14, ఆగస్టు 2021, శనివారం

హిరణ్యకశిపుని వరాలు

 హిరణ్యకశిపుని వరాలు  సేకరణ సి. భార్గవ శర్మ , న్యాయవాది 


హిరణ్యకశిపుని ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు కావలసిన వరంకోరుకోమనిఅనుగ్రహించాడు  వరంలో ఇమిడి ఉన్న 21 కోరికల చిట్టా క్రింద ఇవ్వబడింది.


ఆయన ఏదో వరం కోరుకోమన్నాడు సరేఅది తను పట్టుపడితేనే కదాఈయన ఏకంగా ఇరవై ఒక్క (21) కోరికలను కలిపి కూరేసి వరం అని కోరాడటతన కోసం కాదట తమ్ముడి (హిరణ్యాక్షుడిమరణానికి ప్రతీకారం కోసం అటఅది కూడా ప్రతీకారం ఎవరి మీద తీర్చుకోవాలో వారి కొడుకును వరాలు కోరుతున్నాడు. (విష్ణుమూర్తి నాభి కమలంలో బ్రహ్మదేవుడు పుట్టాడుఅందుకే అసంబద్ధ కోరికలను హిరణ్యాక్షవరాలు అని అంటారు ఏమో?

 

1              గాలిలో మరణం లేకుండుట;

2              నేలమీద మరణం లేకుండుట;

3              నిప్పుతో మరణం లేకుండుట;

4              నీటిలో మరణం లేకుండుట;

5              ఆకాశంలో మరణం లేకుండుట;

6              దిక్కులలో మరణం లేకుండుట;

7              రాత్రి సమయంలో మరణం లేకుండుట;

8              పగటి సమయంలో మరణం లేకుండుట;

9              చీకట్లో మరణం లేకుండుట;

10           వెలుగులో మరణం లేకుండుట;

11           జంతువులచే మరణం లేకుండుట;

12           జలజంతువులచే మరణం లేకుండుట;

13           పాములచే మరణం లేకుండుట;

14           రాక్షసులుతో యుద్ధంలోమరణం లేకుండుట;

15           దేవతలుతో యుద్ధంలో మరణం లేకుండుట;

16           మానవులు తో యుద్దంలో మరణం లేకుండుట;

17           అస్త్రాలు వలన మరణం లేకుండుట;

18           శస్త్రాల వలన మరణం లేకుండుట;

19           యుద్దాలలో ఎవరూ ఎదురు నిలువలేని శౌర్యం;

20           లోకపాలకు లందరిని ఓడించుట;

21           ముల్లోకాలపైన విజయం.


కామెంట్‌లు లేవు: