24, అక్టోబర్ 2023, మంగళవారం

వేడి నీళ్లు

 

వేడి నీళ్లు
నిజానికి నీరు చల్లగా వేడిగాను ఉండటం నీటి స్వభావం కాదు.  నీటి గుణం ఎప్పటికి ఒకే విధంగా ఉంటుంది.  కానీ చల్లదనం కానీ వేడిదనం కానీ సమయానుకూలంగా నీటికి కలిగే ఒక తాత్కాలిక మార్పు.  ఈ మార్పు నీరు వుండే ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. మన గదిలో ఉన్న నీరు సాధారణ ఉష్ణోగ్రతలో ఉంటుంది.  కానీ అదే నీరు మనం వేడి చేస్తే దాని ఉష్ణోగ్రత పెరిగి వేడిగా మారుతుంది అప్పుడు మనం వేడి నీరు అని అంటారు.  నిజానికి వేడి అనేది నీటి యొక్క తత్త్వం కాదు అది కేవలం అగ్నితత్వం.  ఎంతసేపైతే అగ్ని నీతితో అనుసంధానం అయి ఉంటుందో అంతవరకూ వేడి నీరు అని నీరు పిలవబడుతుంది.  నిజానికి వేడి నీరు ఎల్లప్పుడూ వేడి నీరు కాదు అది నీటిలో వేడి వున్నంతవరకు మాత్రమే వేడి యొక్క లక్షణం చూపెడుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.
మానవుడు దశ ఇంద్రియాలతో ఉండి జీవన వ్యాపారం చేస్తుంటారని మనందరికీ తెలుసు. దశ ఇంద్రియాలు అంటే ఐదు కర్మేంద్రియాలు,(కర్మేంద్రియ పంచకం:  వాక్కు పాణి పాదం పాయువు ఉపస్థ, జ్ఞానేంద్రియ పంచకం: త్వక్కు = చర్మం చక్షువు = కన్ను రసన = నాలుక శ్రోతం = చెవి ఘ్రాణం = ముక్కు ) కర్మేంద్రియాలు పనులు చేస్తూవుంటాయి జ్ఞ్యానేంద్రియాలు బాహ్య ప్రపంచ జ్ఞ్యానాన్ని మనకు అందిస్తూవుంటాయి. సుఖఃమంగా ఇది ప్రతి వారికి తెలిసిందే. ఇక్కడ ప్రశ్న యేమని ఉదయిస్తుందంటే ఈ జ్ఞ్యానేంద్రియాలు జ్ఞానాన్ని ఎవరికి అందిస్తున్నాయి. రెండు కర్మేంద్రియాలు వాటి వాటి పనులు ఎవరి పర్యవేక్షణలో చేస్తున్నాయి. ఈ రెండు ప్రశ్నలు కూడా సాధారణ జ్ఞ్యానానికి అందానివి.
ఏ రకంగా అయితే నీటిలో అగ్ని ఉండి నీటిని వేడి నీరు అని పిలిపిస్తున్నదో అదే విధంగా శరీరంలో ఆత్మా ఉండి శరీరాన్ని పరోక్షంగా నడిపిస్తున్నది. ఆ అంతరంగంలో ఉండి శరీరంను నియంత్రించి శరీరానికి వేడిని అందిస్తున్నది.  ఏ రకంగా నీటిలో అగ్ని తొలగిన తర్వాత నీరు వేడినీరుగా పిలువబడదో అదేవిధంగా ఈ శరీరంలో వేడి తొలగిన తరువాత జీవుడిగా పిలువపడదు.  అప్పుడు శరీరం ఉన్నాకూడా శరీరపు జీవ లక్షణాలు కనిపించవు.  కేవలం పార్దవం (మట్టిగా) మాత్రమే అవుతుంది. సాధకుడు అయినవాడు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ సత్యం సాధకునికి తెలుస్తుందో అప్పుడు అతని స్ఫురణకు వచ్చే విషయం ఏమిటంటే ఈ శరీరంలో జీవ వ్యాపారాలు కేవలం శరీరంలో వేడి వున్నంతవరకు మాత్రమే జరుగుతాయి ఎప్పుడైతే వేడి చల్లారిపోతుందో అప్పుడు శరీరం నిస్చేస్టులతో మిగిలిపోతుంది.
శరీరంలో వున్న ఆత్మా ఈ సృష్టికి మూలకారణం అయినా పరమాత్మ తత్త్వం అయి ఒకటిగానే బాసిల్లుతున్నదని మన మహర్షులు వారి అనంత మేధాసంపత్తితో గాంచి మనకు వారి జ్ఞ్యానాన్ని ఉపనిషత్తుల రూపంలో ప్రసాదించారు.
సాధకుడు ఈ శరీరం అశాశ్వితం అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు శాశ్వితము, నిత్యం, అనంతము ఆయిన్ బ్రహ్మ పదాన్ని చేరుకోవాలని అభిలషిస్తాడు.
ఉపనిషత్తులో "ప్రజ్ఞానం బ్రహ్మ" అనే మహావాక్యం ఇదే తెలుపుతుంది.  ఈ మహా వాక్యం ప్రకారం జన్మనం కలిగి ఉండటమే బ్రహ్మ అని అర్ధం అంటే బ్రహ్మకు సంబందించిన జ్ఞ్యానం కలగటం అన్న మాట.
నిర్వికల్ప వైరాగ్యం ఎప్పుడైతే మనిషికి కలుగుతుందో అప్పుడు మనస్సు ప్రశాంతత చెంది బ్రహ్మము సర్వము అనే భావన లోకి వస్తాడు. సాధన సంపత్తితో (గతంలో ఈ సాధకుడు వ్రాసిన వ్యాసాన్ని చూడండి) ముందుగా మనస్సును శుద్ధి చేసుకొని తర్వాత వైరాగ్యాన్ని పొందితే ఆత్మ జ్ఞానం తప్పకుండా కలుగుతుంది. జీవన్ముక్తి దొరుకుతుంది.
కాబట్టి సాధక ఈ క్షణమే మేలుకో నీ గమ్యం వైపు అడుగులు వేయి.
ఓం శాంతి శాంతి శాంతిః
మీ
భార్గవ శర్మ

 

కామెంట్‌లు లేవు: