14, ఆగస్టు 2021, శనివారం

శ్రీమద్భాగవతము

 *14.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

* పద్యం: 2230(౨౨౩౦)*


*10.1-1334-*


*మ. జవసత్వంబులు మేలె? సాము గలదే? సత్రాణమే మేను? భూ*

*ప్రవరుం బోసన మిమ్మనంగ వలెనే? పాళీ లభీష్టంబులే?*

*పవివో? కాక కృతాంతదండకమవో? ఫాలాక్షు నేత్రాగ్నివో?*

*నవనీతంబుల ముద్దగాదు; మెసఁగన్ నా ముష్టి గోపార్భకా!* 🌺



*_భావము: చాణూరుడు శ్రీకృష్ణుని అవహేళన చేస్తూ, ఇంకా రెచ్చగొడుతున్నాడు: "శరీరం లో వేగం, బలము బాగా ఉన్నాయా? సాము గీము చేస్తున్నావా? ఒళ్ళు గట్టిపడిందా? రాజుతో మిమ్మల్ని బ్రతికిపోనీయమని సిఫారసు చెయ్యాలా? మల్లవిద్యలో మెలకువలు చూస్తావా? ఇష్టమేనా? వెన్నముద్ద తినటం కాదు నా పిడికిటి పోటంటే ఏమనుకున్నావో? ఇది పిడుగుపాటువంటిది, యమదండాన్ని పోలినది, ముక్కంటినుండి వెడలిన అగ్నిజ్వాల వంటిది. జాగ్రత్త!!"_* 🙏

 


*_Meaning: In derisive language, Chanura continues to taunt and provoke Sri Krishna contemptuously: ”Is your body equipped with agility, power and speed? Are you practising wrestling bouts daily or else I can appeal to my king to pardon you? Are you interested in seeing the typical techniques in boxing from me? Beware! Receiving blows from my lightning-like clenched fist is not like eating butter and curd. This is similar to the stroke of Yama and the flame emanated from the third eye of ParamaSiva.”_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

కామెంట్‌లు లేవు: