*ఆచార్య సద్భావన*
నిజమైన భక్తుడు తన సర్వస్వాన్ని భగవదర్పణ గావిస్తాడు. అలా చేయడం వల్లనే జీవిత పరమార్థాన్ని సాధిస్తాడు. మనలో వ్యక్తమయ్యే శక్తికి మూలకేంద్రం ఒకటి ఉంది. దానిని తెరిచేందుకు నిరంతర ప్రేమ భావనతో కూడుకున్న సేవ, వినయం, భక్తి సాధనములు. ఆ శక్తి నిరంతరంగా ప్రవహించేందుకు వీలుని కలిగించాలి. మన హృదయం అణకువను కలిగి ఉన్నప్పుడే ఆ ప్రేమ జ్యోతి కాంతులు మన ద్వారా ప్రసరించబడతాయి. ఆ ప్రవాహపు వెల్లువ మన చుట్టూ ఉన్న వారికి కూడా వారి జీవితాలను కూడా ధన్యం గావిస్తుంది.
అందుకై మనం భగవంతుని ఈ విధంగా వేడుకోవాలి.
*శ్రీమన్నారాయణా!*
మేము సదా మీ అడుగుజాడలలో నడువగలిగేలా మమ్మల్ని ఆశీర్వదించుము, మిమ్మల్ని వదిలిపెడితే మాకు వేరు దిక్కు లేదనే సంగతి మేము గ్రహించెదము గాక, మా జీవనం మీ సమర్పణమై మా హృదయం శాంతి నిలయమై భాసిల్లును గాక.
సర్వేజనా స్సుఖినోభవంతు.
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి