14, ఆగస్టు 2021, శనివారం

త్రివర్ణ పతాకాన్ని

 త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిస్తే జైలుకే.. ఇవిగో నిబంధనలు

 

భారత ప్రజలు జరుపుకునే వేడుకల్లో ప్రధానమైనది స్వాతంత్య్ర దినోత్సవం. బ్రిటిష్ పాలన నుంచి భారతీయులకు విముక్తి లభించి నేటికి 71 సంవత్సరాలు గడిచాయి. 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దేశ ప్రజలంతా సిద్ధమవుతున్నారు. త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తప్పనిసరి. జెండాను అగౌరవపరిచే విధంగా ప్రవర్తిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అది తెలిసి చేసినా, తెలియక చేసినా నేరమే అవుతుంది. జెండా ఆవిష్కరణలో అపశ్రుతులు చోటు చేసుకోకూడదు...


జాతీయ జెండా ఆవిష్కరణ - నిబంధనలు...


✪ జాతీయ పతాకం మూడు రంగులు సమాన వెడల్పు గల పట్టీల్లో పై పట్టి కాషాయ(కేసరి) వర్ణం, మధ్యలో తెలుపు, దిగువ పట్టీలో ముదురు ఆకుపచ్చ రంగు ఉండాలి.


✪ జెండా పరిమాణం 3:2 (పొడవు, వెడల్పు) నిష్పత్తిలో ఉండాలి.

✪ 24 చువ్వలతో నావికా నీలం రంగులో ఉండే ఆశోక చక్రం తెలుపు పట్టీ మధ్యలో ఉండాలి.

✪ భారత జాతీయ పతాకాన్ని ఖాదీ, చేనేత వస్త్రాలతో మాత్రమే తయారు చేయాలి. ముడి పదార్థాలుగా నూలు, పత్తి, ఉన్ని వాడొచ్చు.

✪ ఇతర వాటితో తయారుచేస్తే జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష పడే వీలుంది.

✪ జెండా ఎగురవేసినప్పుడు కాషాయ వర్ణం పైకి వచ్చేలా జాగ్రత్త తీసుకోవాలి.


✪ జాతీయ జెండాను వేదికలు, భవనాల కప్పు, పిట్టగోడలపై నుంచి వేలాడదీయకూడదు.

✪ జాతీయ జెండాకు సమానంగా గానీ, ఇంకా ఎత్తులో గానీ ఏ ఇతర జెండా ఎగురకూడదు.

✪ జెండా ఎగురవేత, దించే సమయంలో వ్యక్తులందరూ జెండాకు అభిముఖంగా నిలబడాలి.

✪ సూర్యోదయం తరవాత జెండాను ఎగురవేసి, సూర్యస్తమయానికి ముందే కిందికి దించాలి.

✪ జాతీయ జెండాను వ్యాపార, వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోకూడదు.

✪ జాతీయ జెండాను పోల్‌కు చిట్టచివరనే ఎగురవేయాలి. సగం కిందకు దించి ఎగురవేయకూడదు.

✪ కార్లు, బైకులపై వెనుక భాగంలో జెండాను పెట్టరాదు.


జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి

మువ్వన్నెల జెండా ఇలా రూపొందింది

కామెంట్‌లు లేవు: