13, డిసెంబర్ 2021, సోమవారం

శ్రీరమణీయం* *-(252)*_

 _*శ్రీరమణీయం* *-(252)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"వర్తమానంలో వచ్చే కర్మలను నేను మార్చుకోవచ్చా ?"*_


_*ప్రస్తుతం మనముందుకు వచ్చే ఏ కర్మ అయినా గతంపైనే ఆధారపడి ఉంది. దాన్ని మార్చుకోలేం. మనం యోగిలా జీవించాలో, భోగిలా జీవించాలో గత కర్మలే నిర్ధేశిస్తాయి. కర్తృత్వం లేకుండా ఆ కర్మలను చేయటం ద్వారా భవిష్యత్ జీవితాన్ని మార్చుకోవచ్చు. అంతఃప్రయాణానికి ఒక ప్రత్యేక లక్ష్యం అవసరం లేదు. ఎందుకంటే ఏ సాధనా మార్గంలో వెళ్ళినా చేరేది ఆ గమ్యానికే. కానీ బాహ్యజీవనానికి లక్ష్యం చాలా అవసరం. బాహ్య జీవనవృత్తులే మానసిక ప్రవృత్తులకు కారణం. నేరుగా మనసును నియంత్రించలేం. కాబట్టి ఆలోచనలకు కారణమైన మన బాహ్యవృత్తులనే అదుపు చేసుకోవాలి. ఈ దేహంతో ఏ పనులు చేసినా ప్రాణంగావున్న పరమాత్మే చేయిస్తున్నాడన్న సత్యం స్మరణలో ఉండాలి. మన మనసు నిశ్చలంగా లేకపోవటం అనాదిగా ఉన్నదే. దైనందిన జీవితం దైవధ్యానానికి దూరం కాదని శ్రీరమణమహర్షి చెప్పారు. రోజంతా విచ్చలవిడిగా జీవించి ఒక గంట కళ్ళుమూసుకుని కూర్చుంటే ధ్యానం తెలియదు. జీవన విధానాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటే జీవితమంతా ధ్యానమే అవుతుంది. అదే మన పూర్వికులు సూచించిన ధార్మిక జీవనం !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'పని స్ఫురించని మనసే ధ్యానం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: