. *🪐నవగ్రహా పురాణం🪐*
. *63వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*చంద్రగ్రహ చరిత్ర - 1*
ద్వారం దాటి మందిరం లోపలకి వస్తున్న నారదమహర్షిని చూసి , చంద్రుడు కూర్చున్న చోటి నుంచి లేచి , ఆయనకు ఎదురుగా నడిచాడు. చంద్రుడి నడకలో ఉత్సాహం లేదు , వేగమూ లేదు.
*"ప్రణామం , మహర్షీ !"* చంద్రుడు చేతులు జోడిస్తూ అన్నాడు.
*"కళ్యాణమస్తు !"* నారదుడు చిరునవ్వుతో దీవించాడు. *“ఇంకా గతంలోనే కూరుకుపోయి , నిరాశగా ఉన్నావని నీ వాలకం చెస్తోంది సుమా !”.*
చంద్రుడు బరువుగా నిట్టూర్చాడు. *"మీకు నిజం చెప్పాలి ! గతం గుండెను కెలుకుతూనే ఉంది !"*
నారదుడు చిరునవ్వు నవ్వాడు. *"గురుపత్నితోటి అక్రమ బంధం గుండెను కెలుకుతూనే ఉంటుంది , చంద్రా ! తార ఈ మందిరంలోంచి వెళ్లిపోయింది. నీ హృదయ మందిరంలోంచి ఆమె జ్ఞాపకాలు కూడా వెళ్ళిపోవాలి !"*
చంద్రుడు విరక్తిగా నవ్వాడు. *“అది అంత సులభం కాదు !"*
*“నారాయణ ! 'చాలా సులభం' అని తార నిరూపించిందిగా !"* నారదుడు నవ్వుతూ.. అన్నాడు , కూర్చుంటూ.
చంద్రుడు ప్రశ్నార్థకంగా చూశాడు.
*"ఔను చంద్రా ! తార గతాన్ని పూర్తిగా మరిచిపోయింది ! పతిదేవుడి పాద సేవలో పరవశిస్తోంది !"*
చంద్రుడు దయనీయంగా చూశాడు.
*“తన గృహిణీ ధర్మానికి ఆమె పునరంకితమవడానికి కారణం ఏమిటో తెలుసా ?”* నారదుడు చిరునవ్వుతో అన్నాడు. *“ఆమెకి అక్కడ లభించిన తోడు ! భర్త సాహచర్యం !"*
చంద్రుడి కళ్ళల్లో ఏదో అర్థం కాని ఆవేదన కదలాడుతోంది.
నారదుడు మళ్ళీ తనే అన్నాడు: *“ఎందుకు చెప్తున్నానంటే , కాంత లేని ఏకాంతం నీలాంటి సరసుడికి నిత్య శిక్షే ! నీకూ ఇక్కడ ఒక 'ఆడతోడు' ఉందనుకో ! ఎలా ఉండేవాడివి ? ఒకసారి ఆలోచించు ! బృహస్పతి తన అనురాగంతో , ఆదరణతో తార అంతరంగం మీద వాలి ఉండే నీ నీడను తరిమివేసినట్టే , నీ 'ఆడతోడు' ఇంకా తొందరగా నీ గుండెను కప్పివేసిన తార నీడను వెళ్ళగొట్టి ఉండేది !”*
నిజమేనేమో అన్నట్టు చంద్రుడు తలను బలహీనంగా ఆడించాడు. చెప్తున్నానంతే - వివాహం చేసుకోవాలి , నువ్వు ! 'వివాహం విరహనాశని' *“ఎందుకు సుమా !”* నారదుడు నవ్వాడు.
చంద్రుడు కూర్చున్న చోటు నుంచి లేచి , నారదుడి వైపు వీపు త్రిప్పి , గోడవైపు నెమ్మదిగా అడుగులేశాడు.
కన్యను ఎవరిస్తారంటూ నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ! నువ్వు చూడ చక్కని వాడివి గురుపత్ని వెంటపడిందంటే - ఆ చంద్రుడు ఎంత అందగాడో అని అందరూ అనుకుంటున్నారు ! దక్షప్రజాపతి తెలుసు కదా ! ఆ దంపతుల అంతఃపురం నిండా ఆడపిల్లలే ! ప్రస్తుతానికి ఒక ఇరవై ఏడుగురు 'చక్కని చుక్కలు' వివాహానికి సర్వసిద్ధంగా ఉన్నారు ! ఈ నారదుడు ప్రతిపాదిస్తే , ఆ దక్షుడు కాదనడు...! తన వైపు తిరిగి చంద్రుణ్ణి చూస్తూ ఆపేశాడు నారదుడు
చంద్రుడి ముఖం మీద ఏదో కొత్త ఉత్సాహం కదలాడ సాగింది. నారదుడు చిరునవ్వు నవ్వాడు.
*"నీ అభిప్రాయం చెప్పు , చంద్రా ! దక్షప్రజాపతి దంపతులను మెల్లగా..."*
*"ముందుగా నా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం మంచిదనిపిస్తోంది !"* చంద్రుడు అడ్డువస్తూ అన్నాడు.
*"ఆ పని చేయాల్సింది నారదుడు కాదు , దక్షుడు మనం అనుమానించాల్సిన అవసరం లేదు ! దక్షుడు కార్యదర్శులు కూడా !"*
చంద్రుడు మొదటిసారిగా చిరునవ్వు నవ్వాడు నారదుడు అతని కళ్ళల్లోకి సూటిగా , తదేకంగా చూశాడు *"నీకు ఒక చిన్న నీతి బోధిస్తాను. తారా మునుపటి తార కాదు. మానసికంగా పునర్జన్మ ఎత్తింది బృహస్పతికి 'ధర్మపత్ని'గా మారిపోయింది. తార ఇప్పుడు 'పరదార' ! పరధారల గురించి పగటి కలలు కనకూడదు సుమా !"*
దక్ష ప్రజాపతి నారదుడి ప్రతిపాదనను లోలోపలే పరిశీలిస్తూ ఉండిపోయాడు.
*"ఆత్రేయుడు గురుతల్పగతుడై అపఖ్యాతిని మూటగట్టుకున్నాడుగా , నారద?"* ప్రశ్నించాడు దక్షుడు
*"నారాయణ తల్పగతుడుకాక ఏం చేస్తాడు , పాపం ? ఆ తార అందాలరాశి ఆ చంద్రుణ్ణి ఒంటరివాణ్ణి చేసి , పైటతో విసిరింది ! చివరికి ఆ అమాయకుణ్ణి కొంగుతో ముడివేసుకొని , వలచింది ! వలపించింది అయినా , ఆ ఇద్దరి పాపాలు ప్రక్షాళనమై పోయాయి గదా!"*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి