆయనకు సేవ చేస్తూ, ప్రార్థన ధ్యానాదులు అనుష్ఠించి ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి చేతనైనంత ఇప్పుడే ప్రయత్నించండి. ఆయన నిష్క్రమించిన తరువాత వాపోయి లాభం లేదు. కర్తవ్యాలన్నీ పూర్తిచేసిన తరువాత భగవంతుణ్ణి ఆశ్రయించవచ్చునని తలచడం మూర్ఖత్వం. మనం కోర్కెలను కూకటివేళ్లతో సహా పెకలించివేయాలి.”
నరేంద్రుడు ఉద్వేగపు వెల్లువలో మునిగిపోయి చెట్టు క్రింద ప్రశాంతంగా కూర్చుండిపోయాడు. ప్రక్కనే ఉన్న కొన్ని ఎండుపుల్లలను చూసి అతడు, "మన కోర్కెలను దగ్ధం చేయడానికి - అగ్ని రగుల్బుదాం" అన్నాడు. అంతా కలిసి ఎండు పుల్లలను సమీకరించి అగ్ని రగిలించారు. ఆ రాత్రి చీకటిలో అందరూ ప్రజ్వరిల్లుతున్న ఆ మంట చుట్టూ కూర్చున్నారు. తమ కోర్కెలను దగ్ధం చేస్తున్నట్లుగా భావించి ప్రతి ఒక్కరూ ఒక ఎండుపుల్లను ఆ అగ్నికి ఆహుతినిచ్చారు. పిదప ప్రశాంతంగా ధ్యానమగ్ను లయ్యారు. ఆనాటి రాత్రి వారికి ఒక మహోన్నత రాత్రిగా భాసిల్లింది.
"శ్రీరామకృష్ణుల అంతిమ రోజులివి" అని నరేంద్రుడు ఊరకే చెప్పలేదు; అతడి కి వైద్యశాస్త్రంలో చక్కని పరిజ్ఞానం ఉంది. ఆ పరిజ్ఞానం ఆధారంతోనే అలా చెప్పాడు🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి