*శ్రీకృష్ణుడుకి వేణువు అంటే ఎందుకు అంత ఇష్టం..?*
*ఒకసారి రాధకు ఇదే అనుమానం వచ్చింది, ఏముంది ఈ వేణువులో..? ఎందుకు దీనిని కృష్ణస్వామి వదలడు..? ఈ వేణువు రహస్యం ఏమిటో తెలుసుకోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ కూచుంది రాధ, ఒక రోజు కృష్ణుడు నిద్రపోతూ కనిపించాడు, అంతే దభాలున స్వామి పక్కన ఉన్న వేణువును తీసుకుని దానిలోకి తొంగిచూసింది, దానిలో ఏమీలేదు, అంతా ఖాళీ, రాధ అలా చూస్తుండగా కృష్ణుడు నవ్వుతూ లేచి "రాధా..! ఇప్పుడు అర్థం అయ్యిందా వేణువు రహస్యం, నిన్ను నీవు ఖాళీ చేసుకుంటే, నీలోకి కృష్ణ తత్వం ప్రవేశిస్తుంది, నిన్ను నీవు అనవసర విషయాలతో నింపేసుకుంటే, ఇక నాకు చోటేది"..? అప్పుడు రాధకు వేణువును కృష్ణుడు ఎందుకు ఇష్ట పడతాడో అర్థం అయ్యింది, భౌతికంగా చూస్తే మన వెన్నెముకనే వేణువు, దాని లోని రంధ్రాలు యోగ చక్రాలకు ప్రతీకలు, దాని గుండా ప్రాణాయామం ద్వారా శ్వాస నియంత్రణ చేసామంటే, కుండలిని సహస్రారానికి తగిలి కృష్ణ దర్శనం అవుతుంది, అర్థం అయ్యిందిగా కృష్ణస్వామికి వేణువు అంటే ఎందుకు ఇష్టమో..! ఇక శరీరాన్ని వెదురు చేసుకోవాలా..? వేణువు చేసుకోవాలా అనేది మన ఇష్టం..!!✍️*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి