☝️శ్లోకం
అతిపరిచయాదవజ్ఞతా
సన్తతగమనాదనాదరో భవతి ।
మలయే భిల్లపురన్ధ్రీ
చన్దనతరుకాష్ఠమిన్ధనం కురుతే
భావం: ఒక గొప్ప వ్యక్తి తరచుగా ఎవరిదగ్గరికైనా లేదా ఎవరింటికైనా తరుచూ వెళుతూ ఉన్నా ఆ వ్యక్తి చులకనకి గురికాబడతాడు. ఇది అతి పరిచయం వలన వచ్చిన ప్రతిస్పందన. మలయ పర్వత సానువులలో అత్యంత విలువైన మంచి గంధపు చెట్లు విశ్తారంగా మొలుస్తాయి, వృద్ధి చెందుతాయి. ఆటవిక జాతికి చెందిన భిల్ల జాతీయులు ఆ మలయ పర్వత సానువులలోనే సంచరిస్తూ ఉంటారు. ఆ మలయ పర్వత సానువులలో నివశించే భిల్ల జాతి స్త్రీ తన యొక్క నిత్యావసర వంటచెరుకు కోసం అక్కడ విస్తారంగా ఉండే అత్యంత విలువైన మంచి గంధపు చెట్లని కొట్టి తన వంట చెరుకుగా ఉపయోగిస్తూ ఉంటుంది.
ఉన్నతమైన వ్యక్తి ఆతని విలువని అర్థం చేసుకోలేని సామాన్య జనాన్ని అత్యంత సన్నిహితంగా మెలగనీయనిస్తే అత్యంత విలువైన మంచి గంధపు వృక్షం వలె అవజ్ఞతా భావానికి గురికాక తప్పదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి