బ్రహ్మ మాకు సరియా?
--------------------------------------
ఉ: " పెక్కు ముఖంబులన్జదివె వేదము , లంతట నిద్ర సోమరై
క్రక్కున నీటిలోఁ గలిపెఁ ,గ్రమ్మర నేర్చుట సామెఱుంగు , నీ
యెక్కువ యేమి బ్రహ్మకని ? ఏకముఖంబున సాంగవేదముల్
ల్దక్కక నేర్చి బుధ్ధి నచలస్థితిఁ దాలుతు రప్పురిన్ ద్విజుల్ .
శశాంక విజయము-2 ఆ - 15 వ:పద్యము:-శేషము వేంకటపతి!
దక్షిణాంధ్రయుగంలో ఉద్వేలమైన శృంగార కావ్యద్వయంలో శశాంకవిజయం మొదటిది. రెండవది ముద్దుపళని రాధికాసాత్వనం. అంత బరితెగించిన కావ్యాలైనా వాటిలోకూడా చక్కని కావ్యగుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువలన రసజ్ఙులైన
పండితులు వానినాదరించి మెచ్చినారు. ప్రస్తుత పద్యము శేషము వేంకటపతి శశాంక విజయములోనిది. కవి ప్రతిష్ఠాన పురమును వర్ణించుచు అచటి బ్రహ్మణుల తీరుతెన్నుల నీపద్యమున వివరించినాడు.
అక్కడిబ్రాహ్మణులు బ్రహ్మ మాకన్నా గొప్పవాడేమీ కాడు. అతనికన్నా మేమే యెక్కువ అని గొప్పగా చెప్పుకుంటారట, .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి