14, ఆగస్టు 2021, శనివారం

నేనే దేముడిని:

 నేనే దేముడిని

నేనే దేముడిని అనే వాదం మొదటి సారిగా మనం హిరణ్యకశ్యపునిలో  చూస్తాముతాను నేనే దేముడిని అని అనటంలో నిజానికి అర్ధం వుంది కూడా,ఎందు కంటే   హిరణ్యకశ్యపుడు మహా బలవంతుడుమహా తపోశక్తి వంతుడుఇంద్రాది దేవతలనినవగ్రహాలని తన స్వాధీనంలో తెచ్చుకున్న ధీశాలిఅంత శక్తీ వంతుడు తన శక్తీ వల్ల వచ్చిన గర్వంతో తానూ దేముడిని అని అనుకునటంలో కొంత అర్ధం వుంది

 

మరి ఇప్పుడు ఎలాంటి శక్తి లేని సామాన్యు మానవులు తాము బాబా లమని సాక్షాతూ ఫలానా దేముడి అవతారలమనిమేము  మాయలు చేస్తాము  మాయలు చేస్తాము  అని సామాన్యు ప్రజలని మభ్య పెట్టి అనేక విధాలుగా వ్యాపారాలు చేస్తూ ఉంటేఅమాయక ప్రజలు వారి మాటలు నమ్మి వారి పూజలువ్రతాలువారికి అస్ట్తోతరాలుసహస్ర నామ పూజలుభజనలుహారతులు ఇచ్చి తమ మూఢ భక్తిని చాటుకుంటున్నారుఅంతే కాదు ఎవరైనా పండితులుజ్ఞానులు మీరు చేసేది పొరపాటు అట్లా మన హిందూ ధర్మాన్నిసంప్రదాయాలని పాడు చేయవద్దని అంటే వారిని ఇష్టమొచ్చినట్లు విమర్శించటం చేస్తున్నారు.

 

మన సమాజంలో సరైన మార్గ నిర్దేశం చేసే వారు లేక పోవటమే  దీనికి కారణంమనం దేముడిని తాత్కాలికమైన ఐహిక మైన తుచ్చమైన వాంచితాలని కొరకుడదని అది అసురత్వం అవుతుందని మనలో చాలా మందికి తెలియదుదానికి కూడా కారణం లేక పోలేదుమనలో చాలా మంది శ్రీమత్ భగవత్ గీత జీవితంలో ఒక్క సారి కూడా చదవక పోవటమే

 

శ్రీమత్ భగవత్ గీత లో కృష్ణ భగవానుడు 16 అధ్యాయంలో దైవత్వాన్ని గూర్చి అసురత్వాన్ని గూర్చి నిశితంగా విశదీకరించారు.   మానవుడు శ్రీమత్ భగవత్ గీత చదువుతాడో అతను తప్పక జీవితంలో ఒక క్రమశిక్షణా పరుడు దేముడి మీద ఒక స్థిర భావం కలిగిన వాడు అవుతాడుఅతను తప్పక మన ముందు కనిపించే ఇతర మనుషులను దేముడిగా అంగీకరించాడుగీతా జ్ఞానం సంపూర్ణంగా అలవవరచుకున్న మానవుడు సాక్షాత్తు తానే భగవంతుడు అవుతాడు అందుకు సందేహం లేశమంతయినా లేదు

కామెంట్‌లు లేవు: